E-Paper
Advertisement

Viral Video: ఇది ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్.. మాకు ఏం పని లేదు, డ్యూటీలో మహిళా కానిస్టేబుల్ ఇన్‌స్టా లైవ్..

Viral Video: ఇది ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్.. మాకు ఏం పని లేదు, డ్యూటీలో మహిళా కానిస్టేబుల్ ఇన్‌స్టా లైవ్..
Advertisement

Viral Video: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్ చేసిన అతి ఉత్సాహం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విధి నిర్వహణలో ఉండి నిబంధనలు గాలికొదిలేసిన ఆమె తీరుపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) పోలీస్ స్టేషన్‌లో ప్రేమలత అనే మహిళా కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే..  ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ఆమె, డ్యూటీ సమయంలో సోషల్ మీడియా మోజులో పడ్డారు. యూనిఫాంలో ఉండి పోలీస్ స్టేషన్ ఆవరణలోనే వరుసగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ వాటిని అప్లోడ్ చేశారు. అంతటితో ఆగకుండా..  ఏకంగా డ్యూటీ టైమ్‌లోనే ఇన్‌స్టాగ్రామ్ లైవ్ స్ట్రీమింగ్‌ లోకి వచ్చి నెటిజన్లతో ముచ్చటించారు.

Advertisement

లైవ్ చూస్తున్న నెటిజన్లు కొందరు.. ‘డ్యూటీ సమయంలో లైవ్ చేయడం ఏంటి?’ అని ప్రశ్నించగా.. ఆమె అత్యుత్సాహంతో సమాధానమిచ్చారు. ‘ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్.. మాకు ఇక్కడ పెద్దగా పనేమీ లేదు..  అందుకే లైవ్‌లోకి వచ్చాను’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసు శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా ఆమె మాట్లాడిన తీరు చూసి నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి..  శాంతిభద్రతల గురించి పట్టించుకోకుండా ఇలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ లైవ్ వీడియో కాస్తా వైరల్ కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం..  డ్యూటీ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా సోషల్ మీడియాలో లైవ్ చేయడంపై జిల్లా పోలీస్ యంత్రాంగం సీరియస్ అయింది. యూనిఫాంలో ఉండి శాఖ గౌరవానికి భంగం కలిగించినందుకు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రేమలతపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Advertisement

ప్రస్తుతం ఈ ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ రీల్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

ALSO READ: Viral Video: నా లవర్‌ను అలా పిలుస్తావా.. నడిరోడ్డుపై జుట్లు పట్టుకుని పొట్టుపొట్టు..?

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×