E-Paper
Advertisement

ఫ్రెషర్లకు కూడా స్కిల్స్, అనుభవం అడుగుతున్న కంపెనీలు.. మరి మొదటి అవకాశం ఎవరిస్తారు?

ఫ్రెషర్లకు కూడా స్కిల్స్, అనుభవం అడుగుతున్న కంపెనీలు.. మరి మొదటి అవకాశం ఎవరిస్తారు?
Advertisement

Freshers Not Getting Jobs| డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం సాధించాలని ప్రతి విద్యార్థి కలలు కంటారు. మొదటి ఉద్యోగం ద్వారా కొత్త విషయాలు నేర్చుకోవాలని, తమ నైపుణ్యాలను నిరూపించుకోవాలని ఆశిస్తారు. కానీ ప్రస్తుతం చాలా మంది యువతకు ఉద్యోగం సంపాదించడం పెద్ద సవాలుగా మారుతోంది. కంపెనీలు అనుభవం ఉన్నవారిలా పనిచేయగల ఫ్రెషర్స్ కోరుకుంటున్నాయి. మరి ఉద్యోగం ఇవ్వకముందే అనుభవం ఎలా వస్తుంది? కృత్రిమ మేధస్సు (AI) ప్రభావం పెరుగుతున్న సమయంలో ఫ్రెషర్లకు మొదటి అవకాశం ఎవరు కల్పిస్తారనే ప్రశ్న ప్రాధాన్యం సంతరించుకుంది.

1. ఫ్రెషర్లకు తగ్గుతున్న ఉద్యోగ అవకాశాలు

భారతదేశంలో ఉద్యోగ నియామకాల పరిస్థితి ముఖ్యంగా కొత్తగా కెరీర్ ప్రారంభించేవారికి సవాలుగా మారుతోంది. ప్రముఖ జాబ్ పోర్టల్ బైన్ నివేదిక ప్రకారం.. 2026 రెండో త్రైమాసికంలో ఉద్యోగ ప్రకటనలు గత ఏడాదితో పోలిస్తే 5 శాతం తగ్గాయి. జూనియర్, ఎంట్రీ లెవల్ ఉద్యోగాల ప్రకటనలు మాత్రం 11 శాతం పడిపోయాయి. మొదటి త్రైమాసికంలో ఈ తగ్గుదల 6 శాతంగా ఉంది.

Advertisement

నౌకరీ సెప్టెంబర్ 2026 జాబ్‌స్పీక్ నివేదిక ప్రకారం.. వైట్ కాలర్ జాబ్స్ కేవలం 1 శాతం పెరిగాయి. ఫ్రెషర్స్ లేదా మూడేళ్ల అనుభవం ఉన్నవారి నియామకాలు కూడా 1 శాతమే పెరిగాయి. మరోవైపు.. ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఉద్యోగాల నియామకాలు 20 శాతం వృద్ధి చెందాయి.

2. ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులకే ఛాన్స్

గతంలో కంపెనీలు ఫ్రెషర్లను నియమించుకుని శిక్షణ ఇచ్చేవి. క్రమంగా వారికి బాధ్యతలు అప్పగించేవి. ఇప్పుడు ఏఐ టూల్స్ చాలా వరకు రొటీన్ లేదా సింపుల్ టాస్క్‌లు వేగంగా పూర్తి చేస్తున్నాయి. దీంతో కొత్త ఉద్యోగులు కూడా తక్కువ సమయంలో పనిచేయగలగాలని కంపెనీలు ఆశిస్తున్నాయి.

Advertisement

అభ్యర్థులకు డిగ్రీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, టెక్నికల్ స్కిల్స్, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం అవసరమవుతున్నాయి. అయితే, మొదటి ఉద్యోగం లభించకపోతే అనుభవం సంపాదించడం కష్టమవుతుంది. ఇదే ఫ్రెషర్లకు ప్రధాన సమస్యగా మారుతోంది.

