E-Paper
Advertisement

Rashid Latif: రాసిపెట్టుకోండి.. సెమీస్ లో 70 ప‌రుగుల‌కే టీమిండియా ఆలౌట్ అవుతుంది

Rashid Latif: రాసిపెట్టుకోండి.. సెమీస్ లో 70 ప‌రుగుల‌కే టీమిండియా ఆలౌట్ అవుతుంది
Advertisement

Rashid Latif:  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )   రెండో సెమీ ఫైనల్ ఇవాళ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ రెండో సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా   ( Team India vs England 2nd Semi-Final) తలపడతాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ( Wankhede Stadium, Mumbai)  ఈ రెండు జట్ల మధ్య బిగ్ ఫైట్ ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కట్టడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే సెమీఫైనల్ పైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయి ఇంటిదారి పడుతుందని.. 70 పరుగులకే ఆల్ అవుట్ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రషీద్ లతీఫ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: SA vs NZ 1st Semi-Final: టీమిండియా కోసం జై షా కుట్ర‌లు…ద‌క్షిణాఫ్రికాను కావాల‌నే ఇంటికి పంపార‌ని ట్రోల్స్ !

70 పరుగులకే టీమిండియా ఆల్ అవుట్.. విషం కక్కిన పాక్

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament )  భాగంగా ఇవాళ టీం ఇండియా, ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీ ఫైనల్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ ( Rashid Latif) స్పందించారు. బీసీసీఐ ఎన్ని కుట్రలు చేసినా, ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవడం కష్టమేనన్నారు. ఈ మ్యాచ్లో టీమిండియాను ఇంగ్లాండ్ చిత్తుగా ఓడించడం ఖాయం అంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఫైనల్స్ లో న్యూజిలాండ్ ను ఇంగ్లాండ్ ఓడిస్తుందని బాంబు పేల్చారు. ఈసారి ఛాంపియన్ ఇంగ్లాండ్ కావడం గ్యారంటీ అని తెలిపారు. టీమిండియాను ఓడించేందుకు ఇంగ్లాండ్ ప్లేయర్ ఒక్కడు రాణించినా సరిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీమిండియా కు ఆ ఒక్కటే సమస్య..!

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ రెండో సెమీ ఫైనల్ నేపథ్యంలో టీమిండియాను ఒకే ఒక సమస్య వేధిస్తోంది. అదే అభిషేక్ శర్మ ఫామ్. అతడు ఒక్కడు టచ్ లోకి వస్తే టీమిండియాను ఆపడం ఎవరి తరం కాదని అంటున్నారు. ఈ టోర్నమెంట్ లో ఇప్పటివరకు 100 పరుగులు కూడా సాధించలేకపోయాడు. ఒకే ఒక్క మ్యాచ్లో అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. మూడుసార్లు డక్ అవుట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియా టెన్షన్ పడుతోంది. అయినప్పటికీ అతన్ని ఈ మ్యాచ్లో ఆడించి.. అవకాశం ఇచ్చేందుకే టీమిండియా యాజమాన్యం సిద్ధమైంది.

Advertisement

Also Read: Pak Players: ఆయ‌న‌వి ఒంటెద్దు పోక‌డులు, కీలు బొమ్మ‌లాగా ఆడుకున్నాడు..కోచ్ పై ఫిర్యాదు చేసిన‌ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×