E-Paper
Advertisement

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!
Advertisement

SIR Notices: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ జీహెచ్‌ఎంసీ పరిధిలో గతంలో SIRలో దరఖాస్తు చేసుకున్న ప్రజలకు ప్రస్తుతం 50 శాతం నోటీసులు జారీ అవుతుండటంతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. మేడ్చల్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని మూడు డివిజన్లలో మొత్తం 66,503 మంది ఓటర్లు ఉండగా.. 31,276 నోటీసులు జారీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో భారీ సంఖ్యలో ప్రజలు నోటీసుల ప్రక్రియతో సంబంధం ఉన్న సవరణలు, వివరణల కోసం అధికారులను సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడింది.దరఖాస్తుదారులు SIR ఫారంలో తమ పేరు, తండ్రి పేరు, ఇంటి నంబర్, చిరునామా తదితర వివరాలను సక్రమంగా నమోదు చేసినప్పటికీ, వాటిని అధికారులు ఆన్‌లైన్‌లో టైప్ చేసే సమయంలో పేర్లు, చిరునామాలు, ఇతర వివరాల్లో పొరపాట్లు చోటుచేసుకుంటున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు.

అధికారుల తప్పిదాలు..

అధికారులు నమోదు చేసే సమయంలో జరిగిన చిన్నపాటి పొరపాట్లు సైతం ప్రజలకు పెద్ద సమస్యగా మారుతున్నాయి. రికార్డుల్లో వివరాలు తప్పుగా నమోదవడంతో వాటిని సరిచేయించుకునేందుకు దరఖాస్తుదారులు తమ సొంత పనులు, ఉపాధిని వదిలి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.ఒక్క అక్షరం తప్పుగా టైప్ చేసినా.. దాని ప్రభావం మాత్రం ఓటరుపైనే! అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వివరాలను నమోదు చేసిన వెంటనే వాటిని మరోసారి పరిశీలించి ఉంటే ఇలాంటి సమస్యలు తలెత్తేవి కావని స్థానికులు అంటున్నారు. ముఖ్యంగా రోజువారీ కూలీలు, వృద్ధులు, మహిళలు తమ పనులు మానుకుని కార్యాలయాలకు రావాల్సి రావడం తీవ్ర ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. ఒకసారి వచ్చినా సమస్య పరిష్కారం కాకపోవడంతో పలుమార్లు తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు.

Advertisement

Also read: భారీ వర్షాలకు దెబ్బతిన్న ట్రాక్.. రైళ్ల రాకపోకలకు బ్రేక్!

66 వేల ఓటర్లు.. 31 వేలకుపైగా నోటీసులు!

మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలో మూడు డివిజన్ల పరిధిలో 66,503 మంది ఓటర్లకు గాను 31,276 నోటీసులు జారీ కావడం ద్వారా ఈ ప్రక్రియ ఎంత పెద్ద స్థాయిలో కొనసాగుతుందో అర్థమవుతోంది. ఇంత పెద్ద సంఖ్యలో నోటీసులు జారీ చేస్తున్న సమయంలో అధికారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉండగా, వివరాల నమోదులో పొరపాట్లు చోటుచేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల దరఖాస్తులను సక్రమంగా నమోదు చేయాల్సిన అధికారుల తప్పిదాలకు సామాన్య ప్రజలు ఎందుకు కార్యాలయాల చుట్టూ తిరగాలి? అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి SIR ఫారాల్లో ప్రజలు ఇచ్చిన అసలు వివరాలను, అధికారులు నమోదు చేసిన వివరాలతో పోల్చి పరిశీలించాలని, తప్పులను వెంటనే సరిచేయాలని, సవరణల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు అనవసర తిప్పలు లేకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Also read: పాకిస్తాన్ కోచ్ లుగా షోయ‌బ్ అక్త‌ర్‌, అఫ్రిదిల‌ను పెట్టుకోండి..!

Tags

Related News

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

Big Stories

Advertisement
×