E-Paper
Advertisement

హీరో, హోండాకు టీవీఎస్ షాక్.. ఆగస్టులో నంబర్ వన్ టూ వీలర్ కంపెనీగా రికార్డ్!

హీరో, హోండాకు టీవీఎస్ షాక్.. ఆగస్టులో నంబర్ వన్ టూ వీలర్ కంపెనీగా రికార్డ్!
Advertisement

India Two Wheeler Sales August 2026: ఇండియన్ టూ వీలర్ మార్కెట్‌ లో టీవీఎస్ మోటార్ కంపెనీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆగస్టు 2026లో నెలవారీ అమ్మకాల పరంగా దేశంలోనే నంబర్ వన్ కంపెనీగా నిలిచింది. ఇప్పటి వరకు టాప్ ప్లేస్ లో కొనసాగిన హీరో మోటోకార్ప్, హోండా రెండింటినీ టీవీఎస్ వెనక్కి నెట్టింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరిగిన డిమాండ్, ఎగుమతుల్లో వృద్ధి టీవీఎస్ అమ్మకాలకు బాగా కలిసి వచ్చింది.

టీవీఎస్‌దే నెంబర్ వన్ ప్లేస్   

ఆగస్టులో టీవీఎస్ మొత్తం 5,91,437 ద్విచక్ర వాహనాలను డిస్పాచ్ చేసింది. గతేడాది ఆగస్టులో నమోదైన 4,90,788 యూనిట్లతో పోలిస్తే ఇది దాదాపు 21 శాతం వృద్ధి. కంపెనీ చరిత్రలోనే ఇదే అత్యధిక నెలవారీ టూ వీలర్స్ డిస్పాచ్. దేశీయ మార్కెట్లో టీవీఎస్ 4,33,796 యూనిట్లను అమ్మింది.  మరోవైపు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మకాలు ఏకంగా 137 శాతం పెరిగి 59,453 యూనిట్లకు చేరాయి. ఎగుమతులు కూడా 29 శాతం పెరిగి 1,57,641 యూనిట్లుగా నమోదయ్యాయి.

రెండో స్థానంలో హోండా

Advertisement

హోండా మోటార్‌ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఆగస్టులో 5,79,162 యూనిట్లను అమ్మింది. గతేడాది ఇదే నెలలో 5,34,861 యూనిట్లతో పోలిస్తే 8 శాతం వృద్ధి నమోదైంది. దేశీయ అమ్మకాలు 5,17,329 యూనిట్లకు చేరగా, ఎగుమతులు 15 శాతం పెరిగి 61,833 యూనిట్లుగా నమోదయ్యాయి. మంచి వృద్ధి సాధించినప్పటికీ టీవీఎస్ కంటే కొంత వెనుకబడింది.

మూడో స్థానానికి పడిపోయిన హీరో

ఎప్పటినుంచో ఇండియన్ టూ వీలర్ మార్కెట్‌ లో అగ్రస్థానంలో ఉన్న హీరో మోటోకార్ప్ ఆగస్టులో 5,68,398 యూనిట్ల డిస్పాచ్‌తో మూడో స్థానంలో నిలిచింది. గతేడాది 5,53,727 యూనిట్లతో పోలిస్తే కేవలం 2.65 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. హీరో దేశీయ ICE వాహనాల సరఫరా 5,16,747 యూనిట్లుగా ఉంది. కంపెనీకి చెందిన VIDA ఎలక్ట్రిక్ బ్రాండ్ మాత్రం 25,558 యూనిట్లతో 38 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే, ఎగుమతులు 24.6 శాతం తగ్గి 26,093 యూనిట్లకు పడిపోయాయి.

బజాజ్‌కు మంచి బూస్టింగ్

Advertisement

బజాజ్ ఆటో మొత్తం 4,43,748 యూనిట్లను డిస్పాచ్ చేసింది. గతేడాది 3,41,887 యూనిట్లతో పోలిస్తే దాదాపు 30 శాతం వృద్ధి నమోదైంది. దేశీయ అమ్మకాలు 10 శాతం పెరగగా, ఎగుమతులు ఏకంగా 53 శాతం పెరిగాయి. అటు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆగస్టులో 1,26,479 యూనిట్ల అమ్మకాలతో 11 శాతం వృద్ధిని సాధించింది. క్లాసిక్ 350 గోర్ఖా ఎడిషన్, అప్‌డేటెడ్ కాంటినెంటల్ GT 650 వంటి మోడళ్లకు మంచి స్పందన లభించింది.  సుజుకి 1,20,611 యూనిట్ల అమ్మకాలతో 6 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశీయ మార్కెట్లో అమ్మకాలు పెరిగినప్పటికీ, ఎగుమతులు తగ్గాయి.

మొత్తంగా చూస్తే, పండుగ సీజన్‌కు ముందు టూ వీలర్ మార్కెట్‌లో మంచి ఊపు కనిపిస్తోంది. ముఖ్యంగా టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల వృద్ధి, ఎగుమతుల బలంతో హీరో, హోండాను దాటి అగ్రస్థానానికి చేరడం ఆటో మార్కెట్‌ లో ఆసక్తి కలిగిస్తోంది.

Read Also: కొత్త కలర్స్‌ తో కవాసకి Z సిరీస్.. నయా లుక్ సూపరో సూపరు!

Tags

Related News

పెట్రోల్‌తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కియా సైరోస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వచ్చేస్తోంది!

కొత్త కలర్స్‌ తో కవాసకి Z సిరీస్.. నయా లుక్ సూపరో సూపరు!

కియా సోరెంటో వచ్చేసింది.. ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలే!

హిమాలయన్ 440 వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

టాటా కర్వ్‌ లో కొత్త సిరీస్ X.. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు!

హోండా ఫ్యాన్స్‌ కు గుడ్‌న్యూస్.. ఎలివేట్, సిటీ, అమేజ్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు!

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

Big Stories

Advertisement
×