E-Paper
Advertisement

MLA పాడి కౌశిక్ రెడ్డి పై బీజేపీ చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: హరీశ్ రావు

MLA పాడి కౌశిక్ రెడ్డి పై బీజేపీ చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: హరీశ్ రావు
Advertisement

Harish Rao: కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై చేసిన తీవ్ర‌ విమర్శలు ఈ ఉద్రిక్తతకు దారితీశాయి. గురువారం మధ్యాహ్నం కరీంనగర్‌లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంలో కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా.. బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా కార్యాలయంపైకి దూసుకొచ్చారు. రాళ్లు.. కర్రలతో దాడి చేసి అక్కడే ఉన్న కౌశిక్ రెడ్డి కారు అద్దాలను.. కార్యాలయ కిటికీలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు.

“ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల కార్యాలయాలపైనే ముప్పేట దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడున్నాయి?” అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఏకంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి దాడులు జరగడం అత్యంత దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలు ఆపకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

Advertisement

అంతకుముందు జరిగిన ప్రెస్ మీట్‌లో కౌశిక్ రెడ్డి.. బండి సంజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బండి సంజయ్ మధ్య ఏదో లోపాయికారీ ఒప్పందం ఉందని.. రేవంత్ రెడ్డి ఎజెండానే సంజయ్ మోస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్‌లో భారీ దోపిడీ జరిగితే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సంజయ్ కనీసం రివ్యూ కూడా చేయలేకపోతున్నారని విమర్శించారు. ఒకప్పుడు తన భార్య పుస్తెలు అమ్మి ప్రచారం చేసుకున్నానని చెప్పిన సంజయ్.. కార్పొరేషన్ ఎన్నికల నాటికి ₹50 కోట్లు ఎలా ఖర్చు చేశారో సమాధానం చెప్పాలని నిలదీశారు. మోదీ వేవ్‌లో గెలిచినంత మాత్రాన గొప్ప నాయకుడివి కాదని.. దమ్ముంటే కరీంనగర్ అభివృద్ధిపై కేటీఆర్‌తో చర్చకు రావాలని సవాల్ విసిరారు.

వ్యక్తిగత విమర్శల విషయంలోనూ కౌశిక్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. బండి సంజయ్‌కు జుట్టు ఊడిపోవడానికి డ్రగ్స్.. తంబాకు తీసుకోవడమే కారణమని ఆరోపించారు. దమ్ముంటే కేటీఆర్ లాగే డ్రగ్స్ టెస్టుకు సిద్ధం కావాలని ‘గీతా భవన్ చౌరస్తా’ వేదికగా సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలతో ఆగ్రహించిన బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా దాడులకు తెగబడటంతో కరీంనగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Advertisement

Read Also: నువ్వు మొగోడివైతే చర్చకు రా.. బండి సంజయ్‌కి కౌశిక్ రెడ్డి బహిరంగ సవాల్

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×