E-Paper
Advertisement

TTD Jobs 2026: టీటీడీ హాస్పిటల్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.53,495 జీతం, ఈ అర్హత ఉంటే జాబ్ వచ్చేస్తది..!

TTD Jobs 2026: టీటీడీ హాస్పిటల్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.53,495 జీతం, ఈ అర్హత  ఉంటే జాబ్ వచ్చేస్తది..!
Advertisement

నిరుద్యోగ అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం..  తిరుమల తిరుపతి దేవస్థానములు (TTD) అనుబంధ ఆసుపత్రుల్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్.. ఎంబీబీఎస్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు ఫీజు, తదితర అంశాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తిరుమల తిరుపతి దేవస్థానములు (TTD) అనుబంధ ఆసుపత్రుల్లో వైద్య సేవల బలోపేతానికి శ్రీకారం చుట్టింది. తిరుమల, తిరుపతిలోని టీటీడీ వైద్యశాలల్లో కాంట్రాక్ట్ విధానంలో ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 8 ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 8

విద్యార్హత:

Advertisement

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ (MBBS), ఎంఎస్ (MS), ఎండీ (MD) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగాల్లో విద్యార్హతలతో పాటు నిర్ణీత పని అనుభవం కూడా పరిగణలోకి తీసుకుంటారు.

జీతం:

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.53,495 వేతనం చెల్లిస్తారు. టీటీడీ నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ గడువు, ఇతర సౌకర్యాలు వర్తిస్తాయి.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ:

అభ్యర్థులను కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక చేస్తారు. రాత పరీక్ష నిర్వహించడం లేదు. అభ్యర్థుల మెరిట్, పని అనుభవం ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇతర సర్టిఫికెట్ల సెట్లతో నిర్ణీత వేదికకు చేరుకోవాలి.

ఇంటర్వ్యూ వివరాలు..

మార్చి 5వ తేదీన తిరుపతిలోని సెంట్రల్ హాస్పిటల్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఉదయం నిర్ణీత సమయానికి అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో ఈ నియామకాలు జరుగుతున్నాయి.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.tirumala.org/

ALSO READ: Child Welfare: ఆ జిల్లా నిరుద్యోగులకు పండగలాంటి వార్త.. రూ.34,000 జీతంతో ఉద్యోగాలు

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×