Love And Death: వారిద్దరు ప్రేమించుకున్నారు.. ఇద్దరు మనసులు కలిశాయి. పెద్దవాళ్లని ఒప్పించి ఒకటి కావాలని డిసైడ్ అయ్యారు. కాస్త తొందరపడ్డారు.. ఫలితంగా యువతి గర్భవతి అయ్యింది. ఈ విషయం తెలిసి ప్రియుడి షాకయ్యాడు. యువతికి అబార్షన్ చేయిస్తున్న క్రమంలో ప్రియురాలి ఈ లోకాన్ని విడిచిపెట్టింది. ఈ ఘటన నుంచి తప్పించుకునేందుకు ప్రియుడు కొత్త స్టోరీ క్రియేట్ చేశాడు, అడ్డంగా బుక్కయ్యాడు.
తాండూరు ఊహించని ఘటన
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూరు ఊహించని ఘటనకు వేదికైంది. తాండూరు మండల కేంద్రం ఐబీకి చెందిన ఓ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. ఓ కూతురు హైదరాబాద్‌లోని ఓ గురుకులంలో ఏఎన్‌ఎంగా పని చేస్తోంది. ఇక అబ్బాయి వెర్షన్‌కి వద్దాం. ఆ ప్రాంతానికి చెందిన జగదీష్ డిగ్రీ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లో కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.
ఒకే ఊరివారు కావడంతో యువతి-యువకుడి మనసులు కలిశాయి. ఇద్దరు ప్రేమించుకున్నారు, రేపోమాపో వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు ఆ తర్వాత శారీరకంగా యువతికి దగ్గరయ్యాడు. యువతి గర్భం దాల్చడంతో షాకయ్యాడు. ఏం చెయ్యాలో తెలియక టెన్షన్ పడ్డాడు. చివరకు ఓ నిర్ణయం తీసుకున్నాడు.
ప్రియురాలికి దగ్గరైన ప్రియుడు
ప్రియురాలికి అబార్షన్ చేయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయంలో యువతిని కన్వీన్స్ చేశాడు. తొలుత ప్రియురాలికి వైద్య పరీక్షలు చేయించాడు. రక్తం తక్కువగా ఉందని తేలింది. ఇలాంటి సమయంలో అబార్షన్ కష్టమని హైదరాబాద్‌లో స్థానిక ఆసుపత్రులు చెప్పాయట. దీంతో ఈ వ్యవహారం హైదరాబాద్ నుంచి కర్నూలుకు షిఫ్ట్ అయ్యింది.
తనకు తెలిసిన ఆసుపత్రి ఉందని చెప్పి యువతిని కర్నూలు తీసుకెళ్లాడు. రక్తం ఎక్కించి ట్రీట్‌మెంట్ చేయిస్తుండగా పరిస్థితి విషమించింది. బుధవారం రాత్రి ప్రియురాలు మృతి చెందింది. ప్రియురాలు మృతి విషయం తెలిస్తే ఏం జరుగుతోందనని భయపడ్డాడు. దీంతో అసలు విషయం తెలియకుండా జగదీష్ కట్టుకథ అల్లాడు.
ALSO READ: కొడుకు ఆత్మహత్య..తెలుసుకుని తండ్రి షాక్
యువతి అన్నకు ఫోన్ చేసి తాను-మీ సిస్టర్ కలిసి స్నేహితురాలి వద్దకు వెళ్తుండగా అనారోగ్యానికి గురైందని తెలిపాడు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తుండగా అదే రోజు రాత్రి మృతి చెందినట్టు చెప్పాడు. జగదీష్ మాటలకు అనుమానం వచ్చిన బాధిత కుటుంబసభ్యులు తాండూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికి మృతదేహాన్ని కర్నూలు నుంచి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాడు.
పోలీసులు వచ్చేసరికి జగదీష్ అక్కడే ఉండడంతో అతడ్ని విచారించారు. పైన జరిగిన విషయాన్ని చెప్పి నిజం ఒప్పుకున్నాడు. పోస్టుమార్టం నిర్వహించిన యువతి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.