E-Paper
Advertisement

యమహా ఫాసినో ధరలు పెంపు, కారణం ఏంటంటే?

యమహా ఫాసినో ధరలు పెంపు, కారణం ఏంటంటే?
Advertisement

Yamaha Fascino 125 Price Increased: యమహా తన క్రేజీ స్కూటర్ ఫాసినో 125 ధరలను పెంచింది. ఈ మేరకు కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. కొన్ని వేరియంట్లపై రూ.1,000 వరకు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా TFT డిస్‌ ప్లే ఉన్న ఫాసినో S వేరియంట్‌ తో పాటు డిస్క్ బ్రేక్ కలిగిన మోడళ్లపై ఈ ధరల పెంపు ఉంటుందని తెలిపింది. తాజా పెంపుతో టాప్ వేరియంట్ అయిన ఫాసినో S ధర ఇప్పుడు రూ.96,200కు చేరుకుంది. అలాగే డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.89,000గా ఉంది.

ధరల పెంపునకు కారణం ఏంటి?

కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, లాజిస్టిక్స్ ఖర్చులు, ముడి పదార్థాల ధరలు అధికం కావడం వల్ల ఈ ధరల పెంపు చేయాల్సి వచ్చనట్లు ప్రకటించింది. ఇటీవల ఆటోమొబైల్ రంగంలో చాలా కంపెనీలు ఇవే కారణాలతో తమ వాహనాల ధరలను పెంచాయి. యమహా కూడా అదే దారిలో నడుస్తూ కొన్ని మోడళ్ల ధరలను పెంచింది.

మూడు వేరియంట్లలో యమహా ఫాసినో

Advertisement

యమహా ఫాసినో ప్రస్తుతం మూడు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్‌ లో 125cc ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్‌ ను ఉపయోగిస్తున్నారు. దీనికి యమహా హైబ్రిడ్ సిస్టమ్‌ను కూడా జత చేశారు. ఈ సిస్టమ్ వల్ల స్కూటర్ మరింత స్మూత్‌గా నడవడంతో పాటు ఇంధనాన్ని ఆదా చేయడంలో సాయపడుతుంది. ఫాసినో లో స్మార్ట్ మోటార్ జనరేటర్ టెక్నాలజీని ఉపయోగించారు. దీని వల్ల స్కూటర్ స్టార్ట్ అయ్యే సమయంలో శబ్దం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే స్టాప్-స్టార్ట్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర స్కూటర్ ఆగినప్పుడు ఇంజన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయి, మళ్లీ యాక్సిలరేట్ చేస్తే వెంటనే స్టార్ట్ అవుతుంది. దీని వల్ల ఇంధన వినియోగం తగ్గుతుంది.

ఆకట్టుకునేలా ఫీచర్లు

ఫీచర్ల విషయానికి వస్తే, ఫాసినోలో బ్లూటూత్ కనెక్టివిటీ సదుపాయం ఉంది. యమహా వై-కనెక్ట్ యాప్ ద్వారా మొబైల్‌ ను స్కూటర్‌ తో కనెక్ట్ చేసుకోవచ్చు. టాప్ వేరియంట్లలో TFT డిస్‌ప్లే కూడా అందిస్తున్నారు. కాల్స్, మెసేజ్ అలర్ట్స్ వంటి సమాచారం ఈ డిస్‌ ప్లేలో కనిపిస్తుంది.

Advertisement

ఇక భద్రత కోసం సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్‌ ను కూడా ఇచ్చారు. అంటే సైడ్ స్టాండ్ తీసేయకుండా స్కూటర్ ముందుకు వెళ్లకుండా ఇది సహాయపడుతుంది. అలాగే కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. దీని వల్ల బ్రేకింగ్ సమయంలో వాహనం ముందుకు కదలదు. ఈ స్కూటర్‌ కు ఉన్న ప్రధాన ప్రత్యేకత దాని తక్కువ బరువు. సుమారు 99 కిలోల బరువుతో ఉండే ఫాసినోను ట్రాఫిక్‌ లో సులభంగా నడపవచ్చు. ముఖ్యంగా మహిళలు, కొత్తగా స్కూటర్ నేర్చుకునేవారికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. భారత మార్కెట్లో యమహా ఫాసినోకు హీరో డెస్టిని 125, సుజుకి యాక్సెస్ 125, వెస్పా ZX 125 లాంటి స్కూటర్లకు గట్టి పోటీ ఇస్తుంది.

Read Also: కళ్లు చెదిరే రేంజ్, క్రేజీ కలర్స్.. నయా ఐక్యూబ్ అదిరింది భయ్యా!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×