Upper vs Lower Berth in Trains: సాధారణంగా ఎక్కువ దూరం రైలు ప్రయాణం చేసే వాళ్లు కంఫర్ట్ రైలు జర్నీ గురించి ఆలోస్తారు. కొంత మంది రైలు ప్రయాణంలో చక్కగా పడుకురి రిలాక్స్ కావాలనుకుంటారు. అయితే, ఎంచుకునే ట్రైన్ బెర్త్ అనేది ప్రయాణీకుల కంఫర్ట్ ను ప్రభావితం చేస్తుంది. ఇంతకీ లాంగ్ జర్నీలు చేసే వారికి అప్పర్ బెర్త్ బాగుంటుందా? లోయర్ బెర్త్ బాగుంటుందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ మరింత గోప్యతను అందిస్తుంది: అప్పర్ బెర్త్ అనేది మిగిలిన కోచ్ నుంచి నుంచి దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. రైల్లోని వాళ్లు తక్కువగా పైకి చూస్తారు. ఎక్కువ ప్రైవసీ ఉంటుంది. ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం ఉంటుంది. కోచ్ బిజీగా ఉన్నప్పుడు కూడా మీ నిద్రకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. తరచుగా రైలు ప్రయాణాలు చేసే వాళ్లు పైన నిద్రించడానికి ఇష్టపడుతారు.
⦿ లైట్ల నుంచి తక్కువ ఇబ్బందులు: పని చేయని లైట్లు, ఇతరుల ఫోన్ వాడకం, చుట్టూ తిరిగే ప్రయాణీకులు లోయర్ బెర్త్ లో ఇబ్బంది కలిగిస్తాయి. కానీ, అప్పర్ బెర్త్ మసకగా ఉంటుంది. ఎలాంటి అతరాయాలు ఉండవు. దగ్గరలో ఎవరైనా లైట్ ఆన్ చేసినప్పుడు కూడా, అప్పర్ బెర్త్ లో వాళ్లకి నేరుగా ఇబ్బంది కలగదు. నిద్రపోవడం సులభంగా ఉంటుంది.
⦿ నో షేరింగ్: పగటిపూట లోయర్ బెర్త్ లను తరచుగా షేర్డ్ సీటింగ్ గా ఉపయోగిస్తారు. కానీ, ఎగువ బెర్త్ కు ఆ సమస్య ఉండదు. ఎప్పుడైనా విశ్రాంతి తీసుకోవచ్చు. సుదూర ప్రయాణాలలో చాలా అనుకూలంగా ఉంటుంది.
⦿ సైలెంట్ గా ఉంటుంది: అప్పర్ బెర్త్ చాలా వరకు సైలెంట్ గా ఉంటుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎక్కువసేపు, ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్ర పోయే అవకాశం ఉంటుంది.
⦿ ఈజీ యాక్సెస్: లోయర్ బెర్త్ పైకి ఎక్కడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చాలా మందికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఈజీ యాక్సెస్ కారణంగా నిద్ర వచ్చినప్పుడల్లా త్వరగా పడుకోవడాన్ని అవకాశం ఉంటుంది.
⦿ రాత్రిపూట అనుకూలం: రాత్రిపూట వాష్ రూమ్ కు వెళ్లాలంటే ఈజీగా వెళ్లొచ్చు. మీ బ్యాగ్ నుంచి ఏదైనా తీసుకోవాల్సిన అవసరం ఉంటే.. లోయర్ బెర్త్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఈజీగా అన్ని విషయాలకు యాక్సెస్ లభిస్తుంది.
⦿ వృద్ధ ప్రయాణికులు బాగుంటుంది: పెద్దలు, చిన్న పిల్లలుచ కుటుంబ సభ్యులకు అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వృద్ధులకు ఈజీగా కూర్చునేలా, పడుకునేలా ఉంటుంది.
⦿ లగేజీకి దగ్గరగా: చాలా మంది ప్రయాణికులు తమ బ్యాగుల దగ్గర ఉండటానికి ఇష్టపడతారు. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలలో లగేజీ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. దిగువ బెర్త్ మీ వస్తువులను మరింత సురక్షితంగా ఉండేలా కాపాడుకోవడంలో సాయపడుతుంది.
ప్రశాంతమైన, అంతరాయం లేని నిద్ర కావాలనుకుంటే అప్పర్ బెర్త్ బాగుంటుంది. సౌకర్యం, ఈజీ యాక్సెస్, రాకపోకలకు అనుకూలంగా ఉండాలంటే లోయర్ బెర్త్ మంచిది.
Read Also: ఇక మరింత వేగంగా ఆన్ లైన్ టికెట్ బుకింగ్, గుడ్ న్యూస్ చెప్పిన IRCTC!