E-Paper
Advertisement

India Pakistan Relations: అణు స్థావరాల జాబితా మార్పిడి.. 35 ఏళ్లుగా కొనసాగుతున్న భారత్-పాక్ సంప్రదాయం!

India Pakistan Relations: అణు స్థావరాల జాబితా మార్పిడి.. 35 ఏళ్లుగా కొనసాగుతున్న భారత్-పాక్ సంప్రదాయం!
Advertisement

India Pakistan Relations: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, దౌత్యపరమైన విభేదాలు ఎన్ని ఉన్నప్పటికీ భారత్, పాకిస్థాన్ దేశాలు ఓ కీలకమైన సంప్రదాయాన్ని మాత్రం విస్మరించలేదు. 2026 నూతన సంవత్సరం సందర్భంగా, దాయాది దేశాలు తమ అణు స్థావరాలు, కేంద్రాల జాబితాను పరస్పరం మార్చుకున్నాయి. గురువారం (జనవరి 1) న్యూఢిల్లీ మరియు ఇస్లామాబాద్‌లలో దౌత్య మార్గాల ద్వారా ఈ ప్రక్రియ ఏకకాలంలో పూర్తయింది.

భారత్, పాకిస్థాన్ మధ్య 1988 డిసెంబర్ 31న “అణు కేంద్రాలపై దాడుల నిషేధ ఒప్పందం” కుదిరింది. ఈ ఒప్పందం 1991 జనవరి 27న అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం, యుద్ధం లేదా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పుడు కూడా ఒక దేశం మరొక దేశంలోని అణు కేంద్రాలపై దాడి చేయకూడదు. ఈ రక్షణను కల్పించాలంటే, తమ దేశంలో అణు కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవతలి దేశానికి అధికారికంగా తెలియజేయాలి. అందుకే ప్రతీ ఏడాది జనవరి 1వ తేదీన ఈ జాబితాలను మార్చుకుంటారు.

Advertisement

ఈ ఒప్పందం ప్రకారం మొదటిసారిగా 1992 జనవరి 1న ఇరు దేశాలు జాబితాలను పంచుకున్నాయి. అప్పటి నుంచి ఏటా క్రమం తప్పకుండా ఈ ప్రక్రియ జరుగుతోంది. పుల్వామా దాడి, బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ వంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లోనూ ఈ సంప్రదాయానికి బ్రేక్ పడలేదు. నేటితో ఈ మార్పిడి జరగడం వరుసగా ఇది 35వ సారి.

అణు స్థావరాల జాబితాతో పాటు, ఇరు దేశాల జైళ్లలో మగ్గుతున్న పౌరులు, మత్స్యకారులు, రక్షణ సిబ్బంది వివరాలను కూడా ఈరోజు పరస్పరం అందజేసుకున్నారు. 2008 కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం ప్రకారం ఏడాదికి రెండు సార్లు (జనవరి 1, జూలై 1) ఈ ఖైదీల జాబితాను మార్చుకుంటారు. అణ్వాయుధ దేశాలైన భారత్, పాక్‌ల మధ్య విశ్వాసాన్ని పెంపొందించడానికి (Confidence Building Measures) ఈ ఒప్పందాలు ఎంతగానో దోహదపడుతున్నాయి.

Advertisement

Read Also: చలి తగ్గుముఖం.. తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు!

Related News

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

Big Stories

Advertisement
×