E-Paper
Advertisement

బడ్జెట్ ధరలో ఇలాంటి ఫీచర్లా? 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో రెడ్‌మీ సరికొత్త రికార్డ్!

బడ్జెట్ ధరలో ఇలాంటి ఫీచర్లా? 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో రెడ్‌మీ సరికొత్త రికార్డ్!
Advertisement

Redmi Note 17 Pro Max: షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ నుండి రాబోతున్న నోట్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే Redmi Note 15 సిరీస్ మార్కెట్లోకి వచ్చినప్పటికీ.. అప్పుడే తర్వాతి తరం మోడల్ అయిన Redmi Note 17 Pro Max గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైపర్ ఓఎస్ కోడ్ మార్పుల ద్వారా ఈ ఫోన్ అభివృద్ధి దశలో ఉన్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సిరీస్‌లో ప్రో మాక్స్ వేరియంట్ ఫీచర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

అదే పవర్‌ఫుల్ కెమెరా సెటప్..

ఈ Redmi Note 17 Pro Max ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. రెడ్‌మీ తమ పాత పద్ధతినే కొనసాగించేలా కనిపిస్తోంది. గత మోడల్ మాదిరిగానే దీనిలో కూడా 200MP ప్రధాన కెమెరాను అందించనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం శాంసంగ్ ఐసోసెల్ సెన్సార్‌ను వాడనున్నారు. దీనికి తోడు 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉండనుంది. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP కెమెరాను అమర్చనున్నట్లు సమాచారం. ఫొటోగ్రఫీ ప్రియులను ఆకట్టుకోవడానికి రెడ్‌మీ తమ కెమెరా నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెడుతోంది.

Advertisement

Also Read: చైనా ఫోన్లకు పోటీగా దేశీ బ్రాండ్ హవా.. జస్ట్ రూ.12 వేలకే 6GB ర్యామ్ 5G ఫోన్ తెచ్చిన లావా!

కొత్త చిప్‌సెట్‌తో మెరుగైన పనితీరు..

పర్ఫార్మెన్స్ విషయంలో ఈ ఫోన్ ఒక అడుగు ముందే ఉండబోతోంది. రెడ్‌మీ నోట్ 17 ప్రో మాక్స్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7500 చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నట్లు లీకులు చెబుతున్నాయి. ఇది గతంలో వాడిన డైమెన్సిటీ 7400 కంటే మెరుగైన వేగాన్ని, గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. మల్టీ టాస్కింగ్ చేసేవారికి, గేమర్లకు ఈ ప్రాసెసర్ మంచి ఎంపిక అవుతుందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ పరంగా కూడా ఇది లేటెస్ట్ అప్‌డేట్స్‌తో రానుంది.

భారీ బ్యాటరీ సామర్థ్యం..

Advertisement

ఈ ఫోన్లోని మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దీని బ్యాటరీ సామర్థ్యం. చైనా వేరియంట్‌లో ఏకంగా 10,000mAh కంటే పెద్ద బ్యాటరీని ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేసరికి దీనిలో ఏవైనా మార్పులు ఉంటాయా అనేది చూడాలి. ఈ ఫోన్ తొలుత చైనాలో విడుదలయ్యి.. ఆ తర్వాత ఈ ఏడాది చివరిలో లేదంటే 2027 ప్రారంభంలో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కంపెనీ దీనిపై అధికారికంగా స్పందించనప్పటికీ.. ఫ్యాన్స్ మాత్రం ఈ కొత్త ఫోన్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Also Read: సెన్హైజర్ నుంచి ఇంత తక్కువ ధరకే హెడ్‌ఫోన్సా? క్వాలిటీ చూస్తే ఇప్పుడే బుక్ చేసుకుంటావ్ మావా!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×