E-Paper
Advertisement

Yamaha TMAX 560: యమహా Tmax 560 సూపర్ స్కూటర్, దీని స్పీడ్ ఎంతో తెలుసా భయ్యా!

Yamaha TMAX 560: యమహా Tmax 560 సూపర్ స్కూటర్, దీని స్పీడ్ ఎంతో తెలుసా భయ్యా!
Advertisement

Yamaha TMAX 560 Super Scooty: యమహా నుంచి సూపర్ బైక్స్ మాత్రమే కాదు, సూపర్ స్కూటీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. కళ్లు చెదిరే లుక్, ఆకట్టుకునే ఫీచర్లతో అలరిస్తున్నాయి. యమహా నుంచి వచ్చిన క్రేజీ స్కూటర్లలో ఒకటి Tmax 560. ఈ స్కూటర్ శక్తివంతమైన 562cc, 2-సిలిండర్ ఇంజిన్, ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ ను కలిగి ఉంటుంది. ఈ ప్రీమియం మ్యాక్సీ స్కూటర్ 47 HP పవర్ ను కలిగి ఉంటుంది. 0 నుంచి 60 మైళ్ల వేగాన్ని జస్ట్ 8 సెకన్లలోపు అందుకుంటుంది. 120 కిలో మీటర్ల గరిష్ట వేగంతో వెళ్తుంది.  అధునాతన LED లైటింగ్, 7-అంగుళాల TFT డిస్‌ ప్లే, క్రూయిజ్ కంట్రోల్, హీటెడ్ సీట్ లాంటి క్రేజీ ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే యమహ Tmax 560  స్పోర్ట్‌ బైక్ పనితీరును, కమ్యూటర్ సౌకర్యంతో మిక్స్ చేస్తుంది. మరింత చురుకుదనంతో ఆకట్టుకుంటుంది. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, గార్మిన్ నావిగేషన్ లాంటి అధునాతన ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. ఈ స్కూటర్ కు సంబంధించిన ఫీచర్లు ఎలా ఉన్నాయి? స్పెసిఫికేషన్లు ఉంటి? ధర ఎంత ఉంది? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

⦿ ఫీచర్లు: Tmax 560 స్కూటర్ 7 అంగుళాల TFT స్క్రీన్, స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ, క్రూయిజ్ కంట్రోల్, హీటెడ్ సీట్లు,  హ్యాండిల్‌ బార్ గ్రిప్స్ ను కలిగి ఉంటుంది.

⦿ ఇంజిన్: Tmax 560 సూపర్ స్కూటర్ 562cc, లిక్విడ్ కూల్డ్, 4 స్ట్రోక్, ప్యారలల్ ట్విన్ సిలిండర్ తో వస్తుంది. 55.7 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Advertisement

⦿ పనితీరు:  ఈ స్కూటర్ 47 HP సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. యూరో 5+ కి అనుగుణంగా తయారు చేయబడింది.

⦿ డిజైన్: తేలికైన అల్యూమినియం ఛాసిస్, 15 అంగుళాల వీల్స్, LED లైటింగ్ ను కలిగి ఉంది.

⦿ టెక్ మాక్స్ వెర్షన్ ఫీచర్లు: హీటెడ్ సీట్, గ్రిప్‌ లు, ఎలక్ట్రానిక్‌ గా సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉన్న స్క్రీన్ ఉంటుంది.

⦿ భద్రత: ఇక Tmax 560 స్కూటర్ భద్రత విషయానికి వస్తే ట్రాక్షన్ కంట్రోల్, ABS, కీ లెస్ ఇగ్నిషన్ ఉంటుంది.

⦿ బరువు: ఈ స్కూటర్ బరువు సుమారు సుమారు 220 కేజీలు ఉంటుంది.

Read Also: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ బైక్, త్వరలో దేశీ మార్కెట్ లోకి ఎంట్రీ!

ఇండియాలో ఈ సూపర్ స్కూటర్ లభిస్తుందా?

ఇక Tmax 560 సూపర్ స్కూటర్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంది. టాప్ స్పోర్ట్స్ స్కూటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.  ప్రస్తుతం ఈ స్కూటర్ భారత్ లో ఇంకా అధికారికంగా ప్రారంభించలేదు. అందుబాటులోకి వస్తే, ఇది ప్రీమియం స్కూటర్ విభాగంలో ఉంటుంది. ఈ స్కూటర్ ముఖ్యంగా సౌకర్యవంతమైన లాంగ్ రైడ్స్, సిటీ కమ్యూటింగ్ కోసం రూపొందించబడింది.  ఇది ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ తో స్పోర్ట్స్ బైక్ అనుభూతిని అందిస్తుంది.

Read Also:  బైక్ రైడర్లకు సమ్మర్ టిప్స్… హెల్మెట్‌ ఇలా పెట్టుకుని వెళ్తే కూల్‌ గా ఉంటారు!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×