E-Paper
Advertisement

Pawan Kalyan: జనసేన పార్టీ బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫుల్ ఫోకస్.. నెక్స్ట్ ప్లాన్ ఇదే..?

Pawan Kalyan: జనసేన పార్టీ బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫుల్ ఫోకస్.. నెక్స్ట్ ప్లాన్ ఇదే..?

Pawan Kalyan: జనసేన బలోపేతంపై పవన్‌కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. ఓ వైపు కూటమి ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే … పార్టీని బలోపేతం చేయడంపై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తున్నారు.. అందులో భాగంగా జనసేన సంస్థాగతంగా బలం పెంచుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని త్రిశూల్ పేరుతో ప్రారంభించి , క్రియాశీలక సభ్యత్వాలను పెంచాలని పవన్ నిర్ణయించుకున్నారంట.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించి, పార్టీని విస్తరించాలని పవన్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారంటున్నారు …

21 సీట్లలో మాత్రమే..

ఏపీ లో ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్న టీడీపీ, వైసీపీ క్షేత్రస్థాయిలో ఎంతో బలంగా ఉన్నాయి . గ్రౌండ్ లెవెల్లో బలమైన క్యాడర్ కలిగిన ఈ పార్టీలు ఇప్పటికీ పార్టీ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య జనసేన తన సైన్యాన్ని మరింత బలపర్చుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. ఇప్పటి వరకు కూటమి రాజకీయాల్లో భాగంగా ఉన్న జనసేన గత ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా 21 సీట్లలో మాత్రమే పోటీ చేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించింది.

పిఠాపురంలో సభ్యత్వ నమోదు..

ఆ క్రమంలో భవిష్యత్తు అవసరాల కోసం బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలంటే జనసేనకు గ్రౌండ్ లెవల్ నుంచి బలం పెరగడం అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కేవలం ఫార్మాలిటీగా కాకుండా, పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంక్, బలమైన కేడర్‌ను తయారు చేసే దీర్ఘకాలిక వ్యూహంగా అమలు చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారంట. దాంట్లో భాగంగా ఐదు రోజుల పాటు పిఠాపురంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఈ డ్రైవ్‌ను చేపట్టనున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని లక్ష్యంగా పెట్టుకుని సభ్యత్వ సంఖ్యను భారీగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారంటున్నారు.

Also Read: Telangana Oil Palm: ఆయిల్ పామ్ సాగుతో.. తెలంగాణ రైతాంగానికి మహర్దశ!

మూడు విభాగాలుగా..

అయితే ఈ సారి పార్టీ సభ్యత్వ నమోదును, వినూత్నంగా చేయాలని పవన్ నిర్ణయించారట.. పార్టీ బలోపేతానికి త్రిశుల్ వ్యూహాన్ని అమలు చేస్తానని గతంలో ప్రకటించిన పవన్ కళ్యాణ్.. సభ్యత్వ నమోదు నుండి త్రిశూల్ వ్యూహాన్ని అమలు చేయబోతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సభ్యత్వాన్ని కేవలం సంఖ్యలకే పరిమితం చేయకుండా, కార్యకర్తల పాత్ర ఆధారంగా మూడు విభాగాలుగా విభజించాలని జనసేనాని నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది ..సిద్ధాంతపరంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే నాయకత్వాన్ని ఉద్యమి అని..క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే నాయకత్వాన్ని సాధక్ అని.. పార్టీకి ఆర్థిక, సాంకేతిక మద్దతు అందించే మద్దతుదారులను ప్రదాతగా వర్గీకరించారు..

5 లక్షల వరకు ప్రమాద భీమా..

ఈ విధానం ద్వారా జనసేన కేడర్‌ను క్రమబద్ధీకరించి, భవిష్యత్తు ఎన్నికల కోసం సిద్ధం వారిని సిద్దం చేయాలని జనసేన అధ్యక్షుడు భావిస్తున్నాట్టు అ పార్టీలో చర్చ నడుస్తుంది. ఇప్పటి వరకు క్రియాశీలక సభ్యత్వానికి రూ.500 రుసుము నిర్ణయించగా, ఇప్పుడు దాన్ని రూ. 400లుకి తగ్గించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మంచి స్పందన వస్తున్న్న నేపథ్యంలో వంద రూపాయలు తగ్గించి 400 పెట్టినట్టు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. సభ్యులకు 5 లక్షల వరకు ప్రమాద భీమా సదుపాయం కల్పిస్తున్నారు. అలానే ఏదైనా ప్రమాదం జరిగి వైకల్యం వస్తే రెండు లక్షలు.. ఆక్సిడెంట్ అయితే 50 వేలు వరకు పార్టీ అండగా ఉండే విధంగా కొత్త విధానాలు అమలు చేయబోతున్నారు.

Also Read: LIC Bond Missing: ఎల్ఐసీ బాండ్ మిస్ అయిందా?.. డూప్లికేట్ బాండ్ అప్లై ప్రాసెస్ ఇలా

మూడో విడుతతో మరింత దూకుడు..

దాని ద్వారా కార్యకర్తల్లో భద్రత భావన పెంచి, పార్టీతో దీర్ఘకాల అనుబంధాన్ని పెంచాలనే ఆలోచనలో జనసేన పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది…ఇప్పటికే రెండు విడుతల్లో 13 లక్షలకు పైగా సభ్యులను చేర్చుకున్న జనసేన, ఇప్పుడు మూడో విడుతతో మరింత దూకుడు గా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రూపొందిస్తోంది. టీడీపీ, వైసీపీ మధ్య ప్రధాన రాజకీయ పోటీ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, జనసేన తన సొంత రాజకీయ బలాన్ని విస్తరించుకోవడానికి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కీలకంగా ఉపయోగించుకోనుందంటున్నారు. త్రిశూల్ పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం, జనసేనను కూటమి భాగస్వామిగా ఉంటూ స్వతంత్ర శక్తిగా ఎదగాలనే దీర్ఘకాల రాజకీయ వ్యూహంగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

జనసేన లక్ష్యం..

సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా కొత్త కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానిస్తూ, సంస్థాగతంగా పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని ఆలోచనలో జనసేన పార్టీ ఉంది . క్రియాశీలక సభ్యత్వ నమోదు కోసం గతంలో ఉన్న రుసుమును తగ్గించి మరింత మందిని ఆకర్షించేలా చర్యలు చేపట్టింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని జనసేన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ గడువు లోపు రాష్ట్రవ్యాప్తంగా మరియు ఇతర రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలని నాయకత్వం భావిస్తోంది. మొత్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయుధంగా మలుచుకున్న జనసేన … త్రిశూల్ కార్యక్రమంతో సంస్థాగతంగా మరింత బలోపేతం అవ్వాలని ప్రయత్నిస్తోంది. మరి చూడాలి జనసేనాని ‘త్రిశూల్’ అనుకున్న టార్గెట్‌ని ఎంత వరకు చేధిస్తుందో?

Story By Apparao

Also Read: Dharmavaram: రాష్ట్రంలో వింత కేసు.. భర్త ప్రియుడిపై పీఎస్‌లో ఫిర్యాదు చేసిన భార్య, అసలేం జరిగిందంటే..?

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×