Stree Nidhi: స్వేచ్ఛ బ్యూరో: ఆఫీసు రెనోవేషన్ కు 10కోట్లు అని స్త్రీ నిధి మేనేజ్ మెంట్ కమిటీ మీటింగ్‌లో పెట్టడం ఇప్పుడు చర్చకు దారితీసింది. మహిళలు స్వశక్తితో ఆర్ధికంగా బలోపేతం అయ్యేందుకు ఒక నిధిని ఏర్పాటు చేసుకుంటే ఆ నిధిని అధికారులే దుర్వినియోగం చేస్తుండటం విమర్శలకు దారితీస్తుంది. మహిళలకు ఖర్చుచేయాల్సిన నిధులను కేవలం ఆఫీసు రెనోవేషన్ కే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ప్రకటించడం వెనుక ఆంతర్యమేంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సెర్ప్, స్త్రీ నిధి ఒకే దగ్గర ఉండాల్సిన ఉన్నప్పటికీ ఇప్పుడు వేర్వేరు భవనాలకు మార్చే ప్రయత్నం చేస్తుండటం ఎవరి స్వలాభం కోసమనేది ఇప్పుడు మహిళా సంఘాల్లోని మహిళల్లోనే చర్చజరుగుతుంది. శాఖమంత్రి స్పందిస్తారా? లేదా? అనేది సైతం చర్చకు దారితీసింది.
మండల, పట్టణ మహిళా సమాఖ్యల భాగస్వామ్యంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, భాగస్వామ్యంతో ప్రత్యేకంగా ఒక ఆర్థిక సంస్థను, మహిళల కోసం, మహిళలచే ఏర్పాటు చేసిన సంస్థ స్త్రీ నిధి పరపతి సహకార సమాఖ్య. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన ఆశయంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థలు సెర్ప్, మెప్మా. ఈ సంఘాల్లోని సభ్యులకు ఆర్ధికంగా సేవలందించేందుకు స్త్రీనిధితో రుణాలు ఇస్తున్నారు. తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నారు.. మహిళలు తీసుకున్న రుణాలను నిర్ణీత సమయంలో చెల్లిస్తున్నారు. దీంతో ప్రస్తుతం పటిష్టమైన సంస్థగా స్త్రీ నిధి నిలిచింది.
అయితే మహిళల సంక్షేమం కోసం పాటుపడాల్సిన స్త్రీ నిధి డబ్బులను సంస్థ అధికారులే పక్కదారి పట్టిస్తున్నారని, దుబారా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు వారు ఏ విధంగా డబ్బులను దుబారా చేస్తున్నారని వారి మీటింగ్ ఎజెండాలోనే స్పష్టమవుతోంది. గతేడాది డిసెంబర్ 29న మేనేజింగ్ కమిటీ మీటింగ్ ను నిర్వహించారు. ఇందులో పేర్కొన్న ఏజెండాలో అధికారులు చూపుతున్న లెక్కలు వారి పనితీరుకు అద్దం పడుతున్నాయి. ఆఫీసు మెయింటెన్స్ ఖర్చు కిందనే సుమారు. 9.77లక్షలు చూపారు. అంతేకాదు ఆపరేషనల్ ఎక్స్ పెండేచర్ కింద 15 అంశాలకు సంబంధించి 536.87 లక్షలుగా కమిటీ మీటింగ్ లో పెట్టడం గమనార్హం.
Also Read: BREAKING: ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు..! ఉలిక్కిపడ్డ ప్రయాణికులు
ఇది ఇలా ఉంటే ప్రభుత్వం హిమాయత్ నగర్ లోని ఆర్డీ(రూరల్ డెవలప్ మెంట్) కార్యాలయానికి అనుమతి ఇస్తూ గతేడాది మే2న ఉత్తర్వులు ఇచ్చింది. దాని మరమ్మతులకు ప్లాన్, డిజైన్ రూపొందిస్తూ ఓ ఆర్కిటెక్ట్ర్ నుంచి లేవుట్ తీస్తుకుంది. డీపీఆర్ తయారీ బాధ్యతను పీఆర్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కు అప్పగించింది. సంబంధిత శాఖ డీపీఆర్ ను 8.57కోట్లు, జీఎస్టీతో కలిపి 1.40కోట్లతో ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నుంచి సాంకేతిక ఆమోదం పొందింది. మరో ఆప్షన్‌ను సైతం అధికారులు పెట్టారు. 47వ నిర్వహణ కమిటీ సమావేశంలో స్త్రీ నిధికి సుమారు 7కోట్ల భవన నిధి ఉన్నందున స్త్రీ నిధి, సెర్ప్ కార్యాలయ భవన నిర్మాణం హైటెక్స్ లోని ఆర్ డీ విభాగానికి కేటాయించిన భూమిని కేటాయించాలని ప్రభుత్వానికి తీర్మానం సైతం పంపారు. ప్రభుత్వ నిర్ణయం పెండింగ్ లో ఉంది.
