E-Paper
Advertisement

Ganja Bhang Seized: గంజాయి ‘బంగ్’ కలకలం.. హోలీ పూట మత్తు చిమ్ముతున్న ముఠా అరెస్ట్..

Ganja Bhang Seized: గంజాయి ‘బంగ్’ కలకలం.. హోలీ పూట మత్తు చిమ్ముతున్న ముఠా అరెస్ట్..
Advertisement

Ganja Bhang Seized: సాధారణంగా హోలీ పండుగ అంటే అందరూ రంగులు పూసుకోవడం.. ఆనందంగా గడపడం చూస్తుంటాం. కొందరు సరదాగా కోడిగుడ్లు.. టమాటాలతో కూడా కొట్టుకుంటారు. కానీ హైదరాబాద్‌లోని దూల్పేట్.. నాంపల్లి ఏరియాల్లో మాత్రం కొందరు ఈ పండుగను మత్తు కోసం వాడుకుంటున్నారు. రంగుల ముసుగులో గంజాయితో తయారు చేసిన బంగ్ వాడుతూ రచ్చ చేస్తున్న వారిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.

ఎస్టీఎఫ్ ఏ టీం అధికారి అంజిరెడ్డి నేతృత్వంలో.. దూల్పేట్ ఎక్సైజ్ సిబ్బంది కలిసి ఈ మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 2.622 కేజీల గంజాయి బంగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో మూడు కేసులు నమోదు చేసి.. మొత్తం ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిని తదుపరి విచారణ కోసం దూల్పేట్ ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.

Advertisement

పోలీసులు వెల్లడించిన వివరాల ప్ర‌కారం.. బేగం బజార్లో హోలీ వేడుకల కోసం అమ్ముతున్న 860 గ్రాముల బంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో చింతమని చందర్ సింగ్.. సోహెల్ సింగ్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు.ఒక ఇంట్లో (ఇంటి నెంబర్ 15-7-585) నిల్వ ఉంచిన 812 గ్రాముల గంజాయి బంగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భరత్ రాజ్, నందన్ యాదవ్, మహేష్ అనే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చుడి బజార్లో ఇంటి నెంబర్ 14-8-155లో తనిఖీలు చేయగా.. 950 గ్రాముల బంగ్ బయటపడింది. సాగర్ శర్మ.. అజయ్ శర్మ అనే ఇద్దరిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు అప్పగించారు. పండుగ ముసుగులో ఇటువంటి మత్తు పదార్థాలను విక్రయించినా.. వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గంజాయితో తయారు చేసే ఈ బంగ్ ప్రాణాలకు ముప్పని.. యువత ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.

Advertisement

‘బంగ్’ (Bhang) అనేది గంజాయి ఆకులు, మొగ్గలను ఉపయోగించి తయారు చేసే ఒక రకమైన మత్తు పదార్థం. ఉత్తర భారతదేశంలో హోలీ, మహాశివరాత్రి పండుగల సమయంలో దీని వినియోగం ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని తీసుకున్న‌ తర్వాత మనిషి కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీనివల్ల మొదట విపరీతమైన ఆనందం, ఉత్సాహం కలిగినట్లు అనిపించినా, క్రమంగా అది మత్తులోకి జారుకునేలా చేస్తుంది. అయితే, పరిమితి దాటితే ఇది గుండె వేగాన్ని పెంచడం, తీవ్రమైన ఆందోళనకు దారితీసే ప్రమాదం ఉంది.

మ‌న‌ దేశంలో గంజాయి పూలు, రెసిన్ (Charas) వాడకంపై నిషేధం ఉన్నప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో గంజాయి ఆకులతో చేసే ‘బంగ్’ వినియోగానికి పరిమిత అనుమతులు ఉన్నాయి. కానీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో దీనిని గంజాయి ఉత్పత్తుల కింద పరిగణించి కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారు.

Read Also: Jaggery: మీరు తినే బెల్లంలో సోడా కలిపారో లేదో.. ఇంట్లోనే ఇలా కనిపెట్టేయండి!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×