E-Paper
Advertisement

Budget Gaming Phones: 2026 బడ్జెట్ గేమింగ్ ఫోన్స్.. పవర్‌ఫుల్ మొబైల్ గేమింగ్ కోసం బెస్ట్ ఇవే

Budget Gaming Phones: 2026 బడ్జెట్ గేమింగ్ ఫోన్స్.. పవర్‌ఫుల్ మొబైల్ గేమింగ్ కోసం బెస్ట్ ఇవే
Advertisement

Best Budget Gaming Phones 2026| మొబైల్ గేమింగ్ ఇప్పుడు సాధారణ ఎంటర్‌టైన్‌మెంట్ కాదు. చాలా మందికి ఇది సీరియస్ ఇది ఒక కాంపిటీటివ్ (పోటీతత్వం) ఎక్స్‌పీరియన్స్. BGMI, PUBG, Call of Duty Mobile, Genshin Impact లాంటి గేమ్‌లు పవర్‌ఫుల్ హార్డ్‌వేర్ కావాలి. అందరూ ఖరీదైన గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లేదా కన్సోల్స్ కొనలేరు. మంచి వార్త ఏమిటంటే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు అద్భుతమైన గేమింగ్ పెర్ఫామెన్స్ ఇస్తున్నాయి. ఈ ఫోన్స్ ఫాస్ట్ ప్రాసెసర్లతో, స్మూత్ డిస్‌ప్లే, ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇస్తాయి. ఇక్కడ 2026 బెస్ట్ గేమింగ్ ఫోన్లు ధరలు, కీ ఫీచర్లతో ఉన్నాయి.

రియల్‌మి P4x బెస్ట్ బడ్జెట్ గేమింగ్ ఫోన్

రియల్‌మి P4x తక్కువ బడ్జెట్‌లో బలమైన గేమింగ్ కావాలనుకునేవారికి పర్ఫెక్ట్. భారతదేశంలో ధర సుమారు రూ.15,999. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ ఉంది. ఇది లాంగ్ గేమింగ్ సెషన్లలో స్టేబుల్ ఫ్రేమ్ రేట్లు ఇస్తుంది. 6.72 ఇంచ్ IPS LCD డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంది. హై రిఫ్రెష్ రేట్ వల్ల గేమ్‌ప్లే స్మూత్, రెస్పాన్సివ్‌గా ఉంటుంది. 7000mAh భారీ బ్యాటరీ ఉంది. 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. తక్కువ ఖర్చుతో పవర్ కావాలనుకునే ప్లేయర్లకు రియల్‌మి P4x ఐడియల్.

వివో T4X లాంగ్ గేమింగ్ సెషన్లకు సులభం

Advertisement

వివో T4X అదే ప్రైస్ సెగ్మెంట్‌లో మరో బలమైన గేమింగ్ ఫోన్. ధర సుమారు రూ.14,999. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మల్టీటాస్కింగ్, హెవీ గేమ్‌లు సౌకర్యంగా హ్యాండిల్ చేస్తుంది. 6500mAh పెద్ద బ్యాటరీ ఉంది. తరచూ చార్జ్ చేయకుండా లాంగ్ గేమింగ్ సెషన్లు ఆనందించవచ్చు. Funtouch OS 15లో డెడికేటెడ్ గేమింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఇవి CPU, GPUని ఆటోమేటిక్‌గా ఆప్టిమైజ్ చేస్తాయి. క్యాజువల్, కాంపిటీటివ్ గేమర్లకు వివో T4X సరిపోతుంది.

ఓప్పో K13 5G AMOLED డిస్‌ప్లే గేమింగ్ బీస్ట్

ఓప్పో K13 5G పెర్ఫార్మెన్స్, ప్రీమియం విజువల్స్ కావాలనుకునేవారికి టార్గెట్. ధర సుమారు రూ.17,999 నుంచి మొదలు. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్ ఉంది. అడ్రెనో 810 GPU స్మూత్ గ్రాఫిక్స్ రెండరింగ్ ఇస్తుంది. 6.67 ఇంచ్ AMOLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంది. వైబ్రెంట్ కలర్లు, బెటర్ కాంట్రాస్ట్ ఇస్తుంది. 7000mAh బ్యాటరీ, 80W సూపర్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి. హై-క్వాలిటీ గేమింగ్ విజువల్స్ కోసం ఓప్పో K13 5G అద్భుతం.

మోటోరోలా ఎడ్జ్ 50 బ్యాలెన్స్‌డ్ గేమింగ్, ప్రీమియం డిజైన్

Advertisement

మోటోరోలా ఎడ్జ్ 50 మిడ్-రేంజ్ ప్రీమియం గేమింగ్ ఫోన్. ధర సుమారు రూ.24,999. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 AE ప్రాసెసర్ ఉంది. మోడరన్ మల్టీప్లేయర్ గేమ్‌లలో స్టేబుల్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. 6.7 ఇంచ్ P-OLED డిస్‌ప్లే డీప్ కలర్లు, స్మూత్ అనిమేషన్లు ఇస్తుంది. 5000mAh బ్యాటరీ 68W ఫాస్ట్ చార్జింగ్‌తో ఉంది. పెర్ఫార్మెన్స్, కెమెరా క్వాలిటీ, డిజైన్ బ్యాలెన్స్ చేస్తుంది. స్టైల్‌తో గేమింగ్ కావాలనుకునేవారికి మోటోరోలా ఎడ్జ్ 50 సరిపోతుంది.

రెడ్‌మి నోట్ 14 5G గేమింగ్‌తో హై-ఎండ్ కెమెరా

రెడ్‌మి నోట్ 14 5G గేమింగ్, ఫోటోగ్రఫీ ఇష్టపడేవారికి పర్ఫెక్ట్. ధర సుమారు రూ.18,499. డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్ ఉంది. డిమాండింగ్ గేమ్‌లు లాగ్ లేకుండా హ్యాండిల్ చేస్తుంది. 120Hz AMOLED డిస్‌ప్లే 2100 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఉంది. సూర్యకాంతిలో కూడా కనిపిస్తుంది. 5110mAh బ్యాటరీ, 108MP మెయిన్ కెమెరా ఉన్నాయి. రెడ్‌మి నోట్ 14 5G ట్రూ ఆల్-రౌండర్ డివైస్.

Also Read: మార్కెట్లో నకిలీ 4k స్మార్ట్‌టీవీలు.. మోసపోతున్న కస్టమర్లు.. ఎలా గుర్తించాలంటే

గేమింగ్ ఫోన్ ఏది ఎంచుకోవాలి?

రూ.16,000 కంటే తక్కువ బడ్జెట్‌కు రియల్‌మి P4x బెస్ట్. ఎక్కువ బ్యాటరీ కావాలంటే వివో T4X మంచిది. AMOLED డిస్‌ప్లే ఇష్టమైతే ఓప్పో K13 5G. ప్రీమియం డిజైన్‌తో గేమింగ్ కావాలంటే మోటోరోలా ఎడ్జ్ 50. గేమింగ్, ఫోటోగ్రఫీ కలిపి కావాలంటే రెడ్‌మి నోట్ 14 5G. 2026లో బడ్జెట్ గేమింగ్ ఫోన్లు అద్భుత పెర్ఫామెన్స్ ఇస్తాయి. తక్కువ డబ్బు ఖర్చు చేసి హై-క్వాలిటీ గేమింగ్ ఆనందించవచ్చు.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×