E-Paper
Advertisement

Underground Living: ఆ ఊరిలో ఎంతటి ధనవంతుడైనా.. అండర్‌గ్రౌండ్‌లో ఉండాల్సిందే, ఐడియా బాగుందే!

Underground Living: ఆ ఊరిలో ఎంతటి ధనవంతుడైనా.. అండర్‌గ్రౌండ్‌లో ఉండాల్సిందే, ఐడియా బాగుందే!
Advertisement

వేసవిలో ఎడారి ప్రాంతంలో ఉండే వారికి బాధల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటు చూసినా ఇంచుమించు 50 డిగ్రీలకు పైగా ఎండ, అడుగంటే నీటి ఊటలు, భగ్గున మండే ఇసుల దిబ్బలు. ఎండల ధాటికి మలమల మాడిపోతారు. కానీ, ప్రపంచంలోని ఓ ప్రాంత ప్రజలు మాత్రం ఎడారిలో ఉన్నా, ఎంత ఎండ కొట్టినా, సహజ సిద్ధంగానే ఏసీలకు మించిన చల్లదనంతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇంతకీ ఆ ప్రాంతం ఏది? ఎడారిలో చల్లదనాన్ని ఎలా పొందుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఆస్ట్రేలియాలోని మారుమూల ఎడారి ప్రాంతం

ఎండ ఎంత ఉన్నా చల్లగా ఎంజాయ్ చేస్తున్న ప్రజలు దక్షిణ ఆస్ట్రేలియాలోని ఓ మారుమూల ఎడారి ప్రాంతంలో ఉన్నారు. ఆ ఆ పట్టణం పేరు కూబర్‌ పెడే. ఈ పట్టణం గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలగకమానదు. ఎందుకంటే ఈ పట్టణం అంతా భూగర్భంలోనే ఉంటుంది. 1915లో రూపు దిద్దుకున్న ఈ పట్టణం ఇప్పుడు ఫేమస్ టూరిస్టు స్పాట్ గా మారిపోయింది. ఈ ప్రాంతంలో భూగర్భంలో నిర్మించిన ఇళ్లను డగౌట్స్‌ అని పిలుస్తుంటారు.

ఇంతకీ కూబర్ పెడే ఎలా అవతరించింది?

Advertisement

ఈ ప్రాంతంలో భూగర్భంలో ఇళ్లను ఏర్పాటు చేసుకోవడానికి కారణం అత్యంత విలువైన రంగురాళ్లు. ఈ రాళ్లలో సిలికా అనే పదార్థం ఉంటుంది. దాని మీద సూర్యకాంతి పడగానే, ఏడు రంగులు విరజిమ్ముతుంది. ఇలాంటి విలువైన రాళ్లు దక్షిణ ఆస్ట్రేలియాత పాటు పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఎడారిలోనూ ఉన్నాయి. ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత, ఆ యుద్ధంలో పాల్గొన్న సైనికులు.. విలువైన రంగురాళ్ల కోసం ఆ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టారు. కొద్ది రోజుల తర్వాత డగౌడ్స్ గా మారిపోయాయి. అలా భూగర్భంలో వందలాది ఇళ్లు నిర్మాణం అయ్యాయి. కూబర్‌ పెడే పట్టణం ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ 2500 మంది నివాసం ఉంటున్నారు.

అన్ని రకాల హంగులతో..  

భూగర్భంలో నిర్మించుకున్న ఈ ఇండ్లు చిన్నా చితకవి కాదు. చాలా వరకు ట్రిఫుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయి. అంతేకాదు, లివింగ్ రూమ్, కిచెన్, బెడ్ రూమ్స్ వింత్ బాత్ రూమ్ తో ఉన్నాయి. చాలా వరకు ఈ ఇళ్లు సుమారు 15 అడగుల లోతున ఉన్నాయి. అంతేకాదు, ఇక్కడ భూగర్భంలోనే దుకాణాలు, బార్లు, ఇతర వాణిజ్య సముదాయాలు కూడా ఉన్నాయి. విద్యుత్, వాటర్, ఇంటర్నెట్ సౌకర్యాలు కూడా ఉన్నాయి.

నిత్యం చల్లదనంతో ఉండే డగౌట్స్‌

Advertisement

ఇక్కడ ఉన్న ఇళ్లు చల్లగా ఉంటాయి. 24 డిగ్రీలకు దాటి వేడి ఉండదు. అందుకే ఇక్కడి ప్రజలు అంతా ఏసీ లేకుండానే ఉంటారు. ఎడారిలో ఉన్నా, ఏమాత్రం ఎండలేకుండా జీవిస్తారు. ఎండా, వానతో సంబంధం లేకుండా ఒకేరకమైన జీవితాన్ని కొనసాగిస్తారు. ఇక ఈ భూగర్భంలోని ఇళ్లను చూసేందుకు పెద్ద మొత్తంలో పర్యాటకులు తరలివస్తారు. వీటిని చూసేందుకు స్థానికులు నిర్ణీత ఎంట్రెన్స్ ఫీజును తీసుకుంటారు. మొత్తంగా కూబర్ పెడే ప్రపంచ వ్యాప్తగాం తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Read Also:  నిజంగా వండర్.. ఇక్కడ రైళ్లు సముద్రంలో పరిగెడుతున్నట్లు కనిపిస్తాయి!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×