E-Paper
Advertisement

రౌండ్ ఫిగర్ కాకుండా రూ.110, రూ.210 పెట్రోల్ ఎందుకు కొట్టిస్తారు? ఫ్యూయెల్ ఫిల్లింగ్‌ మైండ్ గేమ్ వెనుక సీక్రెట్ ఇదే!

రౌండ్ ఫిగర్ కాకుండా రూ.110, రూ.210 పెట్రోల్ ఎందుకు కొట్టిస్తారు? ఫ్యూయెల్ ఫిల్లింగ్‌ మైండ్ గేమ్ వెనుక సీక్రెట్ ఇదే!
Advertisement

Petrol Filling Psychology: పెట్రోల్ బంక్‌ కి వెళ్లినప్పుడు చాలామంది రూ.100, రూ.200 లాంటి రౌండ్ ఫిగర్‌ కు బదులుగా, రూ.110, రూ.210, రూ.510 కొట్టిస్తుంటారు. ఇది సాధారణ అలవాటులా కనిపించినా, దాని వెనుక కొన్ని ఇంట్రెస్టింగ్ రీజన్స్ ఉన్నాయి. ఈ విధానం కేవలం యాదృచ్ఛికం కాదు. కొంతమంది వ్యక్తుల ఆలోచనా విధానం, అనుభవాలు, మానసిక భావనలు ఇలా చేసేలా ప్రభావం చూపుతాయి. నిజానికి సంఖ్యల విషయంలో ఒక్కో వ్యక్తికి ఒక్కోరకమైన అభిరుచి ఉంటుంది. కొంతమందికి రౌండ్ ఫిగర్స్ ఇష్టం అయితే, మరికొందరికి కొంచెం భిన్నంగా ఉండే సంఖ్యలను ఇష్టపడుతారు. రూ.110, రూ. 210 లాంటివి కాస్త ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఇవి సాధారణంగా కనిపించే రూ.100, రూ.200కు భిన్నంగా ఉన్నాయి.

మానసిక సంతోషం

ఇంకా ఒక ముఖ్యమైన కారణం బడ్జెట్‌ కు సంబంధించినది. చాలామంది తమ దగ్గర ఉన్న డబ్బు, రోజువారీ ఖర్చుల ప్రకారం పెట్రోల్ నింపించుకుంటారు. ఎవరికైనా రూ.200 ఖర్చు చేయాలని అనిపిస్తే, వారు కొంచెం అదనంగా రూ.210 అని చెప్పవచ్చు. ఇలా చేయడం వల్ల తాము ఖర్చు చేస్తున్న డబ్బు మీద ఒక నియంత్రణ ఉన్నట్టు భావిస్తారు. కొంతమందికి ఇది ఒక మానసిక సంతృప్తిని కూడా ఇస్తుంది.

ట్యాంక్‌లో ఇంధన స్థాయిని బట్టి!

Advertisement

అదేవిధంగా, ట్యాంక్‌ లో ఉన్న ఇంధనం స్థాయిని బట్టి ఈ మొత్తాలు మారుతాయి. వాహనంలో ఇప్పటికే కొంత పెట్రోల్ ఉన్నప్పుడు, పూర్తి, సగం వరకు చేరడానికి అవసరమైన అంచనా ప్రకారం రూ.110, రూ.210 కొట్టిస్తారు.

పెట్రోల్ బంకులో మోసాలకు చెక్ పెట్టేలా?

గతంలో కొన్నిసార్లు పెట్రోల్ బంక్‌లలో మోసాలు జరిగేవని వార్తలు వినిపించేవి. దీంతో కొంతమంది వినియోగదారులు రౌండ్ ఫిగర్లకు బదులుగా కాస్త ఎక్కువ చెప్పడం ప్రారంభించారు. రౌండ్ ఫిగర్ కు ఎక్కువ చెప్పడం వల్ల మోసాలను అరికట్టే అవకాశం ఉంటుందని భావిస్తారు. లేటెస్ట్ డిజిటల్ యంత్రాలు చాలా కచ్చితంగా పని చేస్తున్నప్పటికీ, ఆ పాత అలవాటు ఇంకా కొందరిలో కొనసాగుతోంది.  ఒకసారి ఇలా చేయడం మొదలుపెడితే, తరువాత కూడా అదే విధంగా కొనసాగించడం సహజంగా మారుతుంది. దీనికి ప్రత్యేకమైన కారణం లేకపోయినా, మనసుకు అలవాటు పడిన విధానాన్ని మార్చడం కొంతమందికి కష్టంగా ఉంటుంది.

Advertisement

మొత్తానికి రూ. 110, రూ.210, రూ. 510 లాంటి మొత్తాలలో పెట్రోల్ నింపడం వెనుక ఒకే కారణం ఉండదు. ఇది వ్యక్తిగత అభిరుచి, బడ్జెట్ ప్లానింగ్, అనుభవాలు, కొంతమంది నమ్మకాల ప్రకారంకొనసాగుతుంది. చిన్న విషయం లాగా కనిపించినా, మన రోజువారీ నిర్ణయాల్లో మానసిక అంశాలు ఎంత ప్రభావం చూపుతాయో ఈ అలవాటు స్పష్టంగా చూపిస్తుంది.

Read Also: ప్రీమియం నుంచి బడ్జెట్ వరకు.. కొత్త టెక్నాలజీతో రాబోయే 4 అద్భుతమైన కార్లు!

Related News

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×