Drishyam 3 Collections: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ సైకలాజికల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ (Drishyam 3) థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మొదటి వారం రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధించి బాక్సాఫీస్ బరిలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
తాజా ట్రేడ్ నివేదికల ప్రకారం, వీకెండ్ ముగిసినప్పటికీ వర్కింగ్ డేస్‌లో కూడా ఈ సినిమా చాలా స్టడీగా కలెక్షన్లను రాబడుతోంది. విడుదలైన 7వ రోజున (బుధవారం) ఈ చిత్రం భారతదేశంలో రూ.6.65 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇది అంతకుముందు రోజు (6వ రోజు) వచ్చిన రూ.6.50 కోట్ల వసూళ్లతో పోలిస్తే 2.3 శాతం వృద్ధిని కనబర్చడం విశేషం. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ మోహన్ లాల్ స్టార్ డమ్, దృశ్యం ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ ఈ సినిమాను కలెక్షన్ల పరంగా ముందుకు నడిపిస్తున్నాయి.
Read also-Nindu Manasulu Prerana : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ప్రేరణ అవుట్..
‘దృశ్యం 3’ మొదటి వారం ముగిసే సమయానికి భారతదేశంలో మొత్తం రూ. 75.30 కోట్ల నెట్ కలెక్షన్లను, రూ.87.38 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. కేవలం దేశీయ మార్కెట్లోనే కాకుండా ఓవర్సీస్ (విదేశాల్లో) కూడా జార్జ్‌కుట్టి హవా గట్టిగానే నడుస్తోంది. 7వ రోజున విదేశాల నుండి ఈ సినిమాకు రూ.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయింది. దీనితో మొత్తం ఓవర్సీస్ గ్రాస్ వసూళ్లు రూ.95.70 కోట్లకు చేరుకున్నాయి. మొత్తంగా, విడుదలైన కేవలం ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.183.08 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను సాధించి ఈ సినిమా సంచలనం సృష్టించింది. మలయాళంలో ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచిన ‘2018’ సినిమా లైఫ్‌టైమ్ కలెక్షన్లను (రూ.180 కోట్లు) కూడా ఈ చిత్రం కేవలం వారం రోజుల్లోనే అధిగమించింది.
ఈ సినిమాకు ప్రధానంగా కేరళ బాక్సాఫీస్ భారీగా కలిసి వచ్చింది. 7వ రోజున కేవలం మలయాళ వెర్షన్ నుంచే రూ.5.85 కోట్ల నెట్ (కేరళ వ్యాప్తంగా రూ.6.10 కోట్ల గ్రాస్) వసూలైంది. థియేటర్లలో సగటున 40.35% ఆక్యుపెన్సీ నమోదు కాగా, నైట్ షోలలో 47.58% వరకు ఆక్యుపెన్సీ కనిపించింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఏపీ, తెలంగాణలలో తెలుగు డబ్బింగ్ వెర్షన్ 7వ రోజున రూ.50 లక్షల నెట్ వసూలు చేసింది. మొదటి వారం ముగిసేసరికి తెలుగు మార్కెట్‌లో ఈ చిత్రం మొత్తం రూ.6.35 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి స్థిరంగా కొనసాగుతోంది. తమిళ వెర్షన్ రూ.20 లక్షలు, కన్నడ వెర్షన్ రూ.10 లక్షల నెట్ వసూళ్లను సాధించాయి. తాజాగా ఈ సినిమా గురువారం ఉదయం నాటికి రూ. 200 కోట్లు వసూలు అయినట్లుగా నిర్మాతలు తెలిపారు.
Read also-ప్రముఖ దర్శకుడు అనిక్ దత్తా అకాల మరణం.. సినీ ప్రముఖుల సంతాపం..
గత భాగాలలో సాదాసీదా కేబుల్ టీవీ ఆపరేటర్‌గా కనిపించిన జార్జ్‌కుట్టి, ఈ మూడో భాగంలో ఒక విజయవంతమైన సినిమా నిర్మాతగా ఎదిగినట్లు చూపించారు. అతని కుటుంబం ఆర్థికంగా స్థిరపడినప్పటికీ, గతంలో తాము దాచిన నిజాల తాలూకూ భయం వారిని ఎలా వెంటాడింది అనే సైకలాజికల్ కోణంలో దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ కథను నడిపించారు. ప్రస్తుతం నడుస్తున్న కలెక్షన్ల ట్రెండ్ చూస్తుంటే, ఈ చిత్రం రెండో వీకెండ్ ముగిసే సమయానికి చాలా సులువుగా ₹200 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
Three films. Three chapters. One unbroken bond.
Thank you for walking with Georgekutty & Family#Drishyam3
@jeethu4ever @antonypbvr @KumarMangat @jayantilalgada @AbhishekPathakk @aashirvadcine @PanoramaMovies @PenMovies @Rajeshmenon1969 #RavindraAuti @ram_rampagepix… pic.twitter.com/3wMtam2MEG
— Mohanlal (@Mohanlal) May 28, 2026