E-Paper
Advertisement

పాత ఇనుము.. 10 వేల రూపాయలు.. అదిరిపోయే సోలార్ స్కూటర్ తయారు చేసిన యువకుడు!

పాత ఇనుము.. 10 వేల రూపాయలు.. అదిరిపోయే సోలార్ స్కూటర్ తయారు చేసిన యువకుడు!
Advertisement

7 Seater Solar Vehicle: సాధించాలనే సంకల్పం ఉంటే.. పరిమిత వనరులతో అద్భుతాలు సృష్టించవచ్చు. అచ్చంగా ఇలాంటి ప్రయత్నమే చేశాడు ఉత్తరప్రదేశ్‌ కు చెందిన ఓ యువకుడు. తన క్రియేటివిటీతో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అజంగఢ్ కు చెందిన 22 ఏళ్ల అసద్ అబ్దుల్లా కేవలం పాత ఇనుప సామానును ఉపయోగించి సోలార్ పవర్ తో నడిచే 7 సీటర్ స్కూటర్ ను తయారు చేశాడు. ఈ వెహికల్ తయారీకి అతడు కేవలం రూ.10 వేలు ఖర్చు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

పాత ఇనుము.. రూ. 10 వేలు

సాధారణంగా కొత్త వాహనాలు తయారు చేయాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు, అత్యాధునిక సాంకేతికత అవసరమని భావిస్తారు. కానీ, అసద్ మాత్రం అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతోనే క్రేజీ వెహికల్ ను తయారు చేశాడు. తన చిన్న వర్క్‌ షాప్‌ లో పాత ఇనుప సామాను, స్క్రాప్ పార్ట్స్, ఇతర వస్తువులను ఉపయోగించి ఈ వాహనాన్ని రూపొందించాడు.

200 కి.మీ ప్రయాణం

Advertisement

ఈ వాహనం ప్రత్యేకత ఏమిటంటే.. ఇది పూర్తిగా సోలార్ పవర్ తో నడుస్తుంది. సూర్యరశ్మి ఉన్నంత సేపు ఈ వాహనం ప్రయాణిస్తూనే ఉంటుంది. ఇంధనం అవసరం లేకుండానే ఇది 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుందని చెప్తున్నాడు అసద్. తక్కువ ఖర్చుతో ప్రజలకు ఉపయోగపడే వాహనం తయారు చేయాలనే ఆలోచనతో ఈ ప్రయత్నం మొదలుపెట్టినట్లు చెప్పాడు. చాలా సార్లు విఫలమైనా, మళ్లీ ప్రయత్నిస్తూ చివరకు ఈ వాహనాన్ని తయారు చేశాడు. కొత్త వాహనాలను పెద్ద కంపెనీలు మాత్రమే ఆవిష్కరించాల్సిన అవసరం లేదు..  సాధారణ యువకులు  కొత్త ఆలోచనలతో అద్భుతాలు సృష్టించే అవకాశం ఉందంటున్నాడు అసద్.

ఒకేసారి ఏడుగురి ప్రయాణం

ఈ వాహనం మీద ఒకేసారి ఏడుగురు కూర్చుని ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇది కేవలం ప్రయోగాత్మక మోడల్‌ గా కాకుండా, సాధారణ ఉపయోగానికి కూడా పనికొచ్చేలా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో, తక్కువ దూర ప్రయాణాలకు ఇలాంటి వాహనాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశముందని ఆటో నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

దేశ వ్యాప్తంగా జోరుగా చర్చ

అసద్ తయారు చేసిన ఈ వాహనం గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పర్యావరణ కాలుష్యం, పెరుగుతున్న ఇంధన ధరలు లాంటి సమస్యల మధ్య ఇలాంటి ప్రత్యామ్నాయ ఆలోచనలు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సౌరశక్తిని మరింత విస్తృతంగా ఉపయోగించాల్సిన అవసరం ఉందని ఈ వెహికల్ మరోసారి గుర్తు చేస్తోంది. అంతేకాదు, అసద్ ఆవిష్కరణ ఇప్పుడు చాలా మందికి ప్రేరణగా మారుతోంది. పరిమిత వనరులు ఉన్నా, పట్టుదల, కొత్త ఆలోచనలు ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చని నిరూపించాడు. చిన్న వర్క్‌ షాప్‌ లో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది.

Read Also: ఏథర్ To విడా.. 6 నెలల్లో 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేస్తున్నాయ్!

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×