E-Paper
Advertisement

TVS Ronin Bike: స్టైలిష్ లుక్, సూపర్ మైలేజ్.. టీవీఎస్ రోనిన్ కు ఫిదా అవ్వాల్సిందే!

TVS Ronin Bike: స్టైలిష్ లుక్, సూపర్ మైలేజ్.. టీవీఎస్ రోనిన్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

TVS Ronin Bike 2026: టీవీఎస్ మోటార్ సైకిల్ కంపెనీ ఎప్పటికప్పడు దేశీ మార్కెట్లోకి సరికొత్త బైకులను అందుబాటులోకి తీసుకొస్తుంది. 2022లో విడుదలైన రోనిన్ బైక్ ను, 2025లో మళ్లీ అప్ డేటెడ్ వెర్షన్ లో విడుదల చేసింది. ప్రస్తుతం భారత్ లో 225 సీసీ క్రూజర్ మోటార్‌ సైకిల్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇది స్టైలిష్ డిజైన్, మంచి పెర్ఫార్మెన్స్, అదిరిపోయే ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. ఈ బైక్ కు సంబంధించిన ధర, మైలేజ్ సహా పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

టీవీఎస్ రోనిన్ వేరియంట్లు, ధరలు  

టీవీఎస్ రోనిన్ బైక్ ప్రస్తుతం 6 వేరియంట్లలో అందుబాటులో ఉంది. SS, DS, TD సింగిల్ టోన్, డ్యూయల్ టోన్, సబ్ వేరియంట్లలో లభిస్తుంది.

Advertisement

⦿ రోనిన్ SS (బేస్, లైట్నింగ్ బ్లాక్):  ధర రూ. 1,25,762

⦿ రోనిన్ DS: ధర రూ. 1,35,000 – రూ.1,49,200

Advertisement

⦿ రోనిన్ TD (టాప్, నింబస్ గ్రే, మిడ్‌నైట్ బ్లూ):  ధర రూ. 1,60,217

⦿ రోనిన్ ఇతర వేరియంట్లు: మాగ్మా రెడ్, డెల్టా బ్లూ లాంటివి రూ.1.49 లక్షలకు అందుబాటుటో ఉన్నాయి.  ఆన్ రోడ్ ధరలు మరికాస్త పెరిగే అవకాశం ఉంటుంది. సుమారు రూ. 1.40 లక్షల నుంచి రూ.1.75 లక్షల వరకు ఉంటుంది.

టీవీఎస్ రోనిన్ మైలేజ్

టీవీఎస్ రోనిన్  బైక్ కు సంబంధించి ARAI సర్టిఫైడ్ మైలేజ్ 42.95 కిలో మీటర్లు. కానీ, రియల్ వరల్డ్ మైలేజ్ విషయానికి వస్తే సిటీలో 35-40 కిలో మీటర్లు, హైవేలో 40-45 కిలో మీటర్లు వస్తుంది. రైడింగ్ స్టైల్ బట్టి మారే అవకాశం ఉంటుంది. ప్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం14 లీటర్లు ఉంటుంది.

టీవీఎస్ రోనిన్ కలర్స్

టీవీఎస్ రోనిన్ బైక్ మొత్తం 7 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అవి మాగ్మా రెడ్, లైట్నింగ్ బ్లాక్, డెల్టా బ్లూ, స్టార్‌గేజ్ బ్లాక్, నింబస్ గ్రే, మిడ్‌నైట్ బ్లూ,  ఆరెంజ్. టాప్ వేరియెంట్లలో డ్యూయల్ టోన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

Read Also: సెకెండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? కచ్చితంగా ఇవి చెక్ చేయాల్సిందే!

టీవీఎస్ రోనిన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

టీవీఎస్ రోనిన్ 225.9 సీసీ సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. పవర్ 20.1 bhp @ 7750 rpm, టార్క్ 19.93 Nm @ 3750 rpm ఉంటుంది. టాప్ స్పీడ్ గంటకు 120 కిలో మీటర్లు ఉంటుంది. 5 స్పీడ్ గేర్‌ బాక్స్ ఉంటుంది. అర్బన్, రైన్ రైడ్ మోడ్స్ ఉంటాయి. ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, కాల్, MS అలర్ట్స్ ఉంటుంది. LED హెడ్‌ లైట్,  టెయిల్ లైట్, స్లిప్పర్ క్లచ్, గ్లైడ్ థ్రూ టెక్నాలజీని కలిగి ఉంటుంది.  USB ఛార్జింగ్ పోర్ట్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, వాయిస్ అసిస్ట్ ఉంటుంది. 5 సంవత్సరాల వ్యారెంటీ ఉంటుంది. రెట్రో మోడర్న్ డిజైన్, కమ్యూటింగ్, టూరింగ్‌కు సూటబుల్ గా ఉంటుంది. 2026లో కొత్త కలర్ ఆప్షన్లు, మైనర్ ఫీచర్ అప్‌గ్రేడ్స్ రానున్నాయి.

Read Also: ఒక్క ఛార్జ్ తో 150 కి.మీ రేంజ్, ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అదుర్స్ అంతే!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×