E-Paper
Advertisement

TVS Electric Design: TVS నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్, డిజైన్ అదిరింది భయ్యా!

TVS Electric Design: TVS నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్, డిజైన్ అదిరింది భయ్యా!
Advertisement

New TVS eFX 3O Electric Design: TVS మోటార్ కంపెనీ తన ఎలక్ట్రిక్ టూవీలర్ పోర్ట్‌ ఫోలియోను మరింత విస్తరించాలని భావిస్తోంది. తాజాగా ఈ కంపెనీకి చెందిన తొలి ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ కు పేటెంట్ లభించింది. eFX 3O అని పిలువబడే ఈ మోటార్ సైకిల్‌ ను EICMA 2025లో ఓ కాన్సెప్ట్‌ గా చూపించారు. తాజాగా కంపెనీ ఇండియాకు చెందిన డిజైన్ పేటెంట్‌ను దాఖలు చేసింది. ఈ కొత్త మోడల్ బైక్ లో ఫీచర్లు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

TVS ఫస్ట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ గురించి..

తాజాగా TVSకు సంబంధించిన డిజైన బయటకు వచ్చింది. TVS eFX 3O డిజైన్ ను పరిశీలిస్తే, ప్రస్తుత కమ్యూటర్ ఫోకస్డ్ EVల నుంచి చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ చాలా స్పోర్టియర్‌గా కనిపిస్తుంది. అదే సమయంలో మరింత జోష్ గా ఉంటుంది. మొత్తంగా సిల్హౌట్ స్ట్రీట్‌ ఫైటర్  డిజైన్ లా కనిపిస్తుంది. అగ్రెసివ్ క్యారెక్టర్, బుల్కీ ఫ్రంట్ సెక్షన్, షార్ప్ లుక్, మినిమలిస్టిక్ టెయిల్ తో కనిపిస్తుంది.

Advertisement

ఈ మోడల్ గత సంవత్సరం ప్రదర్శించబడిన మాట్టే మోడల్ గ్రే కలర్ లో కాంట్రాస్టింగ్ ఎల్లో లైన్ తో ఉంటుంది.  ఇది యాంగ్యులర్, మస్క్యులర్ హౌసింగ్‌ లాంటి ఫ్యుయెల్ ట్యాంక్ ను కలిగి ఉంటుంది. దీనిని కంట్రోల్ యూనిట్,  ఛార్జింగ్ హార్డ్‌ వేర్ లాంటి ఎలక్ట్రానిక్ భాగాలకు ఉపయోగించవచ్చు. అంతేకాకుండా, పెద్ద బ్యాటరీ కేసింగ్‌లో హారిజంటల్ కూలింగ్ ఫిన్స్ ను కలిగి ఉంటుంది. ఫ్రేమ్‌ లో మిడ్ మౌంటెడ్ మోటారు ఉంది. USD ఫ్రంట్ ఫోర్కులు, స్ట్రాంగ్ స్వింగార్మ్, మోనోషాక్ సస్పెన్షన్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఫ్రంట్, రియర్ లో పెటల్ డిస్క్‌లతో రానున్నాయి.

Read Also: అమ్మకాల్లో దుమ్మురేపిన ఈవీలు, జనవరి 2026లో నెంబర్ వన్ ఈ స్కూటరే!

సరికొత్త టెక్నాలజీతో అందుబాటులోకి..

Advertisement

ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ సరికొత్త టెక్నాలజీతో అందుబాటులోకి రానుంది. తాజాగా పేటెంట్ పొందిన ఫోటోలు హ్యాండిల్‌ బార్ల పైన అమర్చబడిన కాంపాక్ట్ రెక్టాంగులర్ TFT డిస్‌ ప్లేను కలిగి ఉంటుంది. TVS కంపెనీ అధికారికంగా ఈ ఫీచర్లను కన్ఫార్మ్ చేయకపోయినా, ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ సపోర్ట్,  పలు రైడ్ మోడ్స్ లాంటి ముఖ్యమైన ఫీచర్లను కలిగి ఉంటుంది.

బ్యాటరీ, రేంజ్ గురించి..

అటు ఈ TVS బైక్ కు సంబంధించి పవర్ అవుట్‌ పుట్, బ్యాటరీ సామర్థ్యం, రియల్ వరల్డ్ రేంజ్ కు సంబంధించిన ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. అయితే, డిజైన్ ఇప్పుడు భారత్ లో పేటెంట్ ను పొందింది. కాన్సెప్ట్ ఇప్పటికే అంతర్జాతీయంగా లాంచ్ అయ్యింది. eFX 3O ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ విభాగంలోకి ఎంట్రీ ఇవ్వాలనే  TVS ప్రణాళికలకు బలమైన సూచనగా కనిపిస్తుంది.

Read Also: హీరో గ్లామర్ X 125 vs హోండా SP 125, ఏం మైలేజ్ గురూ!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×