E-Paper
Advertisement

Viral Video: ఒకే ఒక్క నిమిషంలో చక్క బెట్టేశారు, ఎంతో తెలుసా? షాకింగ్ ఫుటేజ్

Viral Video: ఒకే ఒక్క నిమిషంలో చక్క బెట్టేశారు, ఎంతో తెలుసా? షాకింగ్ ఫుటేజ్
Advertisement

Viral Video: క్రైమ్ అదే.. కాకపోతే దాని రూపం మార్చుకుంది. స్టార్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ చెప్పే డైలాగ్ ఇది. వర్మ చెప్పిన మాటలు అక్షరాలా నిజం. అలాంటి ఘటన ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. కేవలం ఒక్క నిమిషంలో బంగారం షాపుని దోచేశారు దోపిడీ దొంగలు. దీనికి సంబంధించిన వీడియోలో వైరల్ అవుతోంది.

ఉత్తర కాలిఫోర్నియాలో భారీ దోపిడీ..  కేవల ఒక్క నిమిషంలో చోరీ

Advertisement

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో ఊహించని దోపిడీ జరిగింది. ఖరీదైన ఫ్రీమాంట్‌లోని బంగారం షాపులో దోపిడీ దొంగలు పడ్డారు. కేవలం ఒక నిమిషంలో అంతా గుల్ల చేశారు. దొంగలించిన బంగారం 1.7 మిలియన్లు. అది ఇండియన్ కరెన్సీలో దాదాపు 16 కోట్ల రూపాయలు. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 10 నుంచి 20 మంది గ్యాంగ్ అది.

యూఎస్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన షాకింగ్ నిఘా ఫుటేజ్ ఇది. వీడియోలో బంగారం షాపు ముందు మూడు కార్లలో దాదాపు 20 మంది దోపిడీ దొంగలు దిగారు. అందరూ ఒకటే డ్రెస్ ధరించి, ముఖానికి నల్లటి మాస్క్‌లు ధరించారు. మూడు కార్లు ఆపి తమతో తెచ్చుకున్న మరణాయుధాలతో బంగారం షాపులోకి ప్రవేశించాడు.

Advertisement

20 మంది గ్యాంగ్.. పట్టపగలు షాపుని దోపిడీ చేశారు

బంగారం ధరలు ఆకాశాన్ని తాకడంతో షాపు ఓనర్లు వాటిని లాకర్లలో పెడుతున్నారు. ఇక్కడా షాపు ఓనర్ అదే చేశాడు. కాకపోతే దొంగలు సుత్తితోపాటు ఇంకా పదునైన ఆయుధాలను ఉపయోగించి అద్దాలను పగలగొట్టి మరీ బంగారాన్ని దోచేశారు. ఈ తతంగమంతా కేవలం ఒక్క నిమిషంలో జరిగింది. షాపులోని దాదాపు 75 శాతం వరకు పసిడి ఆభరణాలను దొంగిలించారు.

దాదాపు 70 సెకన్లపాటు ఈ దాడి కొనసాగింది. దాదాపు 2 మిలియన్ల డాలర్ల విలువైన బంగారు ఆభరణాలు పట్టుకుని తాము వచ్చిన వాహనాల్లో పారిపోయారు. రోడ్లపైకి వెళ్లిన తర్వాత మూడు వాహనాలు వేర్వేరుగా విడిపోయాడు. ఆ కార్ల నెంబర్ ప్లేట్ ఆధారంగా పట్టుకునే ప్రయత్నం చేశారు. నలుగురు అనుమానితులను అరెస్టు చేశారు.

ALSO READ: వ్యూస్ కోసం వెర్రి వేషాలు.. స్కూటీ డిక్కీలో పసిపాప, ఈ కిలాడీ లేడీ చేసిన పని చూస్తే…?

ఈ దోపిడీలో పాల్గొన్న మిగతా దుండగులు ఇంకా పరారీలో ఉన్నారు. దోపిడీకి పాల్పడిన వారు దాదాపు 19 ఏళ్ల నుంచి 20 సంవత్సరాల వయస్సు గలవారని తెలుస్తోంది.  ఈ ఘటన గతేడాది జూన్ 18న భారత వ్యాపారి నిర్వహిస్తున్న కుమార్ జ్యువెలర్స్ షోరూమ్‌లో చోటుచేసుకుంది. ఇంత వేగంగా దోపిడీ చేయడం ఎక్కడ చూడలేదని అంటున్నారు.

ఒకప్పుడు ఇంటికి దొంగతనం వేయాలంటే అర్ధరాత్రి వేళ 12 నుంచి 2 గంటల దోపిడీకి పాల్పడేవారు దొంగలు.  ఇప్పుడు పట్ట పగలు క్షణాల్లో షాపులను దోచేస్తున్నారు. నిఘా కెమెరాలు ఉన్నా వాటికి  ఏమాత్రం  ఆనవాళ్లు చిక్కకుండా రంగంలోకి దిగి దోపిడీలు చేస్తున్నారు.

 

 

 

 

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×