Road Accident: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గుబనపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు, కారు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జవ్వగా.. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఇద్దరు పురుషులు ,ఒక మహిళ ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో మరణించిన వారంతా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాసులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు, కారు రెండూ వేగంగా ఉండటమే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న కళ్యాణదుర్గం పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదం జరగడానికి గల పూర్తి కారణాలను విశ్లేషిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు.
Also Read: సీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారా? కూటమి నేతలకు సజ్జల వార్నింగ్