E-Paper
Advertisement

BRS : పద్మవ్యూహంలో బీఆర్ఎస్..!

BRS : పద్మవ్యూహంలో బీఆర్ఎస్..!
Advertisement

మహాభారత యుద్ధంలో పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా మారింది బీఆర్ఎస్ పరిస్థితి.. లోపలికి వెళ్లడమే కానీ బయటకు రావడం అనేది పద్మవ్యూహంలో ఉండదు. అందులో నుంచి బయటపడాలంటే అంత ఈజీకాదు. ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు ప్రస్తావించామంటే బీఆర్ఎస్ పార్టీ సైతం వరుసగా కేసుల్లో చిక్కుకున్నది. ఒకటి కాకపోతే మరో కేసు ఆ పార్టీ నేతలను వెంటాడుతూనే ఉన్నది. చోటామోట లీడర్లు అంటే ఏం కాదు. కానీ ఏకంగా మాజీ సీఎం, ఉద్యమనేత కేసీఆర్.. పార్టీలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న కేటీఆర్, కేటీఆర్‌లను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఇప్పటికే కేటీఆర్, హరీశ్ రావులను విచారించారు.

కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్ రేసు..

ప్రస్తుతం రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ నడుస్తున్నది.బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతలు, సొంత పార్టీ నేతలు, సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్ల, పెద్దల ఫోన్లు ట్యాప్ చేశారని గులాబీ పార్టీపై ఉన్న ప్రధాన ఆరోపణ.. ఆనాడు ఎస్ఐబీ చీఫ్‌గా ప్రభాకర్ రావు వ్యవహరించారు. ఆయన కింద ఒక టీమ్ ఉండేది. వారు రాష్ట్రంలో పలు చోట్ల వార్ రూమ్స్ ఏర్పాటు చేసి కీలక నేతల ఫోన్లు ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని గులాబీ పార్టీలోనే ఓ పెద్దకు అందించారని తెలిసింది. కానీ, ఆ పెద్దాయన ఎవరో సిట్ అధికారులు ఇంతవరకూ తేల్చలేదు. ప్రభాకర్ రావు వాంగ్మూలంలో అంతా పెద్దాయనకు తెలుసు అని స్టేట్మెంట్ ఇచ్చారని సిట్ పేర్కొంది.

Advertisement

 

ఈ క్రమంలోనే ముందుగా ఎస్ఐబీ మాజీ అధికారులను విచారించిన సిట్ బృందం.. ఆ తర్వాత గులాబీ పార్టీలో నెంబర్ 3 స్థానంలో ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావును విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసింది. అనంతరం పార్టీలో నంబర్ -2 అయిన కేటీఆర్‌ను విచారించి వాంగ్మూలం రికార్డుచేసింది. ఆ తర్వాత మాజీ ఎంపీ సంతోష్ రావును సైతం విచారించి స్టేట్మెంట్ నమోదు చేసింది. ఆ తర్వాత కవితను సిట్ పిలుస్తుందని అంతా భావించగా.. ఏకంగా గులాబీ బాస్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని.. కాళేశ్వరం కూలడానికి బాధ్యుడు కేసీఆర్ అని కమిషన్ నివేదిక ఆధారంగా ఆయన్ను విచారించాలని ప్రభుత్వం భావించగా.. ఆయన సుప్రీంకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. హరీశ్ రావును సిట్ అధికారులు కాళేశ్వరం విషయంలో విచారించారు.

Advertisement

pawan kalyan : పవన్‌కు కోపం వచ్చింది..!

మున్నిపల్ ఎన్నికలపై ప్రభావం..

ఇక ఫార్ములా ఈ కారు రేసు విషయంలో కేటీఆర్‌ను ఇప్పటికే సిట్ విచారించింది.మరోసారి పిలిస్తే విచారణకు రావాలని ఆదేశించింది. ఇక రేపు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో ఆయన్ను విచారిస్తామని సిట్ నిన్న రాత్రి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది.వరుసగా ఒకదాని తర్వాత మరో కేసులో సిట్ నోటీసులు ఇవ్వడం, విచారించడం జరుగుతోందని.. కానీ, నిందితులు ఎవరో ఇంతవరకూ తేల్చలేకపోయారని సామాన్యులు, ఇతర పార్టీల నేతలు సైతం దర్యాప్తు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేసీఆర్‌ను విచారించి ఆయన్ను నిందితుడిగా సిట్ అధికారులు ప్రకటిస్తే రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.కాగా, ఎన్నికలు వచ్చినప్పుడల్లా పార్టీని దెబ్బతీయడానికి అధికార కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.

 

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×