E-Paper
Advertisement

CM Revanth Reddy: మూసీపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం.. సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

CM Revanth Reddy: మూసీపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం.. సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

CM Revanth Reddy: కడుపులో కుళ్లు..మాటల్లో విషం..చూపుల్లో పగ” తో బీఆర్ ఎస్, బీజేపీ నేతలు మూసీ పై దుష్​ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో తాజ్ కృష్ణ హోటల్ లో మూసీ పునరుజ్జీవంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. దాదాపు రెండు గంటల పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నర్సింహారెడ్డి పవర్ ప్రజెంటేషన్ చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…మూసీపై విష ప్రచారం చేసేందుకు రాజకీయ పార్టీలు తాపత్రయం పడుతున్నాయన్నారు. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ ఎస్ లు కలిసి కుట్ర చేస్తున్నాయన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసేందుకు సోషల్ మీడియాలకు ఏకంగా రూ. 5 కోట్లు ఖర్చు చేస్తున్నారని వెల్లడించారు. కొందరు అర్థరహిత సమాచారంతో తప్పుడు ప్రచారం చేస్తుండగా, మరి కొందరు ఉద్దేశ పూర్వకంగానే అసత్యాలను ప్రచారం చేస్తున్నారన్నారు.

డెవలప్ ఎలా చేయాలో?

కానీ ముఖ్యమంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా తనకు మూసీ పునరుజ్జీవంపై స్పష్టమైన క్లారిటీ ఉన్నదని, డెవలప్ ఎలా చేయాలో? తనకు తెలుసునని సీఎం వివరించారు. తాను అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లో అధిపత్యం కోసం చెలాయించనని, పర్యావరణాన్ని రక్​షిస్తూ, తద్వారా ప్రజలకు మంచి చేయాలనదే తన లక్ష్యం అంటూ సీఎం వివరించారు. నదీ పరివాహక ప్రాంతాల్లోనే నాగరీకత వెలిసిందని, ఆర్ధిక అభివృద్ధికీ ఉపయోగపడిందని సీఎం వెల్లడించారు. తాను థేమ్ రివర్, సింగపూర్, దుబాయ్, అహ్మదాబాద్ తో పాటు సబర్మతి రివర్ ను కూడా పరిశీలించానని, వాటి నుంచి అర్థం చేసుకొని, నేర్చుకొని మూసీ డెవలప్ కు ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తాము వేగంగా ముందుకు సాగుతుంటే, కొన్ని దృష్టశక్తులు అభివృద్ధి నిరోధకాలుగా మారాయన్నారు. వారిని భవిష్యత్ తరాలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోవని తేల్చి చెప్పారు.

హైదరాబాద్ కు ప్రత్యేకమైన హిస్టరీ

మూసీ రివర్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ను బాధ్యతాయుతంగా చేస్తున్నామని, 27 నెలల పాటు వందలు, వేల గంటలు శ్రమించి అందరితోనూ డిస్కషన్ చేసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. గత సీఎం లు చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిలు సైబరాబాద్ ను నిర్మిస్తే, తాము ఫోర్త్‌ సిటీని నిర్మిస్తూనే, పాత బస్తీని అద్భుతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. వారసత్వ సంపదను కాపాడుతూనే, గొప్ప నగరానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. హైదరాబాద్ కు ప్రత్యేకమైన హిస్టరీ ఉన్నదని, నిజాం ప్రభువు ఎన్నో సృష్టించారన్నారు. కానీ వరదలు వచ్చిన తర్వాత ఆయన కూడా రిలైజ్ అయి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య సారథ్యంలో మూసీ నదిని అప్పటి పరిస్​థితులకు అనుగుణంగా నిర్మించారన్నారు. దీంతో గతంలో నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లు ఇప్పటికీ ఉపయోగంలో ఉన్నాయన్నారు.

Also Read: Hyderabad Crime: మార్కెట్లో నకిలీ డ్రై ఫ్రూట్స్.. గోడౌన్‌లో స్టోరేజ్, ఆపై పోలీసుల మెరుపుదాడులు

నల్లగొండ ప్రజల గొస చూడండి

వికారాబాద్ లో మొదలైన మూసీ రంగారెడ్డి జిల్లాలో ఎంట్రీ ఇస్తూ కలుషితంగా మారిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇక్కడ శిథిలాలు, వ్యర్థాలు, కంపెనీల రసాయనాలు, కళేభారాలు కలిసి మూసీ నది విషంగా మారింది. ఈ నీళ్లన్నీ నల్లగొండ ప్రజలకు శాపంగా మారాయన్నారు. గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నల్లగొండ జిల్లా జీవనానికి యోగ్యంగా లేదని రిపోర్టు ఇచ్చినట్లు సీఎం వివరించారు. అక్కడ పండిన పంటలు విషతుల్యంగా మారి శరీరాలను జీవశ్చవంలా మార్చేశాయన్నారు. పుట్టబోయే బిడ్డలపై కూడా మూసీ శాపం తగులుతుందన్నారు. ఇప్పటికీ ప్రెగ్రెన్సీల్లోనూ ప్రమాదకరాలు బయట పడుతున్నాయన్నారు. ఈ పరిస్థితులన్నీ మారాల్సిన అవసరం ఉన్నదని సీఎం వెల్లడించారు. చరిత్రను రాజకీయ అవసరాలకు కాలగర్భంలో కలిపేసే ప్రయత్నం చేయొద్దన్నారు.

