E-Paper
Advertisement

Trending Cruiser Bikes Jan 2026: న్యూ ఇయర్ టాప్ ట్రెండింగ్ క్రూయిజర్ బైక్స్ ఇవే.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Trending Cruiser Bikes Jan 2026: న్యూ ఇయర్ టాప్ ట్రెండింగ్ క్రూయిజర్ బైక్స్ ఇవే.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Trending Cruiser Bikes Jan 2026 In India: జనవరి 2026లో దేశీ మార్కెట్లో పలు క్రూయిజర్ బైకులు టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి. హోండా CB350 H’nessతో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటియోర్ 350, క్లాసిక్ 350, హంటర్ 350 మార్కెట్ లో దుమ్మురేపుతున్నాయి. ప్రీమియం, రాబోయే ట్రెండ్స్ లో హార్లే డేవిడ్సన్ X440, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650, కీవే V302C సహా పలు బైక్స్ ఉన్నాయి. 2026లో కీలక బాగా పోటీ పడే క్రూయిజర్ బైకులుగా జావా 42 బాబర్, టీవీఎస్ రోనిన్ కొనసాగుతున్నాయి.

జనవరి 2026 టాప్ ట్రెండింగ్ క్రూయిజర్ బైక్స్  

⦿ రాయల్ ఎన్‌ ఫీల్డ్ మెటియోర్ 350: ఈ బైక్ సుదూర ప్రయాణాలకు చాలా సౌకర్యంగా ఉంటుంది. క్రూయిజర్ బైకులను ఇష్టపడే వారికి ఇది టాప్ ఛాయిస్ గా చెప్పుకోవచ్చు. ఈ బైక్ ధర రూ. 1.95 లక్షలు ఉంటుంది.

Advertisement

⦿ హోండా H’ness CB350: అదిరిపోయే ఇంజిన్ పవర్ తో ఆకట్టుకుంటుంది. ఇది కూడా హైవే రైడింగ్ కు అనుగుణంగా ఉంటుంది. ఈ బైక్ ధర రూ.1.92 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

⦿ హార్లే-డేవిడ్సన్ X440: ప్రీమియం, మోడర్న్ రెట్రో స్టైలింగ్‌ తో ఆకట్టుకుంటుంది. ఈ బైక్ ధర రూ. 2.34 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Advertisement

⦿ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350: వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే బైక్స్ లో ఇది టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. దీని ధర రూ. 1.81 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

⦿ Jawa 42 Bobber: కస్టమ్, రెట్రో స్టైలింగ్ విషయంలో బాగా పాపులర్ అయ్యింది. ఈ బైక్ ధర సుమారు రూ. 1.95 లక్షలుగా ఉంటుంది.

⦿ TVS రోనిన్: ప్రస్తుతం బెస్ట్ అర్బన్ క్రూయిజర్ ఆప్షన్ గా కొనుగుతోంది. దీని ధర రూ. 1.25 లక్షల నుంచి ప్రారంభం అవువుతుంది.

⦿ బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 160: ఈ బైక్ సుమారు రూ. 1.2 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ క్రూయిజర్ ఆప్షన్ గా కొనసాగుతోంది.

Read Also: యమహా To కవాసకి.. 2026లో ట్రెండింగ్ స్పోర్ట్స్ బైక్స్ ఇవే!

త్వరలో లాంచ్ కాబోయే క్రూయిజర్ బైక్స్    

⦿ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650 ట్విన్: యంగ్ రైడర్స్ ఈ బైక్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీని ధర రూ. 3.37 – రూ.3.5 లక్షలు ఉంటుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.

⦿ ఓలా ఎలక్ట్రిక్ క్రూయిజర్:  ఈ ఎలక్ట్రిక్ బైక్ కూడా 2026 ఫిబ్రవరి లేదంటే మార్చిలో విడుదల కానుంది. ఇది ఎలక్ట్రిక్ క్రూయిజర్ ట్రెండ్‌ మరింత ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంది.

⦿ TVS జెప్పెలిన్ R: ఈ బైక్ కోసం చాలా మంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. 2026 మిడ్ ఇయర్ లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

⦿ BSA బాంటమ్ 350: ఈ బైక్ 2026 మిడ్ ఇయర్ లో లాంచ్ కానుంది. ఇదో క్లాసిక్ బ్రిటిష్ ఎక్స్ పీరియెన్స్ ను అందిస్తుంది.

Read Also: విన్ ఫాస్ట్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్లు, లాంచింగ్ ఎప్పుడంటే?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×