3. ఏఐ ఉద్యోగాలు పెరిగినా అందరికీ అవకాశాలు రావడం లేదు

ఏఐ, మెషిన్ లెర్నింగ్ రంగాల్లో నియామకాలు పెరుగుతున్నాయి. కానీ ఈ అవకాశాలు ప్రతి గ్రాడ్యుయేట్‌కు అందుబాటులో ఉండవు. స్పెషల్ స్కిల్స్ ఉన్నవారికి మెరుగైన అవకాశాలు లభించవచ్చు. సాధారణ ఐటీ ఉద్యోగాల కోసం ప్రయత్నించే అభ్యర్థులు మాత్రం ఎక్కువ పోటీని ఎదుర్కోవాల్సి రావచ్చు.

ఐటీ, సాఫ్ట్‌వేర్ సేవల నియామకాలు 4 శాతం తగ్గిపోగా, ఏఐ, మెషిన్ లెర్నింగ్ నియామకాలు 20 శాతం పెరిగాయి. కంపెనీలు ఉద్యోగుల ఎంపికలో తమ ప్రాధాన్యాలను మార్చుకుంటున్నాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

Also Read: ఆఫీస్‌లో సహోద్యోగులతో స్నేహం మంచిదే.. కానీ ఈ విషయాలు మాత్రం వారికి చెప్పకూడదు

4. కొన్ని కంపెనీల్లో మాత్రమే ఫ్రెషర్ల నియామకాలు

ఈ పరిస్థితుల్లోనూ కొన్ని సంస్థలు కొత్త గ్రాడ్యుయేట్ల నియామకాలకు ప్రణాళికలు రూపొందించాయి. కాగ్నిజెంట్ 2026లో సుమారు 24,000 నుంచి 25,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2025లో ఈ సంఖ్య దాదాపు 20,000గా ఉంది.

అమెరికాలో ఐబీఎం కూడా 2026లో ఎంట్రీ లెవల్ నియామకాలను మూడు రెట్లు పెంచాలని ప్రణాళిక వేసింది. ఈ ఉదాహరణలతో ఫ్రెషర్లకు అవకాశాలు పూర్తిగా కనుమరుగవ్వలేదని నిరూపిస్తున్నాయి.

Also Read: కార్పొరేట్ జాబ్ వద్దు వ్యవసాయం ముద్దు.. పొలం బాట పడుతున్న కోట్ల మంది గ్రాడ్యుయేట్లు

ఫ్రెషర్లు ఉద్యోగాలు పొందాలంటే ప్రాక్టికల్ నైపుణ్యాలను పెంచుకోవాలి. ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టులు, ఏఐ సాధనాలపై అవగాహన వారికి ఉపయోగపడతాయి. అదే సమయంలో కంపెనీలు కూడా శిక్షణతో కూడిన ఉద్యోగ అవకాశాలను అందించాలి. అనుభవం ఉన్నవారినే ఎంపిక చేస్తే, కొత్తవారు అనుభవం ఎలా సంపాదిస్తారు? ఫ్రెషర్లకు నేర్చుకునే అవకాశం కల్పించినప్పుడే ఉద్యోగ రంగం మరింత బలపడుతుంది.

Related News

రూ.25 వేల జీతమా? నెలకు ఎంత పొదుపు చేస్తే సేఫ్? నిపుణులు చెప్పే సూపర్ ప్లాన్ ఇదే!

అమ్మబాబోయ్.. రూ.10 టీతో నెలకు రూ.9 లక్షల సంపాదన.. ఉద్యోగం కంటే టీ కొట్టే బెటరేమో!

చదివింది ఇంటరే.. కానీ 30 ఏళ్లు డాక్టర్‌గా చలామణి.. ఏకంగా రూ.188 కోట్లు స్వాహా!

మందుబాబులకు గుడ్ న్యూస్? తగ్గనున్న స్కాచ్ విస్కీ ధరలు..

పతనానికి బ్రేక్.. మళ్లీ బంగారం ధరలు పైపైకి, ఇవాళ మార్కెట్లో ధరలు

జాబ్ ఇంటర్వ్యూలో ఏఐ స్కిల్స్ గురించి అడిగితే ఏం చెప్పాలి? కంపెనీలు మీ నుంచి ఆశించే సమాధానం ఇదే

ఏడాదికి రూ.3.25 కోట్ల వరకు వేతనం.. ఏఐ కంపెనీలో రైటర్లు కావలెను మీరూ ట్రై చేసేయండి

Big Stories

Advertisement
×