E-Paper
Advertisement

Ind vs NZ ODI Series: న్యూజిలాండ్ తో వ‌న్డేలు..టీమిండియా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌..ఆ ద‌రిద్రుడికి మ‌రో ఛాన్స్ !

Ind vs NZ ODI Series: న్యూజిలాండ్ తో వ‌న్డేలు..టీమిండియా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌..ఆ ద‌రిద్రుడికి మ‌రో ఛాన్స్ !
Advertisement

Ind vs NZ ODI Series:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జనవరి 11వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మూడు వన్డేల సిరీస్ కోసం తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక ప్రకటన చేసింది. ఈ 3 వన్డేలు ఆడే టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. గిల్ కెప్టెన్సీలోని టీమిండియా జట్టు, న్యూజిలాండ్ తో వన్డేలు ఆడనుంది. చాలా రోజుల నుంచి టీమిండియా కు దూరమైన శ్రేయాస్ అయ్యర్, గిల్ ఇద్దరు కూడా రీ-ఎంట్రీ ఇచ్చారు. దీంతో టీమిండియా ఫుల్ జోష్లో కనిపిస్తోంది. గిల్ కు మ‌రోసారి కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ భారత క్రికెట్ నియంత్రణ మండలి, శ్రేయాస్ అయ్య‌ర్ కు వైస్ కెప్టెన్సీ ఇచ్చింది.

Also Read: Ravichandran Ashwin: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 కంటే సీరియ‌ల్స్ చూడ‌టం బెట‌ర్‌..టీమిండియా ఆడ‌టం దండ‌గే

టీమిండియా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌..ఆ ద‌రిద్రుడికి మ‌రో ఛాన్స్

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య 3 వన్డేలు జరగనున్న నేపథ్యంలో తాజాగా జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇందులో గిల్ అలాగే శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే మరోసారి టీమిండియా స్టార్ ఆటగాడు రుతురాజు గైక్వాడ్ కు అవకాశం ఇవ్వలేదు బీసీసీఐ. అదే సమయంలో మహమ్మద్ షమీకి కూడా మరోసారి నిరాశ ఎదురైంది. కానీ మహమ్మద్ సిరాజ్ కు మాత్రం అవకాశం ఇచ్చారు. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ , హర్షిత్ రాణా ఇద్దరికీ అవకాశం ఇచ్చారు.

అంతేకాదు అర్ష దీప్ సింగ్ కు కూడా ఈ టోర్నమెంటులో అవకాశం దక్కింది. స్పిన్నర్లుగా వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా అలాగే కుల్దీప్ యాదవ్ జట్టుకు సేవలు అందించనున్నారు. ఆల్ రౌండర్ గా నితీష్ కుమార్ రెడ్డితో పాటు రవీంద్ర జడేజా బరిలోకి దిగుతారు. వికెట్ కీపర్ లుగా రాహుల్ తో పాటు పంత్ కు అవకాశం ఇచ్చారు. అయితే తుది జట్టులో కేఎల్ రాహుల్ కు అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతోపాటు యశస్వి జైష్వాల్ కూడా స్థానం సంపాదించుకున్నాడు.

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ జనవరి 11వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలి వ‌న్డే వ‌డోద‌ర వేదిక‌గా జ‌రుగ‌నుంది. జనవరి 14వ తేదీన రెండవ వన్డే రాజ్ కోట్ నిర్వహించనున్నారు. జనవరి 18వ తేదీన ఇండోర్ వేదికగా మూడవ మ్యాచ్ నిర్వహిస్తారు.

న్యూజిలాండ్ తో ఆడే భారత జట్టు ఇదే

టీమిండియా ( Team India): గిల్ (కెప్టెన్), రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి, కే ఎల్ రాహుల్ (WK), శ్రేయాస్ అయ్యర్ (VC), సుందర్, జడేజా, సిరాజ్, హర్షిత్, ప్రసిద్ధ్, కుల్దీప్, పంత్ (WK), నితీష్, అర్ష దీప్ సింగ్‌, యశస్వి.

 

Also Read:  Sai Sudharsan Injury: విరిగిన పక్కటెముక.. పెను ప్రమాదంలో సాయి సుదర్శన్..ఐపీఎల్ 2026 నుంచి ఔట్ ?

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×