E-Paper
Advertisement

ట్రయంఫ్ నుంచి మరో క్లాసిక్ బైక్.. బోన్నెవిల్ 400 డీటైల్స్ రివీల్!

ట్రయంఫ్ నుంచి మరో క్లాసిక్ బైక్.. బోన్నెవిల్ 400 డీటైల్స్ రివీల్!
Advertisement

New Triumph Bonneville 400: భారత మార్కెట్లో ట్రయంఫ్ 400 సిరీస్‌కు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు అందరి దృష్టి రాబోయే ట్రయంఫ్ బోన్నెవిల్ 400పై పడింది. ఈ కొత్త మోటార్‌ సైకిల్ గురించి తాజాగా మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. క్లాసిక్ లుక్‌ ను ఇష్టపడే రైడర్ల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న ఈ బైక్, స్టైల్‌ తో పాటు మరింత కంఫర్ట్  అందించబోతోంది.

కస్టమ్ యాక్సెసరీలతో మార్కెట్లోకి!

ట్రయంఫ్ బోన్నెవిల్ 400ను కంపెనీ అనేక కస్టమ్ యాక్సెసరీలతో మార్కెట్లోకి తీసుకురానుంది. పెద్ద బోన్నెవిల్ మోడళ్ల నుంచి ప్రేరణ పొందిన ఈ యాక్సెసరీలు బైక్‌కు మరింత ప్రీమియం లుక్ ఇవ్వనున్నాయి. ముఖ్యంగా టూరింగ్ ఫ్లై స్క్రీన్, బెంచ్ స్టైల్ సీట్, టూరింగ్ సీట్, బార్ ఎండ్ మిర్రర్స్, బ్యాక్ రెస్ట్, వాక్స్డ్ లెదర్ శాడిల్ బ్యాగ్స్ లాంటి ఫీచర్లు ఇందులో ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు ఇంజన్ గార్డులు, క్రోమ్ ఫినిష్ భాగాలు కూడా బైక్ అందాన్ని మరింత పెంచనున్నాయి.

ఇంజిన్ గురించి..

Advertisement

ఈ బైక్‌లో ఉపయోగించే ఇంజన్ కూడా ప్రత్యేకంగా ట్యూన్ చేయబడుతుందని తెలుస్తోంది. ట్రయంఫ్ స్పీడ్ 400లో ఉన్న 349cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఆధారంగానే దీన్ని రూపొందించినప్పటికీ, బోన్నెవిల్ 400 కోసం ట్యూనింగ్‌ లో మార్పులు చేయనున్నారు. ముఖ్యంగా లో ఎండ్, మిడ్ రేంజ్ టార్క్‌ పై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది. దీంతో నగర రోడ్లపై తక్కువ గేర్ మార్పులతోనే సాఫీగా రైడ్ చేయవచ్చు. రోజువారీ ప్రయాణాలకు మరింత సౌకర్యంగా ఉండబోతోందని ఆటో రంగ నిపుణులు చెబుతున్నారు. బోన్నెవిల్ 400లో 6 స్పీడ్ గేర్‌ బాక్స్ ఇవ్వనున్నారు. రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ ను మరింత మెరుగుపరచడానికి సస్పెన్షన్ సెటప్ కూడా కంఫర్ట్‌ పై దృష్టి పెట్టేలా ఉండొచ్చని అంచనా. క్లాసిక్ రోడ్‌ స్టర్ స్టైల్‌ తో పాటు అత్యాధునిక టెక్నాలజీతో  ఈ బైక్ ప్రత్యేకంగా ఆకట్టుకోనుంది.

అదిరిపోయేలా డిజైన్..

డిజైన్ పరంగా చూస్తే, ఈ బైక్ పెద్ద బోన్నెవిల్ మోడళ్ల మాదిరిగానే రౌండ్ హెడ్‌ ల్యాంప్, టియర్‌ డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, సింగిల్ పీస్ సీట్ లాంటి డిజైన్ ఎలిమెంట్స్‌ తో రానుంది. దీని వల్ల పాతకాలపు బైక్ ఫీలింగ్‌ తో పాటు ఆధునిక పనితీరు కూడా లభించే అవకాశం ఉంది.

సెప్టెంబర్ లో భారత మార్కెట్ లో విడుదల

Advertisement

ట్రయంఫ్ బోన్నెవిల్ 400ను 2026 సెప్టెంబర్‌లో భారతదేశంలో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధర విషయానికి వస్తే, ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.2 లక్షల లోపే ఉండొచ్చని తెలుస్తోంది. ఇదే నిజం అయితే, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.  ప్రస్తుతం భారత మార్కెట్లో క్లాసిక్ స్టైల్ బైక్‌ లకు మంచి డిమాండ్ ఉంది. అలాంటి సమయంలో ట్రయంఫ్ నుంచి వచ్చే ఈ కొత్త బోన్నెవిల్ 400, స్టైల్, బ్రాండ్ వ్యాల్యూ, రైడింగ్ కంఫర్ట్ కొనుగోలుదారులను ఆకట్టుకోనున్నాయి.

Read Also: స్కోడా నుంచి ఎంట్రీ లెవల్ ఈవీ లాంచ్.. రేంజ్, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×