గతంలో జూబ్లీహిల్స్, బంజారహిల్స్ లాంటి రోడ్లు కేవలం 30 ఫీట్లు ఉండేవని, క్రమక్రమానా అవి 150 ఫీట్లకు విస్తరించాయన్నారు. పాతబస్తీలోనూ రోడ్లు ఇరుకున్న ఉన్నాయని, వాటిని డెవలప్ చేసేందుకు ముందుకు సాగుతున్నామన్నారు. మెట్రో విస్తరణ కూడా జరుగుతుందన్నారు. ఎయిర్ పోర్టు, ప్లైఓవర్లు కట్టినప్పుడు కూడా ప్రజలకు కొంత నష్టం జరుగుతుందని, కానీ ప్రభుత్వం వాళ్లకు నష్ట పరిహారం ఇస్తూనే ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్తుందన్నారు. ఇప్పుడు కూడా మూసీ బాధితులకు అన్ని విధాలుగా ప్రభుత్వం రక్షణగా ఉంటుందన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో దాదాపు 10 వేల పేద కుటుంబాలు ఉన్నాయని, వాందరికీ ప్రభుత్వం ఆయా నియోజకవర్గాల్లోని ప్రభుత్వ స్థలాల్లోనే ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. పేదలను ఇబ్బంది పెట్టాలనే కోరిక తమ ప్రభుత్వానికి లేదన్నారు. చదువుకున్న మేథావులు, ప్రజలు, ఇవన్నీ ఆలోచించాలన్నారు. కేంద్రం తెచ్చిన చట్టాలను తాము అమలు చేస్తున్నామని, ఇందులో తమ జోక్యం ఏమీ లేదన్నారు.

బీజేపీ, బీఆర్ ఎస్ నేతలు అక్కడ ఉండాలి

మూసీ డెవలప్ ను అడ్డుకుంటున్న బీజేపీ, బీఆర్ ఎస్ నేతలు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించాలని, కావాలంటే ప్రభుత్వమే కంటైనర్లు ఇస్తుందన్నారు. అప్పుడు కానీ అక్కడి ప్రజల జీవన విధానం, ఇబ్బందులు ఆ రెండు పార్టీలకు అర్థం కావాని సీఎం చెప్పారు. ఏఐ టెక్నాలజీ విస్తరిస్తున్న తరుణంలో ఇంకా మూసీ లోనే పేద ప్రజలు బ్రతకాలా? అంటూ సీఎం ఫైర్ అయ్యారు. ఆయా కుటుంబాలకు రక్షణగా నిలిచి ఉపాధి, ఆసరా కల్పించడమే ప్రభుత్వం టార్గెట్ అని చెప్పారు. తాను మంచి పనిచేసి మరో సారి సీఎం కావాలనే కోరిక ఉన్నదన్నారు. పేదలను ఇబ్బంది పెట్టడం వలన తనకెలాంటి లాభం లేదన్నారు. మెజార్టీ ప్రజల ఆలోచనల మేరకే ముందుకు సాగుతామని, మూసీ డెవలప్ వద్దని తీర్మానం చేస్తే, ప్రాజెక్టు నిలిపివేసేందుకు కూడా సిద్ధమేనని సీఎం నొక్కి చెప్పారు.

మూసీ డెవలప్ కు 100 ఎకరాలు భూములు

దేశ సరిహద్దులో యుద్దం చేసే ఆర్మీ వాళ్లు కూడా మూసీ డెవలప్ కు 100 ఎకరాలు భూములు వదులుకున్నారని, నష్టపరిహారం గా ఇతర ప్రాంతాల్లో ల్యాండ్ లు కేటాయించామన్నారు. నీళ్ల వద్దకు ప్రజలు వెళ్లడం వలనే, నీళ్లు ఇళ్లల్లోకి చేరుతున్నాయన్నారు. నీళ్ల కు దారి వదిస్తేనే, మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఇక గాంధీ విగ్రహానికి కేవలం రూ. 75 కోట్లు మాత్రమే ఖర్చు పెడుతున్నామని, గాంధీసరోవర్ ప్రాజెక్టు మొత్తం కలిపి రూ. 5 వేల కోట్ల అంచనా వేశామన్నారు. కానీ ప్రతిపక్షాలు పిచ్చి ప్రచారం చేస్తున్నాయన్నారు. శాంతియుతంగా యుద్ధం ఎలా చేయాలో? నేర్పిన నేత గాంధీ అని అందుకే ప్రభుత్వం ప్రాధాన్యత గా తీసుకున్నదన్నారు.

రెండు కోట్ల 80 లక్షలకు చేరే ఛాన్స్

మూసీ రివర్ డెవలప్ అయితే హైదరాబాద్ లో గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుందన్నారు. ప్రస్తుతం ఏకంగా 1700 మీటర్లలో బోర్లు పడే సిచ్వేషన్ ఉన్నదని సీఎం వెల్లడించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ పై సలహాలు, సూచనలు ఇస్తే తప్పకుండా ప్రభుత్వం అంగీకరిస్తుందని సీఎం గుర్తు చేశారు. ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూస్తుందని, ఇలాంటి సమయంలో ఈ సిటీని అడ్వాన్స్ డా తీర్చిదిద్దకపోతే ప్రమాదంలో పడిపోతామన్నారు. భవిషత్యలో హైదరాబాద్ జనాభా రెండు కోట్ల 80 లక్షలకు చేరే ఛాన్స్ ఉన్నదని, ఇందుకు అనుగుణంగా ఇన్ ఫ్రా స్ట్రక్చర్, ఎక్విప్ మెంట్లన్నీ సమకూర్చాల్సిన బాధ్యత ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్, మండలి చైర్మన్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read: Hyderabad Crime: హైదరాబాద్ సిటీలో దారుణం.. భార్యని సుత్తితో కొట్టిన భర్త, ఆ తర్వాత పెయింట్ పోసి, చివరకు

Related News

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

Big Stories

×