E-Paper
Advertisement

టెసరాక్ట్ విడుదల మరింత ఆలస్యం.. మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుందంటే?

టెసరాక్ట్ విడుదల మరింత ఆలస్యం.. మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుందంటే?
Advertisement

Ultraviolette Tesseract Electric Scooter Launch:  భారత ఎలక్ట్రిక్ మార్కెట్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అల్ట్రావయోలెట్ టెసరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల మరింత ఆలస్యం కానుంది. తొలుత ఈ స్కూటర్ డెలివరీలను 2026లో ప్రారంభించాలని కంపెనీ భావించినప్పటికీ, ఇప్పుడు వాటిని జనవరి 2027కు వాయిదా వేసింది. కొత్త మార్పులు, టెక్నికల్ అప్‌గ్రేడ్‌ల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

రైడర్ల సూచనలతో కీలక మార్పులు

2025లో టెసరాక్ట్ కాన్సెప్ట్‌ ను ఆవిష్కరించిన తర్వాత, అల్ట్రావయోలెట్ ఈ స్కూటర్‌ ను దేశంలోని 30కి పైగా నగరాలకు తీసుకెళ్లి వినియోగదారుల అభిప్రాయాలను సేకరించింది. రైడర్ల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని స్కూటర్‌ లో పలు మార్పులు చేసింది. ముఖ్యంగా సౌకర్యంపై ఎక్కువ దృష్టి పెట్టింది. రైడర్, పిలియన్ ఇద్దరికి మరింత సౌకర్యంగా ఉండేలా సీటును కాస్త వెడల్పుగా తయారు చేశారు. సీటులో ఉపయోగించే ఫోమ్ నాణ్యతను కూడా మెరుగుపరిచారు. పొట్టిగా ఉండే రైడర్లు కూడా సులభంగా వాహనాన్ని నియంత్రించగలిగేలా ఫ్లోర్‌ బోర్డ్ డిజైన్‌ ను తిరిగి రూపొందించారు. దీంతో కాళ్లకు ఎక్కువ స్థలం లభిస్తుంది.

టెక్నికల్ గానూ కీలక మార్పులు

Advertisement

కేవలం డిజైన్ పరంగా మాత్రమే కాదు, సాంకేతికంగా కూడా టెసరాక్ట్‌లో పెద్ద మార్పులు చేశారు. ఈ స్కూటర్ ఇప్పుడు 100V ఆర్కిటెక్చర్ ఆధారంగా పని చేస్తుంది. దేశంలో ఈ తరహా సిస్టమ్‌ ను ఉపయోగిస్తున్న తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదేనని కంపెనీ చెబుతోంది. దీని వల్ల వేగవంతమైన ఛార్జింగ్, మెరుగైన పనితీరు, అధిక పవర్ అందుబాటులోకి వస్తాయి.

బ్యాటరీలోనూ కీలక మార్పులు

అలాగే బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS)ను కూడా పూర్తిగా కొత్తగా అభివృద్ధి చేశారు. ఇది గత మోడళ్లలో ఉపయోగించిన వ్యవస్థతో పోలిస్తే తక్కువ బరువుతో, మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది.  మెరుగైన థర్మల్ మేనేజ్‌ మెంట్ వల్ల బ్యాటరీ పనితీరు కూడా మెరుగుపడనుంది. అల్ట్రావయోలెట్ టెసరాక్ట్ 3.5kWh, 4kWh, 6kWh బ్యాటరీ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.

గరిష్టంగా గంటకు 125 కి.మీ వేగం

Advertisement

పనితీరు విషయానికి వస్తే, టెసరాక్ట్‌ లో 15kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. దీంతో ఇది మార్కెట్లో అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 125 కిలోమీటర్లుగా కంపెనీ ప్రకటించింది.భద్రత కోసం ABS, ట్రాక్షన్ కంట్రోల్, రాడార్ ఆధారిత బ్లైండ్ స్పాట్ అలర్ట్ వంటి ఆధునిక ఫీచర్లను కూడా అందిస్తున్నారు. రైడర్‌ కు అద్దాల్లో కనిపించని వాహనాల గురించి ముందుగానే హెచ్చరికలు అందించే సదుపాయం ఇందులో ఉంటుంది.  దీని ప్రారంభ ధర (ఎక్స్ షోరూమ్) రూ.1.45 లక్షలుగా నిర్ణయించారు. అధునాతన టెక్నాలజీ, శక్తివంతమైన పనితీరు, ఆధునిక భద్రతా ఫీచర్లతో ఈ స్కూటర్ మార్కెట్లో ప్రత్యేక స్థానం సంపాదించే అవకాశం ఉందని ఆటో నిపుణులు భావిస్తున్నారు.

Read Also: RE అభిమానులకు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి బుల్లెట్ 650 ఎంట్రీ!

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×