E-Paper
Advertisement

అమ్మాయిలూ.. అప్రమత్తంగా ఉండండి, హైదరాబాద్‌లోని ఆ ఆఫీసులో ఏం జరిగిందంటే?

అమ్మాయిలూ.. అప్రమత్తంగా ఉండండి, హైదరాబాద్‌లోని ఆ ఆఫీసులో ఏం జరిగిందంటే?
Advertisement

అమ్మాయిలూ.. బయటే కాదు, ఆఫీసుల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. లేదంటే.. కామాంధుల చేతిలో కీలు బొమ్మలవుతారు జాగ్రత్త. హైదరాబాద్‌ కవాడిగూడలోని పవర్‌ గ్రిడ్ ఆఫీస్‌లో బయటపడ్డ నీచమైన ఘటన ఇది. మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా ఫోన్ పెట్టి వీడియోలు తీసిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వాష్ బేసిన్ కింద ఫోన్ అమర్చిన కాంట్రాక్ట్ ఉద్యోగి భరత్‌ను ఉద్యోగులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగితంలో రంధ్రాలు చేసి, డబుల్ సైడెడ్ టేప్‌తో వాష్‌బేసిన్ కింద సైలెంట్‌గా సెల్ ఫోన్ అమర్చాడు. అక్టోబర్ 13న ఓ మహిళా ఉన్నతాధికారిణి అనుమానాస్పదంగా ఉన్న ఆ ఫోన్‌ను గుర్తించి బయటకు తీసుకురాగానే.. ఫ్లోర్ అటెండెంట్ భరత్ బాగోతం బయటపడింది. ఫోన్‌లోని పిన్‌లాక్ ఫోల్డర్ ఓపెన్ చేయమని నిలదీయడంతో దొరికిపోయానని భయపడిన భరత్.. ఫోన్‌ను నేలకేసి కొట్టి పూర్తిగా ధ్వంసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

Advertisement

Also Read: చదువుకున్న స్కూల్‌లోనే దారుణం.. ప్రిన్సిపల్‌పై మాజీ స్టూడెంట్స్ దాడి.. పాఠశాల డబ్బుతో జంప్!

ఫోన్ డేటాను క్రాక్ చేసి, ధ్వంసమైన ఫోన్ నుంచి సమాచారాన్ని వెలికితీసేందుకు కేసును సైబర్ క్రైమ్‌కు బదిలీ చేశారు. ఐటీ యాక్ట్, BNS సెక్షన్ల కింద కేసు రీ-రిజిస్టర్ చేసిన పోలీసులు.. ఈ వికృత చేష్టల వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? గతంలో ఏమైనా స్పై కెమెరాలు పెట్టారా? అనే కోణంలో లోతైన విచారణ జరుపుతున్నారు. సెపరేట్ వాష్‌రూమ్స్ ఉన్నా.. అలర్ట్‌గా లేకపోతే అంతేసంగతులు. మనోళ్లే కదా నమ్మితే.. ముసుగు వెనకాల మాటు వేసుకుని ఉంటారు ఇలాంటి నీచులు. తెలియని వస్తువులు కనిపించినా, ఏమాత్రం అనుమానం వచ్చినా.. దాని వెనకాల ఏం జరుగుతుందని తెలుసుకోవాలి. ఎందుకంటే.. మీ భద్రత.. మీదే బాధ్యత కాబట్టి.

Tags

Related News

‘కరువుపై బీఆర్ఎస్‌ది తప్పుడు ప్రచారం’.. కేటీఆర్, హరీశ్ రావుపై మంత్రి అడ్లూరి ఫైర్!

2029లో ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం!- సీఎం రేవంత్

అడవిలో వేటాడే పులి మనమే.. ఫేక్ సమ్మిట్‌లను అడ్డుకుంటాం: కవిత

దక్షిణాది రాష్ట్రాల భద్రతకు బిగ్ ప్లాన్.. ఉమ్మడి సెక్రటేరియట్‌కు రేవంత్ పిలుపు!

ఎల్‌నినో ముప్పు.. తెలంగాణ ప్రభుత్వం బిగ్ ప్లాన్! భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు

హరీష్‌ రావును నమ్మితే మన్నుతో అంబలి తాగినట్టే!- సీఎం రేవంత్

కుళ్లిన అల్లం, ఫంగస్‌ వెల్లుల్లితో ఏ1 పేస్ట్.. మేడ్చల్‌లో అధికారుల గుట్టు రట్టు!

Big Stories

Advertisement
×