E-Paper
Advertisement

Trending EV Scooters of February 2026: ఓలా To ఏథర్.. ఫిబ్రవరి 2026లో ట్రెండింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Trending EV Scooters of February 2026:  ఓలా To ఏథర్.. ఫిబ్రవరి 2026లో ట్రెండింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
Advertisement

చాలా మంది భారతీయులు పెట్రో స్కూటర్లను వదిలి ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్ ట్రెండ్స్, జనవరి 2026 అమ్మకాల డేటా, రాబోయే లాంచింగ్స్ ఆధారంగా, ఫిబ్రవరి 2026లో టాప్ ట్రెండింగ్ EV స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఫిబ్రవరి 2026లో టాప్ ట్రెండింగ్ EV స్కూటర్లు  

⦿ TVS iQube: జనవరి 2026లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ లో కొనసాగుతోంది. ఒకే ఛార్జ్ మీద 212 కి.మీ రేంజ్ తో పాటు  7 అంగుళాల TFT స్క్రీన్, బలమైన బిల్డ్ క్వాలిటీ, ఫ్యామిలీ ప్రయాణాలకు అనుకూలంగా ఉండటంతో ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.

Advertisement

⦿ ఓలా S1 ప్రో: మంచి పర్ఫార్మెన్స్ ఉన్న ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను కూడా ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఒకే ఛార్జ్ మీద 242 కి.మీ నుంచి 320 కి.మీ వరకు ప్రయాణించే వేగాన్ని కలిగి ఉండటం, 117 నుంచి 128 కి.మీ టాప్ స్పీడ్ ను కలిగి ఉండటం ఈ స్కూటర్ కు కలిసి వచ్చింది.

⦿ ఏథర్ రిజ్టా: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యామిలీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. సౌకర్యవంతమైన ప్రయాణం చేసే అవకాశం ఉండటంతో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ స్కూటర్ ఒకే ఛార్జ్ మీద ఏకంగా 159 కి.మీ. వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది.

Advertisement

⦿ బజాజ్ చేతక్: ఈ స్కూటర్ రెట్రో డిజైన్, ప్రీమియం మెటల్ బిల్డ్, అప్ డేట్ చేసిన ధరతో కూడిన లేటెస్ట్ వేరియంట్లను వినియోగదారులు బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ స్కూటర్లలో ఒకటిగా కొనసాగుతోంది.

⦿ విడా: విడా స్కూటర్లు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. రిమూవ్ చేసే బ్యాటరీ ప్యాక్‌లు, 165 కి.మీ రేంజ్, 7-అంగుళాల టచ్‌ స్క్రీన్‌తో ట్రాక్షన్‌ ను కలిగి ఉంటుంది. ఇది వినియోగదారులకు అనుకూలమైన ఎంపికగా మారింది.

⦿ రివర్ ఇండీ: బలమైన బిల్డ్ క్వాలిటీ, యుటిలిటీ సెంట్రల్ డిజైన్, 161 కి.మీ రేంజ్, 14 ఇంచుల వీల్స్ తో బాగా అమ్మకాలు కొనసాగిస్తుంది.

⦿ Yamaha EC-06: ఈ స్కూటర్ ఫిబ్రవరి 2న లాంచ్ అయ్యింది. 4 kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఒకే ఛార్జ్ తో 169 కి.మీ రేంజ్ ను కలిగి ఉంటుంది.

ట్రెండింగ్‌లో లాంచ్ కాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు

⦿ యమహా ఏరోక్స్-ఇ: ఈ స్కూటర్ ఈ ఏడాది Q1లో లాంచ్ కానుంది. బోల్డ్ లుక్, మంచి పనితీరు ను కలిగి ఉండబోతోంది. 3 kWh డ్యూయల్ బ్యాటరీ సిస్టమ్‌ తో కూడిన స్పోర్టీ మోడల్ బాగా ట్రెండ్ అవుతోంది.

⦿ సుజుకి ఇ యాక్సెస్: రీసెంట్ గా నే ఈ స్కూటర్ లాంచ్ అయ్యింది. 3.07 kWh బ్యాటరీ, 95 కి.మీ రేంజ్ తో ఆకట్టుకుంటుంది. సౌకర్యవంతమైన ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.

⦿ TVS జూపిటర్ ఎలక్ట్రిక్: ఈ స్కూటర్ ఫిబ్రవరి 2026లో విడుదల కానుంది. 3-3.5 kWh బ్యాటరీతో ప్రసిద్ధ, సౌకర్యవంతమైన ICE నేమ్‌ ప్లేట్‌ను EV మార్కెట్‌లోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.

⦿ సింపుల్ ఎనర్జీ వన్: ఈ స్కూటర్ మంచి పనితీరుతో ఆకట్టుకుంటుంది. ఒకే ఛార్జ్ తో 236 కి.మీ వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది.

Read Also:  విన్ ఫాస్ట్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×