E-Paper
Advertisement

Vintage Cars in India: మోస్ట్ పాపులర్ ఇండియన్ మేడ్ వింటేజ్ కార్లు, ఒక్కోదాని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Vintage Cars in India: మోస్ట్ పాపులర్ ఇండియన్ మేడ్ వింటేజ్ కార్లు, ఒక్కోదాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

Indian Vintage Cars: భారత్ లో సుమారు రెండున్నర శతాబ్దాల క్రితం నుంచే కార్లు వినియోగించారు. ఉన్నత వర్గాలకు చెందిన వారు వీటిలో ప్రయాణించే వారు. ప్రస్తుతం దేశంతో అరుదైన, అద్భుతమైన వింటేజ్ కార్లు ఉన్నాయి. భారత ప్రభుత్వం ప్రకారం 50 ఏళ్లు పైబడిన కార్లను వింటేజ్‌ కార్లుగా పరిగణిస్తారు. వీటిలో ఎక్కువగా మహారాజులతో సంపన్న వర్గాలు ఉపయోగించినవి ఉన్నాయి. కొన్ని ఐకానిక్ మోడల్స్ గురించి ఇప్పుడు తెలసుకుందాం..

పాపులర్ ఇండియన్-మేడ్ వింటేజ్ కార్లు

 

⦿ Hindustan Ambassador (1957-2014)

Advertisement

మోరిస్ ఆక్స్‌ ఫర్డ్ ఆధారంగా తయారైన తొలి స్వదేశీ కారు. స్పేషియస్ ఇంటీరియర్, బలమైన బిల్డ్, డ్యూరబుల్ ఇంజన్ (పెట్రోల్/డీజల్)తో రూపొందింది. ప్రభుత్వ అధికారులు, టాక్సీలు, సినిమాల్లో ఐకాన్ గా గుర్తింపు పొందింది. కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్ గా పిలుస్తారు. ప్రస్తుత విలువ మంచి కండిషన్‌ లో ఉంటే రూ. 1.5-5 లక్షల వరకు ఉంటుంది.

⦿ Premier Padmini (Fiat 1100, 1964-2000)

ఫియట్ 1100 ఆధారంగా ప్రీమియర్ ఆటోమొబైల్స్ తయారు. ముంబై కాలీ-పీలీ టాక్సీల ఐకాన్. కాంపాక్ట్ డిజైన్, మంచి ఫ్యూయల్ ఎఫిషియెన్సీ, ఈజీ డ్రైవ్ కు అనుగుణంగా ఉంటుంది. బాలీవుడ్ స్టార్లు, మిడిల్ క్లాస్ ఫేవరెట్. ప్రస్తుత విలువ రేర్ మోడల్స్ రూ.5-20 లక్షలు ఉంటుంది.

⦿ Mahindra Willys Jeep (1940s-1970s)

Advertisement

విల్లీస్ జీప్ లైసెన్స్‌ తో మహీంద్రా కంపెనీ తయారు చేసింది. రఫ్ రోడ్ల మీద కూడా చక్కగా నడుస్తుంది. 4×4 డ్రైవ్, సింపుల్ మెకానిక్స్, ఆఫ్ రోడ్ కెపాబిలిటీ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఆర్మీ, రూరల్ ఏరియాల్లో పాపులర్. మహీంద్రా థార్ ఈ కారు నుంచే వచ్చింది. ప్రస్తుత విలువ మంచి కండిషన్‌లో ఉంటే రూ. 5-15 లక్షలకు లభిస్తుంది.

⦿ Standard Herald (1961-1970s)

దీనిని బ్రిటిష్ డిజైన్ తో స్టాండర్డ్ మోటార్స్ తయారు చేసింది. స్టైలిష్ బాడీ, ఫ్యూయల్ ఎఫిషియెంట్ ఇంజన్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు అందుబాటులో ఉన్న కారు. ప్రస్తుత విలువ రూ.7-20 లక్షలు.

⦿ Volkswagen Beetle (1960s-1970s in India)

క్యూట్ రౌండ్ డిజైన్ తో ఉంటుంది. ఇండియాలో చాలా రేర్.రియర్ ఇంజన్, సింపుల్, ఫన్ టు డ్రైవ్ కు పాపులర్. హిప్పీ కల్చర్ సింబల్. ప్రస్తుత విలువ రూ.10-30 లక్షలు ఉంటుంది.

లగ్జరీ ఇంపోర్టెడ్ వింటేజ్ కార్లు

 

⦿ Rolls-Royce Models (Silver Ghost, Phantom etc.)

జోధ్‌ పూర్, పటియాలా మహారాజులు వీటిన ఉపయోగించారు. కస్టమ్ బాడీని కలిగి ఉంటుంది. అల్ట్రా లగ్జరీ, హ్యాండ్‌క్రాఫ్టెడ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. భారత మహారాజులు,ప్రపంచంలోనే అతిపెద్ద కార్ కలెక్టర్ల దగ్గర ఉన్నాయి. ప్రస్తుత విలువ కోట్ల రూపాయలు ఉంటుంది.

⦿ Mercedes-Benz Classic Models  

గల్‌వింగ్ డోర్స్ మోడల్స్ చాలా రేర్. హై పెర్ఫార్మెన్స్, లగ్జరీ ఫీచర్లను కలిగి ఉంటుంది. రాయల్, ఎలైట్ కలెక్షన్స్ లో భాగంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత విలువ రూ. 5-10 కోట్లకు పైగా ఉంటుంది.

Read Also:  ఐకానిక్ మోటార్ సైకిల్స్, ఇవి గ్యారేజీలో ఉంటే ఎంతో ఆ రేంజే వేరు!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×