అయితే ప్రభుత్వం డిసెంబర్ 2025 నాటికిఅన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని సర్క్యూలర్ సైతం జారీ చేసింది. దీంతో సచివాలయంలో సమీపంలోని మైహోం అపార్టుమెంట్ నుంచి సెర్ప్ కార్యాలయంను బీఆర్కే భవనంలోకి మార్చారు. కానీ స్త్రీనిధి మాత్రం అక్కడే కొనసాగిస్తున్నారు. అసలు కథ ఇక్కడే ఉందనే ప్రచారం జరుగుతుంది. స్త్రీ నిధి రుణాలను భవనం కోసం కేటాయించిన కోట్ల రూపాయాలను కొత్త భవనం నిర్మాణం కోసం లేదా కేటాయించిన ఆర్డీ భవనం రెనోవేషన్ కోసం ఖర్చుచేసేందుకు ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ప్రభుత్వ భవనాలు ఉన్నప్పటికీ కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చుచేయాలని అధికారులు భావిస్తున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బీఆర్కే భవన్ లో ఇప్పటికే సెర్ప్ కార్యాలయం తరలించినా ఎందుకు స్త్రీ నిధిని మై హోం అపార్టుమెంట్‌లో ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. శాఖమంత్రి సైతం సెర్ప్, స్త్రీనిధి ఒకే దగ్గర ఉండాలని సూచించినప్పటికీ ఎందుకు స్త్రీ నిధి అధికారులు మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదనేది స్పష్టమవుతోంది. బీఆర్కే భవన్ కాకుండా మరో భవనం, ప్రభుత్వానికి స్థలం కోసం ఎదురు చూస్తూ ఎందుకు కాలయాపన చేస్తున్నారనేది వారికే తెలియాలి.
Also Read: సామాన్యుల బ్రాండ్.. వర్ల్‌పూల్ టాప్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్‌లు.. సమ్మర్‌కు బెస్ట్ ఛాయిస్ భయ్యా!
మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేసిన స్త్రీ నిధి డబ్బుల నుంచి కోట్ల రూపాయలు ఎందుకు దుబారాచేయాలని చూస్తున్నారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇది ఇలా ఉంటే మేనేజింగ్ కమిటీ(ఎంసీ) సమావేశంలో కొత్త భవనం నిర్మాణం పూర్తయ్యేవరకు, స్త్రీ నిధి ప్రాంగణం నుంచే తన కార్యకలాపాలను కొనసాగించాలని ముందస్తుగానే తీర్మాణం చేయడం హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం అద్దెకు ఉంటున్న భవన యజమానులు ఆ ప్రాంగణాన్ని పునరుద్ధరించడానికి అంగీకరించారని, ఇక్కడి నుంచే కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్ధించవచ్చని ముందే సమావేశంలో తీర్మానించడం దేనికి సంకేతం అనే చర్చజరుగుతుంది.
ఏది ఏమైనప్పటి ప్రభుత్వ భవనాల్లోకి స్త్రీ నిధిని మార్చకుండా అద్దె భవనాల్లో కొనసాగించడం, రెనోవేషన్ అంటూ.. నూతన భవనానికి హైటెక్స్ లో అనుమతి ఇవ్వాలని.. 7కోట్ల నిధులు ఉన్నాయని పేర్కొనడం.. మహిళల కోసం ఖర్చు చేయకుండా ఈ నిధులను దుబారా చేయడానికే అధికారులా ప్లాన్ చేస్తున్నారా? అనేది ఇప్పుడు విస్తృతంగా చర్చజరుగుతుంది. దీనిపై శాఖ మంత్రి దృష్టిసారించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు. స్త్రీ నిధి నిధులు దుబారా చేయకుండా కాపాడాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.
Also Read: బీజేపీలో బినామీల రాకీయం.. రచ్చకెక్కిన పైసల పంచాయతీ.. వారికి వేటుతప్పదా..?