E-Paper
Advertisement

Siddu Jonnalagadda : ఫ్రీగా సినిమాలు చేస్తున్న జొన్నలగడ్డ… వామ్మో ఎంత మార్పు?

Siddu Jonnalagadda : ఫ్రీగా సినిమాలు చేస్తున్న జొన్నలగడ్డ… వామ్మో ఎంత మార్పు?
Advertisement

Siddu Jonnalagadda Movie : నటించడం ఒక్కటే కాదు.. స్క్రీన్ రైటర్, సింగర్, లిరిక్ రైటర్ అంటూ మల్టీ టాలెంటెడ్‌గా ఉన్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడా అంటే… అవును అనే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అది కూడా నాగ వంశీ సితారా ఎంటర్‌టైన్మెంట్స్‌లో అంట. మరి పూర్తి వివరాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

జోష్ సినిమాతో సైడ్ క్యారెక్టర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సిద్ధు జొన్నలగడ్డ.. చిన్న చిన్న సినిమాలు చేస్తూ గుంటూరు టాకిస్ సినిమాతో హీరో అయ్యాడు. తర్వాత డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో స్టార్ బాయ్ సిద్దు అయిపోయాడు. సిద్ధు కెరీర్‌లో ఈ డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలు తప్పా… మిగితావేవీ పెద్దగా ఆడలేదు. రీసెంట్‌గా వచ్చిన జాక్, తెలుసు కదా సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.

ఫ్రీగా సినిమాలు..

Advertisement

ఈ నేపథ్యంలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఫ్రీగా సినిమాలు చేస్తున్నాడు అని సమాచారం అందుతుంది. సిద్ధు ఇప్పుడు చేస్తున్న టిల్లు క్యూబ్ మూవీని ఫ్రీగా చేస్తున్నాడట. ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. దీనికి మ్యాడ్ ఫేం కళ్యాణ్ శంకర్ డైరెక్టర్‌గా ఉన్నాడు.

ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఒక హీరో కోట్ల రూపాయల తీసుకుంటున్న ఈ రోజుల్లో సిద్ధు ఫ్రీగా చేయడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే, సినిమా రిలీజ్ అయిన తర్వాత.. వచ్చిన కలెక్షన్స్, లాభాలను బట్టి.. ఎంతో కొంత తీసుకుంటాడని సమాచారం.

ఈ సినిమాల ఎఫెక్ట్ వల్లే..

Advertisement

స్టార్ బాయ్ సిద్ధు  జొన్నలగడ్డ ఇలా ఫ్రీగా సినిమాలు చేయడానికి కారణం.. ఆయన చివరి రెండు సినిమాలే అని చెప్పొచ్చు. సిద్ధు చేసిన లాస్ట్ టూ మూవీస్… జాక్ & తెలుసు కదా సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన జాక్ సినిమాకు దాదాపు 40 కోట్ల వరకు బడ్జెట్ అయింది. ఇక కలెక్షన్ల పరంగా చూస్తే 10 కోట్లు కూడా రాలేవు. ఫుల్ థియేట్రికల్ రన్ లో కేవలం 9.5 కోట్లు మాత్రమే కలెక్ట్ అయ్యాయి. అంటే నిర్మాణ ఖర్చుల పరంగా చూస్తే దాదాపు సినిమాకు 30 కోట్ల వరకు నష్టం వచ్చింది.

దీని తర్వాత సిద్ధు చేసిన మరో సినిమా తెలుసు కదా. నీరజ కోన డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దాదాపు 45 నుంచి 50 కోట్ల వరకు పెట్టి నిర్మించింది. కానీ, ఆ  సినమాకు వచ్చిన కలెక్షన్లు 11 కోట్లు మాత్రమే. అంటే ఈ సినిమా వల్ల కూడా నిర్మాతలకు దాదాపు 30 కోట్లకు పైగా నష్టాలు వచ్చాయి.

ఇలా.. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు దారుణంగా డిజాస్టర్ కావడంతో… తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధు ఫ్రగా సినిమాలు చేస్తున్నాడని తెలుస్తుంది.

Related News

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

Big Stories

Advertisement
×