E-Paper
Advertisement

Yamaha R15 V4 vs Yamaha R15S: యమహా R15 vs యమహా R15S.. రెండింటిలో తేడాలు ఇవే!

Yamaha R15 V4 vs Yamaha R15S: యమహా R15 vs యమహా R15S.. రెండింటిలో తేడాలు ఇవే!
Advertisement

Yamaha R15 V4 vs Yamaha R15S Comparison: యమహా ఎక్కువగా యువతను టార్గెట్ చేసుకుని అదిరిపోయే బైక్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగా వచ్చిందే యమహా R15S. ఈ బైక్ గతంలో విడుదల అయిన యమహా R15కి అప్ డేటెడ్ వెర్షన్ లో విడుదల అయ్యింది. యమహా R15S అదే పవర్ తో, మెరుగైన అప్ డేట్స్ అందుబాటులోకి వచ్చింది. R15 మంచి లుక్, TFT డాష్, ట్రాక్షన్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్ ను కలిగి ఉండేది. అధునాతన ఫీచర్లతో ఎక్కువ ధరను కలిగి ఉండేది. R15S మరింత సౌకర్యవంతమైన సెటప్ కంటే కొంచెం ఎక్కువ రైడింగ్ అనుకూలతను కలిగి ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీగా అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఈ రెండు బైక్స్ మధ్య తేడాలు ఏంటి? ఎవరికి ఏది అనుకూలంగా ఉంటుందంటే..

యమహా R15 vs యమహా R15S తేడాలు

⦿ ధర: R15 ధర సుమారు రూ. 1.67 లక్షల నుంచి రూ. 1.92 లక్షలు ఉంటుంది. అటు R15S రూ. 1.51 లక్షల నుంచి రూ.1.54 లక్షల వరకు ఉంటుంది. రెండింటిని పోల్చినప్పుడు R15S ధర తక్కువగా ఉంటుంది.

Advertisement

⦿ ఫీచర్లు: R15 V4 లో TFT, TCS, క్విక్‌ షిఫ్టర్ ఉన్నాయి. R15S లో బేసిక్ LCD ఉంది, TCS, క్విక్‌ షిఫ్టర్ లేదు. అయితే, R15S సాధారణంగా సౌకర్యవంతంగా ఉంటుంది.  ముఖ్యంగా సిటీ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది.

⦿ ఇంజిన్: R15, R15S  155cc, లిక్విడ్ కూల్డ్, 4-స్ట్రోక్, SOHC, 4 వాల్వ్ ఇంజిన్‌ను కలిగి ఉంటాయి. కానీ, ఫీచర్లు, పనితీరు ట్యూనింగ్‌లో భిన్నంగా ఉంటాయి. రెండూ 18.4 PS పవర్, 14.2 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తాయి. వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌ తో 6 స్పీడ్ గేర్‌ బాక్స్‌ ను లింక్ చేసి ఉంటాయి.  కోర్ ఇంజిన్, పవర్ ఒకేలా ఉన్నా, కానీ V4 అదనపు సాంకేతికతను కలిగి ఉంటుంది.

అనుకూలతలు, ప్రతికూలతలు

Advertisement

యమహా R15S  తక్కువ ధర, మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. మంచి పవర్, స్లిప్పర్ క్లచ్, VVA లను కలిగి ఉంది. పాత డిజైన్, ప్రైవరీ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి లేటెస్ట్ ఫీచర్లు లేవు.

యమహా R15 V4  అగ్రెసివ్ స్టైలింగ్, TFT డిస్ ప్లే, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, క్విక్‌ షిఫ్టర్, USD ఫోర్కులు, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటాయి. ఎక్కువ ధర, ఇరుకైన హెడ్‌ లైట్ బీమ్‌ మైనస్ గా చెప్పుకోవచ్చు.

ఎవరికి ఏది బెస్ట్ అంటే?  

బడ్జెట్ ఫ్రెండ్లీ కొనుగోలుదారులు, రోజువారీ ఉపయోగం కోసం సౌకర్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారు, అధునాతన ఎలక్ట్రానిక్స్ కోసం డబ్బు చెల్లించకుండా గొప్ప పనితీరును కోరుకునే రైడర్లకు R15S అనుకూలంగా ఉంటుంది. అటు లేటెస్ట్ టెక్నాలజీని ఇష్టపడే వాళ్లు, ట్రాక్ డే రైడర్లు, స్టైలింగ్, ఫీచర్లను కోరుకునే వారు, ప్రీమియం బైక్ కొనుగోలు చేయాలనుకునే వాళ్లు ఆర్15ని సెలెక్ట్ చేసుకోవచ్చు.

Read Also: హీరో డెస్టినీ ప్రైమ్ vs సుజుకి యాక్సెస్ 125.. ఏది బెస్ట్ అంటే?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×