E-Paper
Advertisement

విన్‌ఫాస్ట్ VF MPV 7 vs మహీంద్రా XEV 9S.. ధర, ఫీచర్లు, రేంజ్‌ లో ఏది టాప్?

విన్‌ఫాస్ట్ VF MPV 7 vs మహీంద్రా XEV 9S..  ధర, ఫీచర్లు, రేంజ్‌ లో ఏది టాప్?
Advertisement

VinFast VF MPV 7 vs Mahindra XEV 9S Comparison: వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ ఫాస్ట్ భారతీయ ఈవీ మార్కెట్ లోకి అడుగు పెట్టింది. తాజాగా ఎలక్ట్రిక్ MPV అయిన VF MPV 7ను విడుదల చేసింది.  ఏడుగురు కంఫర్ట్ గా ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే ఈ ఎలక్ట్రిక్ కారును కొనుగోలుదారుల ముందుకు తీసుకొచ్చింది. ఈ కారు దేశీ మార్కెట్ లో సత్తా చాటుతున్న మహీంద్రా XEV 9S కు గట్టి పోటీగా మారింది. ఈ రెండు 7-సీటర్ ఎలక్ట్రిక్ వాహనాలు దాదాపు ఒకే ధర పరిధిలో ఉండటంతో కొనుగోలుదారులు ఏది ఎంచుకోవాలి? అని ఆలోచిస్తున్నారు. అయితే, ఈ రెండు కార్లలో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ధరల గురించి పరిశీలిస్తే..

విన్‌ఫాస్ట్ VF MPV 7, మహీంద్రా XEV ధరలను పరిశీలిస్తే, VF MPV 7 ధరను కంపెనీ సుమారు రూ. 24.5 లక్షలుగా నిర్ణయించింది. ఈ కారు ఒకే వేరియంట్‌ లో లభిస్తుంది. మరోవైపు, మహీంద్రా XEV 9S మాత్రం రూ. 19.95 లక్షల నుంచి రూ. 29.45 లక్షల వరకు పలు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అంటే, బడ్జెట్‌కు అనుగుణంగా ఆప్షన్స్ కావాలంటే మహీంద్రా వాహనం కొంత ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది.

డిజైన్ ఎలా ఉందంటే?

Advertisement

డిజైన్ పరంగా ఈ రెండు వాహనాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. VF MPV 7 కొద్దిగా పెద్ద సైజ్, ఎక్కువ వీల్‌ బేస్‌తో ఉండటం వల్ల లోపల ఎక్కువ స్థలాన్ని కలిగి ఉంటుంది. కుటుంబ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే, XEV 9S స్టైలిష్ లుక్‌ తో, లేటెస్ట్ డిజైన్‌ తో ఆకట్టుకుంటుంది.

పవర్ ట్రెయిన్ గురించి..

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, VF MPV 7లో ఒకే బ్యాటరీ ఆప్షన్ ఉండగా, XEV 9Sలో 59kWh నుంచి 79kWh వరకు మూడు బ్యాటరీ ఆప్షన్స్ ఉన్నాయి. పవర్, టార్క్, రేంజ్ అన్ని విషయాల్లో XEV 9S ముందు ఉంటుంది. ఇది గరిష్టంగా 679 కి.మీ వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. VF MPV 7లో కూడా ఒకే ఛార్జ్ తో  517 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఈ రెండు కార్లు  సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి.

ఫీచర్ల గురించి..

Advertisement

ఫీచర్ల విషయంలో కూడా మహీంద్రా ఈవీ మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. పెద్ద టచ్‌ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 16 స్పీకర్ సౌండ్ సిస్టమ్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. అదనంగా, ADAS, 360 డిగ్రీ కెమెరా, ఎక్కువ ఎయిర్‌ బ్యాగ్‌లు లాంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. అటు VF MPV 7లో అవసరమైన ఫీచర్లు ఉన్నప్పటికీ, ప్రీమియం టచ్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. అయితే సింపుల్ డిజైన్, విశాలమైన క్యాబిన్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే, మెరుగైన పనితీరు, అధిక రేంజ్, అధునాతన ఫీచర్ల కోసం చూస్తే మహీంద్రా XEV 9S మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. కానీ, సింపుల్, స్పేస్‌పై ఎక్కువ దృష్టి పెట్టే వారు VF MPV 7 బాగా నచ్చుతుంది.

Read Also: కియా సెల్టోస్ To టాటా నెక్సాన్.. రూ.15 లక్షల్లోపు బెస్ట్ డీజిల్ ఆటోమేటిక్ SUVలు ఇవే!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×