E-Paper
Advertisement

డేంజర్ బెల్స్.. రాష్ట్రంలో తగ్గుతున్న భూగర్భ జలాలు

డేంజర్ బెల్స్.. రాష్ట్రంలో తగ్గుతున్న భూగర్భ జలాలు
Advertisement

Groundwater Crisis: స్వేచ్ఛ బ్యూరో: నీటి వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. వేసవి మధ్య దశలో భానుడి ప్రతాపం చూపుతున్నాడు. దీంతో భూగర్భజలాలు సైతం క్రమంగా పడిపోతున్నాయి జిల్లాలో భూగర్భ జల మట్టం గత సంవత్సరం మార్చిలో సగటున 5.89 మీటర్లు ఉండగా ప్రస్తుతం 5.17 మీటర్లు ఉంది. మార్చి మాసానికి సంబంధించిన భూగర్భ జలాల గణాంకాలను ఆ శాఖ ఇటీవల విడుదల చేసింది.నీటిమట్టలు వేగంగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రజలు పొదుపు చర్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని భూగర్భ జల శాఖ అధికారులు సూచిస్తున్నారు.

వరి,ఇతర కూరగాయల సాగు అవసరాలకు

జిల్లాలో వరి సాగు అధికంగా ఉంది మరో పది రోజులలో ఆ పంట కోతకి రానున్నది. దీంతో నీటి వినియోగం క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఇతర కూరగాయల, ఉద్యానవన పంటలు,బోర్లు, బావుల కింద ఉచిత విద్యుత్ ద్వారా మోటర్లు వినియోగం ఉంది.ప్రస్తుత రబీలో వేరుశనగ కూరగాయల పంటలు సాగులో ఉన్నాయి. వాటికి నీరు పెట్టేందుకు రైతులు ఆటోమేటిక్ స్టార్టర్ ఏర్పాటు చేయడంతో కరెంటు ఉన్నంతసేపు బోర్లు నడుస్తున్నాయి. దీనివల్ల అవసరాన్ని కంటే వృధా అవుతున్న నీరు ఎక్కువ జరుగుతోంది. మరోవైపు రానున్న ఖరీఫ్ లో పంటల సాగుకు ప్రస్తుత వేసవిలో బోర్ల తవ్వకాల జోరు ఊపందుకోంది.

Advertisement

Also Read: అశ్వారావుపేటకు గ్రీన్ ఫీల్డ్ సెగ.. కళ తప్పిన వ్యాపార రాజధాని..!

పొదుపు పాటించకుంటే ఇక్కట్లే..

భూగర్భ జల మట్టాలు పడిపోతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. నీటి పొదుపుపై ప్రజలకి చైతన్యవంతులని చేసే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎండలు మరింత ముదిరితే నీటి మట్టాలు మరింత లోతుకు పడిపోతాయి. తాగునీటికి సైతం ఇక్కట్లు తప్పవు. ఇంకుడు గుంతల ఏర్పాటుతో పాటు నీటి వృధాను అరికట్టడం ప్రధానం.

అవగాహన కల్పిస్తున్నాం: భూగర్భ జల శాఖ రాజేష్

Advertisement

నీటిని పొదుపుగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇదే విషయమై అవగాహన కల్పించేందుకు ప్రాధాన్యమిస్తున్నాం.భూగర్భ జలాలను గరిష్టంగా వాడకుండా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైనప్పుడే వ్యవసాయ అవసరాలకు వినియోగించాలని రైతులకు సూచిస్తున్నాం. సాదారణంగా జిల్లాలో సాధారణ భూగర్భ జలాల నీటి మట్టాలు మీటర్లలో 5.89 గత సంవత్సరం ఉండగా ప్రస్తుతం 5.17 గా నమోదయింది.

Also Read: కేసీఆర్ వారసత్వం వద్దు.. కవిత నయా రాజకీయం వెనుక అసలు ప్లాన్ ఇదే..!

2025. 2026
అలంపూర్. 7.37 6.96
ధరూర్ 4.70 4.73
గద్వాల్ 3.69 4.73
గట్టు 8.07 6.82
ఐజ .31 4.58
ఇటిక్యాల 4.49 3.94
కేకే దొడ్డి 11.84 9.71
మల్దకల్ 3.51 2.81
మనోపాడు 3.59 3.71
రాజోలి 3.74 4.0
ఉండవల్లి 12.85 10.45
వడ్డేపల్లి. 3.89 2.97
ఎర్రవల్లి 3.54 3.10

Related News

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

మీ వీధిలో ప్రమాదకరంగా కరెంట్ తీగలు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!

ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!

స్కూటీని ఢీకొన్న కారు.. అన్నాచెల్లెళ్లు దుర్మరణం!

నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలు మనవే.. కార్యకర్తలకు రాంచందర్ రావు దిశానిర్దేశం!

Big Stories

Advertisement
×