E-Paper
Advertisement

Volkswagen Virtus Prices: వినియోగదారులకు వోక్స్ వ్యాగన్ షాక్, ఆ కార్ల ధరలు భారీగా పెంపు!

Volkswagen Virtus Prices: వినియోగదారులకు వోక్స్ వ్యాగన్ షాక్, ఆ కార్ల ధరలు భారీగా పెంపు!
Advertisement

Volkswagen Cars Prices Revised 2026: దేశీయ మార్కెట్ లో పలు ఆటో మోబైల్ కంపెనీ ఇప్పటికే తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. డిసెంబర్ 31 నుంచే కొత్త ధరలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. తాజాగా ఈ లిస్టులో వోక్స్ వ్యాగన్ ఇండియా కూడా చేరింది. కొత్త టేరాన్ SUVని విడుదల చేసేంత వరకు వేచి ఉన్న కంపెనీ, ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న పోర్ట్ ఫోలియోకు సంబంధించి అప్ డేట్స్ విడుదల చేస్తూనే ఉన్నారు. జర్మన్ కార్ల తయారీదారు వర్టస్ లైనప్ ధరలను సవరించింది. కొన్ని కార్ల ధరలను పెంచడంతో పాటు మరికొన్ని కార్ల ధరలను తగ్గించింది.

కొన్ని కార్ల ధరల తగ్గింపు, మరికొన్నింటి ధరల పెంపు!  

తాజాగా కంపెనీ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఎంట్రీ లెవల్ కంఫర్ట్‌ లైన్ 1.0 MT ధర రూ. 70,201, టాప్‌లైన్ క్రోమ్ 1.0 AT ధర రూ. 3,155 తగ్గాయి. ఈ కంపెనీకి సంబంధించి ధర తగ్గింపును పొందిన ఏకైక వెర్షన్లు ఇవే. ఎందుకంటే అన్ని ఇతర వేరియంట్ల ధరలు భారీగా పెరిగాయి. కంపెనీ GT ప్లస్ క్రోమ్ 1.5 MT,  GT ప్లస్ స్పోర్ట్ 1.5 MT అనే రెండు వేరియంట్‌లను నిలిపివేసింది.

పెరిగిన వర్టస్ 1.0 MT GT లైన్ ధరలు

Advertisement

వర్టస్ 1.0 MT GT లైన్ ధరలను పెంచుతూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఈ కారు ధర రూ. 45,236 రూపాయలు పెంచింది. హైలైన్ ప్లస్ 1.0 MT, హైలైన్ ప్లస్ 1.0 AT ధరలు వరుసగా రూ. 40,541, రూ. 39,339 రూపాయలు పెరిగాయి.  తరువాతి స్థానాల్లో హైలైన్ 1.0 MT, GT లైన్ 1.0 AT, GT ప్లస్ క్రోమ్ 1.5 DSG, హైలైన్ 1.0 AT, GT ప్లస్ స్పోర్ట్ 1.5 DSG వేరియంట్లు ఉన్నాయి వీటి ధరలు వరుసగా రూ. 29,536, రూ. 29,034, రూ. 25,085, రూ. 24,032, రూ. 21,065 పెరిగాయి.

Read Also: గ్రాండ్ విటారా To ఇన్నోవా హైక్రాస్.. అదిరిపోయే మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ కార్లు ఇవే!

పెరిగిన ప్రీమియం చెల్లింపు ధర

Advertisement

అటు వోక్స్‌ వ్యాగన్ వర్టస్ టాప్‌ లైన్ క్రోమ్ 1.0 MT కొనుగోలు చేసే కస్టమర్లు అవుట్‌ గోయింగ్ ధర లిస్ట్ కంటే రూ. 5,642 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ అప్‌ డేట్‌ తో వర్టస్ ఇప్పుడు రూ. 10.50 లక్షల నుంచి రూ. 19 లక్షల వరకు ఉంటుంది. ఆన్ రోడ్ ధర విషయానికి వస్తే మరికాస్త పెరిగే అవకాశం ఉంటుంది. 2025 డిసెంబర్ 31 వరకే పలు కంపెనీలు తమ కార్ల ధరలను సవరించగా, ఇప్పుడు వోక్స్ వ్యాగన్ కొన్ని కార్ల ధరలను పెంచుతూ నిర్ణయించింది. ఇతర కంపెనీల మాదిరిగానే ఇన్ ఫుట్ ఖర్చు పెరగడం, రూపాయి మారకం విలువలో తేడాల కారణంగా ధరలను సవరించినట్లు కంపెనీ తెలిపింది. కొత్త ధరలు వెంటనే అమల్లోకి వస్తున్నట్లు వోక్స్ వ్యాగన్ ఇండియా ప్రకటించింది.

Read Also:  హ్యుందాయ్ జనవరి డిస్కౌంట్లు.. ఆ కార్లపై ఏకంగా రూ. లక్ష వరకు తగ్గింపు!

Related News

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

Big Stories

Advertisement
×