Padma Awards 2026: టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మకు ( Rohit Sharma ) అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్ లో టీమిండియాకు ( Team India) ఎన్నో విజయాలు అందించిన నేపథ్యంలో రోహిత్ శర్మకు పద్మశ్రీ అవార్డు (Padma Awards 2026 ) ఇస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. టీమిండియా కు ఇప్పటి వరకు రెండు ఐసీసీ టోర్నమెంట్లు అందించాడు రోహిత్ శర్మ. ఈ తరుణంలోనే పద్మశ్రీ అవార్డు రోహిత్ శర్మకు దక్కనుంది. రోహిత్ శర్మతో పాటు వన్డే వరల్డ్ కప్ గెలిచిన హర్మన్ ప్రీత్ కౌర్ కు ( Harmanpreet Kaur ) పద్మశ్రీ అవార్డు దక్కనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది కేంద్రం.
కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ సంవత్సరంలో క్రీడాల రంగంలో ఏకంగా ఎనిమిది క్రీడాకారులకు పద్మశ్రీ పురస్కారాలు ( Padma Shri ) దక్కబోతున్నాయి. ముఖ్యంగా క్రికెట్ రంగంలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కు పద్మశ్రీ అవార్డ్స్ లభించాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది.
అదే సమయంలో మహిళల హాకీ గోల్ కీపర్ సవితా పూనియాకు కూడా అవకాశం కల్పించింది కేంద్రం. అథ్లెట్ ప్రవీణ్ కుమార్, పంజాబ్ కు చెందిన బల్దేవ్ సింగ్, మధ్యప్రదేశ్ నుంచి భగవాన్ దాస్ రాయిక్వార్, పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన పజనీవెల్ ను ఈ పద్మశ్రీ అవార్డులు వరించనున్నాయి. అటు జార్జియా కు చెందిన వ్లాదిమిర్ మెస్ట్విరిష్విలి మరణాంతరం పద్మశ్రీ ప్రకటించారు.
టీమిండియా వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మ ( Rohit Sharma ) ఎన్నో విజయాలను అందించాడు. ముఖ్యంగా ఐసీసీ నిర్వహించిన టి20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ రెండు కూడా రోహిత్ శర్మ ఆధ్వర్యంలోనే టీమిండియా దక్కించుకుంది. ఈ రెండు టోర్నమెంట్లలో జట్టును ముందుండి నడిపించాడు రోహిత్ శర్మ. అయితే 2023 వన్డే వరల్డ్ కప్ సమయంలో కూడా ఫైనల్ దాకా టీమిండియా వెళ్ళింది. కానీ ఆస్ట్రేలియా రోహిత్ శర్మ పాలిట విలన్ గా మారింది. ఫైనల్స్ లో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.
దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు వరల్డ్ కప్ గెలిచే అవకాశం రాలేదు. అయితే వరుసగా ఐసీసీ టోర్నమెంట్లు టీమ్ ఇండియాకు అందించిన నేపథ్యంలో రోహిత్ శర్మకు పద్మ శ్రీ అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అటు టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్న జరిగిన వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో ( Women’s ODI World Cup 2025 ) ఇండియాను ఛాంపియన్ గా నిలిపారు హర్మన్ ప్రీత్ కౌర్. ఈ తరుణంలోనే కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ కు కూడా ఈ పద్మశ్రీ పురస్కారం దక్కింది.
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨
Two-time ICC title–winning captain Rohit Sharma and Women’s ODI World Cup–winning captain Harmanpreet Kaur will be conferred with the Padma Shri for their contributions to sports. 🎖️🇮🇳#Cricket #RohitSharma #HarmanpreetKaur #Sportskeeda pic.twitter.com/V3AOfiBI5u
— Sportskeeda (@Sportskeeda) January 25, 2026