E-Paper
Advertisement

HHVM 2: హరిహర వీరమల్లు 2 వస్తుందా.. ఆడియన్స్ లో సవాలక్ష ప్రశ్నలు!

HHVM 2: హరిహర వీరమల్లు 2 వస్తుందా.. ఆడియన్స్ లో సవాలక్ష ప్రశ్నలు!
Advertisement

HHVM 2: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. ఒకవైపు వరస సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు రాజకీయంగా దూసుకుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్.. స్వయంగా పలు ప్రాంతాలలో పర్యటన నిర్వహిస్తూ.. ప్రజలకు కావలసిన అవసరాలను తీరుస్తూ ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవంగా నిలుస్తున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నిజానికీ ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. మొదట ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వం వహించారు.

అంచనాలను మించలేకపోయిన హరిహర వీరమల్లు..

కానీ పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సరైన డేట్స్ ఇవ్వకపోవడం వల్ల.. అంతకాలం క్రిష్ ఓపిక పట్టలేక ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ చిత్ర నిర్మాత డివీవీ దానయ్య కొడుకు జ్యోతి కృష్ణ(Jyothy krishna) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కానీ ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా దాదాపు కొన్ని సంవత్సరాల పాటు వాయిదా పడి ఎట్టకేలకు గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఒక వర్గం ఆడియన్స్ ను ఏ మాత్రం మెప్పించలేకపోయింది.

పార్ట్ 2 అవసరమా?

Advertisement

దీనికి తోడు అదే సమయంలో ఈ సినిమాకి సీక్వెల్ ప్రకటించారు. కానీ చాలామంది పెదవి విరిచారు. దీనిపై క్రిష్ జాగర్లమూడి మాట్లాడుతూ.. నేను తెరకెక్కించిన చాలా భాగం సీక్వెల్ లోనే ఉంటుంది. ముఖ్యంగా ఎర్రకోటపై తీసిన కొన్ని సన్నివేశాలు మీకు మరింత ఆసక్తిని కలిగిస్తాయి. ఈ సినిమాలో వచ్చే ప్రతి అంశం కూడా ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది అంటూ ఆయన కామెంట్లు చేశారు. ఇక తర్వాత ఏమైందో కానీ దీని గురించి ఎక్కడ ప్రస్తావన రాలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మళ్లీ 14 ఏళ్ల తర్వాత హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

also read:Om Shanti Shanti Shantihi: పెళ్లయిన జంటలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన చిత్ర బృందం.. డోంట్ మిస్!

పవన్ కళ్యాణ్ నిర్ణయం ఎటువైపు..

Advertisement

అయితే ఇలాంటి సమయంలో తాజాగా సోషల్ మీడియాలో హరిహర వీరమల్లు పార్ట్ 2 గురించి పెద్ద చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 30% పూర్తయిందని హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా గతంలోనే తెలపడంతో మేకర్స్ ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు జ్యోతి కృష్ణ కూడా త్వరగా స్క్రిప్ట్ పూర్తి చేసుకొని సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ విషయం ఇప్పుడు వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొదటి భాగం ఫలితం చూసిన తర్వాత కూడా మళ్లీ పవన్ కళ్యాణ్ ఈ రిస్కు చేస్తారా? అనేది ఇప్పుడు సవాలక్ష అభిమానుల ప్రశ్న.

పవన్ కళ్యాణ్ కి అభిమానులు సలహా..

మొదటి భాగానికి వచ్చిన నెగటివ్ రెస్పాన్స్ దృష్ట్యా పవన్ ఈ సీక్వెల్ ను పక్కన పెట్టడమే మంచిది అని కూడా అభిమానులు సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని సీక్వెల్ చేస్తారా? లేక పక్కనపడేసి తన కొత్త సినిమాపై దృష్టి పెడతారా? అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అలాగే యూ వీ క్రియేషన్స్ బ్యానర్లో ఒక సినిమా చేస్తున్నట్లు సమాచారం.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×