E-Paper
Advertisement

Train On The Sea: నిజంగా వండర్.. ఇక్కడ రైళ్లు సముద్రంలో పరిగెడుతున్నట్లు కనిపిస్తాయి!

Train On The Sea: నిజంగా వండర్.. ఇక్కడ రైళ్లు సముద్రంలో పరిగెడుతున్నట్లు కనిపిస్తాయి!
Advertisement

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన రైలు ప్రయాణాలు ఉన్నాయి. జీవితంలో ఒక్కసారినా ఈ ప్రయాణాలు చేయాలని ట్రావెల్ లవర్స్ ఆలోచిస్తుంటారు. అయితే, మన దేశంలో పాటు పరిసర దేశాల్లోనూ మర్చిపోలేని రైల్వే ప్రయాణ మార్గాలు ఉన్నాయి. వాటిలో ఓ క్రేజీ రైల్వే జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

లైఫ్ లో ఒక్కసారైనా ఈ రైలు ప్రయాణం చేయాల్సిందే!

శ్రీలంక కొలంబోలోని కొల్లుపిటియా రైల్వే స్టేషన్ గురించి ట్రావెల్ లవర్స్ కు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఓ సబర్బన్ స్టాప్. కానీ, ఓ అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. హిందూ మహాసముద్రానికి ఆనుకుని ఉన్న ఈ రైల్వే స్టేషన్   ప్లాట్‌ ఫారమ్ అలలు తేలియాడుతుంటాయి. ఇక్కడ సూర్యాస్తమయాలు నారింజ రంగులో కరిగిన షేడ్స్‌ లో ఆకాశం కనువిందు చేస్తుంది.

సముద్రంతో సావాసం చేసే రైల్వే స్టేషన్

Advertisement

కొల్లుపిటియా రైల్వే స్టేషన్ శ్రీలంక తీరప్రాంతంలో భాగం. ఈ స్టేషన్ సముద్రాన్ని ఆనుకుని ఉండటం వల్ల అలలు కొన్నిసార్లు పట్టాల మీదికి వచ్చి వెళ్తుంటాయి. ఇక్కడ రైలు దిగిన క్షణంలో పసుపు స్తంభాలు, ఓపెన్ ప్లాట్‌ ఫారమ్‌లు,  విశాలమైన సముద్ర దృశ్యం ఎంతో కనువిందు చేస్తుంది. గాలి వీచే సమయంలో సముద్రపు తుంపరలు ప్లాట్‌ ఫారమ్ వరకు వచ్చి వెళ్తుంటాయి. దూరం నుంచి వచ్చే రైళ్లు సముద్రంలో నుంచి పరుగులు తీస్తున్నట్లు కనిపిస్తుంది. ఇలాంటి దృశ్యం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. కొల్లుపిటియా కోస్టల్ లైన్‌లోని కొలంబో ఫోర్ట్ నుంచికేవలం 3.14 కి.మీ దూరంలో ఉంటుంది.

నిత్యం ట్రావెలర్స్ తో కళకళ

శ్రీలంకు వెళ్లే ట్రావెలర్స్ కచ్చితంగా  కొల్లుపిటియా రైల్వే స్టేషన్ ను చూడకుండా వెళ్లరు. మధ్యాహ్నం పూట ఇక్కడ ఫోటోలు తీస్తే ఎంతో అద్భుతంగా వస్తాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలోనూ కనువిందు చేసే ఫోటోలను చిత్రించే అవకాశం ఉంటుంది. బంగారు కాంతి, తక్కువ జనసమూహం, అలలు పెద్దగా కనిపించే విధానం ఆకట్టుకుంటాయి.  రైలింగ్ దగ్గర నిలబడి, ఆకాశం నెమ్మదిగా గులాబీ, టాన్జేరిన్ షేడ్స్‌ లోకి మారుతున్నప్పుడు వెచ్చని గాలిని అనుభూతిని పొందవచ్చు.

మర్చిపోలేని కోస్టల్ రైలు అనుభవం

Advertisement

కొల్లుపిటియా రైల్వే స్టేషన్ కు వెళ్లకుండా శ్రీలంక నుంచి తిరిగి వస్తే ఆ ప్రర్యటన సంపూర్ణం కానట్లు భావిస్తారు ట్రావెలర్స్.  ముఖ్యంగా  మౌంట్ లావినియా, కొలంబో మధ్య 30 నిమిషాల దూరం మర్చిపోలేని అనుభూతిని అందిస్తుంది. ఈ ప్రయాణంలో పట్టాలు సముద్రానికి సమాంతరంగా ఉంటాయి. కొన్నిసార్లు రైలు సముద్రంలో నుంచి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. అందుకే ఈ మార్గంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రయాణిస్తే, అంద్భుతంగా ఉంటుందంటారు ట్రావెల్ గైడ్స్. అయితే, ఫోటోల కోసం ప్రయత్నించే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని రైల్వే సిబ్బంది సూచిస్తారు. సో, మీరు కూడా ఎప్పుడైనా శ్రీలంకు వెళ్తే కచ్చితంగా ఈ రైల్వే స్టేషన్ కు వెళ్లిరండి!

https://www.instagram.com/reels/DUa2pC6iuEF/

Read Also: హైడ్రోజన్ ట్రయల్ రన్ షురూ, స్పీడ్ ఎంతో తెలుసా?

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×