E-Paper
Advertisement

TVS Star City Plus: TVS స్టార్ సిటీ ప్లస్.. అత్యంత చౌకైన డిస్క్ బ్రేక్ బైక్ వచ్చేసింది!

TVS Star City Plus: TVS స్టార్ సిటీ ప్లస్.. అత్యంత చౌకైన డిస్క్ బ్రేక్ బైక్ వచ్చేసింది!
Advertisement

మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఆ బైక్ ఎక్కువ మైలేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే, మీకు బెస్ట్ ఆప్షన్ TVS స్టార్ సిటీ ప్లస్. ప్రస్తుతం మార్కెట్ లో అత్యంత తక్కువ ధరలో ఉన్న బైక్ గా ఇది గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు, ఫ్రంట్ డిస్క్ తో ఉన్న సరసమైన మోటార్ సైకిల్ కూడా ఇదే కావడం విశేషం. దీని ధర విషయానికి వస్తే, రూ. 75,200 (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది.  రోజువారీ అవసరాలకు అనుగుణంగా కంపెనీ దీనిని తయారు చేసింది. ఆఫీస్ ప్రయాణం, చిన్న నగరాలకు వెళ్లేందుకు, రొటీన్ పనులకు బాగా సరిపోతుంది.

TVS స్టార్ సిటీ ప్లస్ ఇంజిన్ గురించి..

TVS స్టార్ సిటీ ప్లస్ మంచి ఇంజిన్ ను కలిగి ఉంటుంది.  109.7cc, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ BS6 కంప్లైంట్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది పట్టణ రోడ్లపై మంచి పని తీరును కనబరుస్తుంది. ఇంకా చెప్పలంటే  మైలేజ్ ఫోకస్డ్, ఈజీ డైలీ కమ్యూటర్ గా గుర్తింపు తెచ్చుకుంది. 4-స్పీడ్ గేర్‌ బాక్స్‌ తో జత చేయబడి ఉంటుంది. ఈ బైక్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది.

Advertisement

Read Also: రోజువారీ అవసరాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, రేంజ్ కూడా సూపరండోయ్!

ఈ బైక్ కొత్త రైడర్లతో పాటు ఎక్స్ పీరియెన్స్ ప్రయాణీకులను అనుకూలంగా ఉంటుంది.  దాదాపు 90 కి.మీ.ల గరిష్ట వేగంతో ప్రయాణం చేస్తుంది. ఇది రోజువారీ రైడింగ్ అవసరాలను తీరుస్తుంది. స్టార్ సిటీ ప్లస్ ముఖ్యమైన పాజిటివ్ అంశాల విషయానికి వస్తే, అద్భుతమైన ఇంధన సామర్థ్యం. ఈ బైక్ లీటర్‌ కు 83 కి.మీ.ల మైలేజీని టీవీఎస్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే, వాస్తవ వినియోగానికి వస్తే లీటర్‌కు 70 నుంచి 75 కి.మీ.ల మైలేజీని అందిస్తుంది. 10 లీటర్ల సామర్థ్యంతో కూడిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయిస్తే, దాదాపు 800 కి.మీ. రైడింగ్ రేంజ్‌ ను పొందే అవకాశం ఉంటుంది.

తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లు

Advertisement

TVS స్టార్ సిటీ ప్లస్ ఫీచర్లు, భద్రత పరంగా ముందుటుంది. టాప్ వేరియంట్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, సింక్రొనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్, LED హెడ్‌ ల్యాంప్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ను అందిస్తుంది. దాని సరసమైన ధర, మైలేజ్, సౌకర్యం లాంటి లక్షణాలతో వినియోగదారులను బాగా ఆకట్టుకుంటుంది. టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్.. హీరో స్ప్లెండర్ ప్లస్, హోండా షైన్ లాంటి మోడళ్లతో బలంగా పోటీ పడుతుంది. ఈ బైక్ ధర రూ. 75,200 (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. ఆన్ రోడ్ ధర విషయానికి వస్తే, ఆర్టీఏ ఖర్చులు, ఇన్సూరెన్స్ తో కలుపుకుని, మరికాస్త ఎక్కువగా ఉంటుంది. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ తో రోజు వారీ అవసరాలకు ఉపయోగపడే బైక్ కావాలనుకునే వారికి TVS స్టార్ సిటీ ప్లస్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also:  టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా EV వచ్చేసింది.. రేంజ్ ఏంతో తెలుసా?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×