E-Paper
Advertisement

Yamaha Aerox E: యమహా నుంచి ప్రీమియం ఈవీ, Aerox E EV స్కూటర్ లాంచింగ్ ఎప్పుడంటే?

Yamaha Aerox E: యమహా నుంచి ప్రీమియం ఈవీ, Aerox E EV స్కూటర్ లాంచింగ్ ఎప్పుడంటే?
Advertisement

Yamaha Aerox E EV Launch Date: యువతను ఆకట్టుకునేలా స్టైలిష్ బైక్స్, స్కూటర్స్ తీసుకురావడంలో యమహా ముందుటుంది. ఈ కంపెనీ నుంచి మరో క్రేజీ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల కాబోతోంది. Yamaha Aerox E పేరుతో దీనిని మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఇది స్పోర్టీ డిజైన్, పెర్ఫార్మెన్స్‌ మీద బాగా ఫోకస్ చేసింది. ఈ స్కూటర్ కు సంబంధించి భారత్ లో నవంబర్ 2025లో కీలక ప్రకటన వచ్చింది. ఈ స్కూటర్ ను 2026 జనవరి, ఫిబ్రవరిలో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా, ఈ నెలలో లేదంటే వచ్చే నెలలో లాంచ్ కానుంది. ఈ స్కూటర్ యమహా ప్రీమియం EV సెగ్మెంట్‌ లో భాగం కానుంది. గ్యాసోలిన్ వెర్షన్ Aerox 155 ఆధారంగా ఈ స్కూటర్ ను డెవలప్ చేసింది.

Yamaha Aerox E అంచనా ధర, స్పెసిఫికేషన్లు

Yamaha Aerox E  అంచనా ధర రూ.2.50 లక్షలు నుంచి రూ.2.60 లక్షలు వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు వేరియంట్, సిటీ ఆధారంగా ధరలు కాస్త మారే అవకాశం ఉంటుంది. ఈ స్కూటర్ 3kWh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. మోటార్ పవర్ 9.4 Kw ఉంటుంది. పూర్తి ఛార్జ్ మీద 106 కిలో మీటర్ల పరిధిని అందిస్తుంది. టాప్ స్పీడ్ 120 నుంచి 127 కిలో మీటర్లు ఉంటుంది. దీనికి డబుల్ డిస్క్ బ్రేకులు ఉంటాయి. ట్యూబ్ లెస్ టైర్లతో వస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఉంటుంది. ఈ స్కూటర్ స్టాండర్డ్ ఛార్జర్ తో 4-5 గంటలు పడుతుంది.

Advertisement

Read Also: వోల్వో నుంచి ఫస్ట్ లగ్జరీ SUV.. దీని రేంజ్ ఎంతో తెలుసా?

Yamaha Aerox E డిజైన్, ఫీచర్లు

Yamaha Aerox E  మంచి డిజైన్ ను కలిగి ఉంటుంది. స్పోర్టీ లుక్, LED హెడ్‌ లైట్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ప్రీమియం ఫినిషింగ్ ఉంటుంది. ఇది Aerox సిరీస్ సిగ్నేచర్ స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. నావిగేషన్, కీలెస్ ఎంట్రీ, బ్లూటూత్ కనెక్టివిటీ,  స్మార్ట్‌ ఫోన్ ఇంటిగ్రేషన్ లాంటి స్మార్ట్ ఫీచర్లు ఉంటాయి. ABS,  ట్రాక్షన్ కంట్రోల్,  రెజనరేటివ్ బ్రేకింగ్, మెటాలిక్ బ్లాక్, సిల్వర్, రెడ్ లాంటి వేరియంట్స్ అందుబాటులో ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది దేశంలో ప్రీమియం EV మార్కెట్‌ లో యమహా చేస్తున్న మొదటి ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. EC-06 అనే మరో మోడల్‌ తో పాటు లాంచ్ చేసింది. ఈ స్పెస్ ప్రకారం, ఇది అర్బన్ కమ్యూటింగ్, స్పోర్టీ రైడింగ్ కోసం సూటబుల్. ఇది ప్రీమియం స్కూటర్ కాబట్టి.. Ather 450X, TVS iQube లాంటి మోడల్స్‌ తో పోటీ పడుతుంది.

Advertisement

Read Also:  సుజుకి ఈ-యాక్సెస్ వచ్చేసింది, ఒక్క ఛార్జ్ తో ఎంత దూరం వెళ్తుందంటే..

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×