E-Paper
Advertisement

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!
Advertisement

Vida Dirt.E K3 6Days Edition: హీరో మోటోకార్ప్‌ కు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్ విడా, యువ రైడర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన డర్ట్.ఇ K3 బైక్ లిమిటెడ్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. విడా డర్ట్.ఇ K3 6డేస్ లిమిటెడ్ ఎడిషన్ పేరుతో తీసుకొచ్చిన ఈ బైక్‌ను పోర్చుగల్‌ లో జరిగిన ఇంటర్నేషనల్ మోటార్‌ సైకిల్ ఈవెంట్‌లో ప్రదర్శించారు. ఈ ప్రత్యేకమైన మోడల్‌ను కేవలం 100 యూనిట్లే అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.

100 యూనిట్లతో ప్రత్యేక ఎడిషన్

1913లో ప్రారంభమైన అంతర్జాతీయ ఆఫ్‌రోడ్ రేసింగ్ ఈవెంట్ FIM ఇంటర్నేషనల్ సిక్స్ డేస్ ఎండ్యూరో (ISDE) 100వ ఎడిషన్‌ సందర్భంగా విడా ఈ కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. రేసింగ్ చరిత్రకు గుర్తుగా ఈ బైక్‌ను పరిమిత సంఖ్యలో తయారు చేయనుంది. ఈ ప్రత్యేక ఎడిషన్‌లో అధికారిక 6డేస్ లోగోలు, రేసింగ్ ను ప్రతిబింబించే గ్రాఫిక్స్ ఉంటాయి. ఈసారి పోర్చుగల్‌లో ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో, ఆ దేశ జెండా రంగులను పోలిన ఎరుపు, ఆకుపచ్చ రంగులతో బైక్‌ను రూపొందించారు. అయితే, కొత్త రంగులు, గ్రాఫిక్స్ మినహా బైక్‌లోని మెకానికల్ అంశాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

పిల్లల కోసం ప్రత్యేకంగా డిజైన్

Advertisement

విడా డర్ట్.ఇ K3 మొదటిసారిగా 2025 డిసెంబర్‌లో మార్కెట్లోకి వచ్చింది. చిన్న వయసు రైడర్లు ఆఫ్‌రోడ్ రైడింగ్ నేర్చుకునేందుకు వీలుగా ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించారు. ఇందులో ఉన్న మాడ్యులర్ సెటప్ ఆకట్టుకుంటుంది. పిల్లలు పెరిగే కొద్దీ బైక్‌కు సంబంధించిన కొన్ని భాగాలను సర్దుబాటు చేసుకోవచ్చు. కేవలం అలెన్ కీ సాయంతో హ్యాండిల్‌ బార్ ఎత్తు, ఫుట్‌పెగ్ పొజిషన్, సీటు ఎత్తును మార్చుకోవచ్చు. దీంతో రైడర్ ఎత్తుకు అనుగుణంగా బైక్‌ను సర్దుబాటు చేయడం సులభమవుతుంది.

500W మోటార్.. మూడు రైడింగ్ మోడ్స్

ఈ ఎలక్ట్రిక్ డర్ట్ బైక్‌లో 500W మోటార్‌ను ఉపయోగించారు. ఇది గంటకు గరిష్ఠంగా 23 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో 350Wh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు మూడు గంటల సమయం పడుతుంది. రైడర్ల ఎక్స్ పీరియెన్స్ ను బట్టి బిగినర్, అమెచ్యూర్, ప్రో అనే మూడు రైడింగ్ మోడ్‌ లను అందించారు. బిగినర్ మోడ్‌ లో గంటకు 8 కిలోమీటర్లు, అమెచ్యూర్ మోడ్‌లో 16 కిలోమీటర్లు, ప్రో మోడ్‌లో 25 కిలోమీటర్ల వరకు వేగాన్ని పెంచుకోవచ్చు.

ధర, అవైలబులిటీ గురించి..   

Advertisement

ప్రస్తుతం విడా డర్ట్.ఇ K3 స్టాండర్డ్ మోడల్ ధర రూ.89,990గా ఉంది. అయితే, కొత్తగా ఆవిష్కరించిన 6డేస్ లిమిటెడ్ ఎడిషన్ ధర, అమ్మకాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కేవలం 100 యూనిట్లే అందుబాటులో ఉండనున్నందున, ఈ ప్రత్యేక మోడల్‌పై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. ధర, బుకింగ్‌లకు సంబంధించిన కంపెనీ అధికారిక ప్రకటన కోసం చూడాలి.

Read Also: హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Tags

Related News

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×