E-Paper
Advertisement

HPV Vaccination: టీకా వేయాలంటే.. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి

HPV Vaccination: టీకా వేయాలంటే.. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి
Advertisement

HPV Vaccination: స్వేచ్ఛ బ్యూరో: గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన హ్యూమన్ పాపిలోమా వైరస్ ను అడ్డుకునేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మార్చి 8న ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో హెచ్‌పీవీ టీకా పంపిణీని ప్రారంభించనున్నారు. ఈ మేరకు బుధవారం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జిల్లాల వైద్యాధికారులకు ఉత్తర్వులు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని రెండు దశల్లో అమలు చేయనున్నారు. 8 మార్చి 2026 నుంచి ప్రారంభించి మూడు నెలల పాటు క్యాంపెయిన్ మోడ్ లో డ్రైవ్ చేయనున్నారు.

లెప్ట్ హ్యాండ్ కు టీకా..

ఈ మూడు నెలల గడువు ముగిసిన తర్వాత.. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను సాధారణ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్‌లో విలీనం చేస్తారు. అప్పటి నుంచి ప్రతి బుధవారం, శనివారం ఆసుపత్రుల్లో ఈ టీకా అందుబాటులో ఉంటుంది. 14 ఏళ్లు నిండిన బాలికలకు ‘గార్డాసిల్ 4’ వ్యాక్సిన్‌ను సింగిల్ డోస్‌గా ఇస్తారు. లెప్ట్ హ్యాండ్ కు టీకా వేసిన అనంతరం, చూపుడు వేలికి ఇంక్ వేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టీకా కేంద్రాలు పని చేస్తాయి.ఇక టీకా పొందాలనుకునే వారు ‘యూ-విన్’పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా నేరుగా సెంటర్‌కు వెళ్లి ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ఆధార్ కార్డు, స్కూల్ ఐడీ కార్డు లేదా బర్త్ సర్టిఫికేట్ వంటివి వెంట తీసుకెళ్లాలి.

Advertisement

Also Read: Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల్లో ఆ పదిమంది ఓటు ఎటు..?

లిఖితపూర్వక అనుమతి..

తల్లిదండ్రుల అనుమతి లేకుంటే నో వ్యాక్సిన్ బాలికలకు టీకా వేయాలంటే తల్లిదండ్రులు, సంరక్షకుల లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి అంటూ కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేగాక బాలికలు ఖాళీ కడుపుతో టీకా వేయించుకోకూడదన్నారు. టిఫిన్ లేదా భోజనం చేసిన తర్వాతే రావాలని సూచించారు. టీకా వేసిన తర్వాత అరగంట పాటు (30 నిమిషాలు) అబ్జర్వేషన్ రూమ్‌లో ఉంచాలి. ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వెంటనే చికిత్స అందించేలా ఏఈఎఫ్ఐ కిట్లు సిద్ధంగా ఉంచాలని కమిషనర్ డీఎమ్ హెచ్ వోలను ఆదేశించారు. మరోవైపు హెచ్‌పీవీ టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది 2006 నుంచి వాడుకలో ఉన్నదని, సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపదని, గర్భాశయ క్యాన్సర్ నివారణలో ఇది 93 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని అధికారులు వెల్లడించారు.

Advertisement

Also Read: Gadwal District: గద్వాల జిల్లా తహసిల్దార్ కార్యాలయాల్లో రాజ్యమేలుతున్న అవినీతి..!

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×