Big Stories

Modi : మోదీపై బీబీసీ వివాదాస్పద డాక్యుమెంటరీ.. బ్రిటన్ ప్రధాని రియాక్షన్ ఇదే..?

Modi : బ్రిటన్ జాతీయ మీడియా సంస్థ బీబీసీ భారత్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రసారం చేసిన ఓ డాక్యుమెంటరీ తీవ్ర వివాదస్పదమైంది. ఇది మోదీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ డాక్యుమెంటరీపై భారత్ నుంచే కాక బ్రిటన్ లోనూ వ్యతిరేక వ్యక్తమవుతోంది. స్వయంగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. భారత్ ప్రధాని వ్యక్తిత్వాన్ని తప్పుపడుతూ డాక్యుమెంటరీలో చూపించడాన్ని ఖండించారు. భారత మూలాలున్న బ్రిటన్ జాతీయుల నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో కొన్ని మాధ్యమాల నుంచి ఆ డాక్యుమెంటరీని తొలగించారు.

- Advertisement -

ఈ డాక్యుమెంటరీలో ఏముంది?
‘India :The Modi Question’ పేరుతో బీబీసీ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. రెండు ఎపిసోడ్లుగా ప్రచారం చేసిన ఈ డాక్యుమెంటరీలో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 2002లో ఆ రాష్ట్రంలో జరిగిన అల్లర్లను ప్రస్తావించింది. వెయ్యిమందిపైగా ముస్లింలు ఈ దాడుల్లో చనిపోయారని తెలిపింది. ఈ అల్లర్లలో మోదీ పాత్రపై ఆరోపణలు వచ్చాయని పేర్కొంది. 2019లో ప్రధానిగా తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ వివాదాస్పద విధానాలు తీసుకొచ్చారని , జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించిన 370 ఆర్టికల్ ను రద్దు చేశారని వివరించింది. పౌరసత్వ చట్టం అమలు… ఇలాంటివన్నీ ముస్లింలకు అన్యాయం చేసేలా ఉన్నాయని పేర్కొంది. అయితే బీబీసీ రూపొందించిన ఈ డాక్యుమెంటరీ భారత్ లో ప్రసారం కాలేదు.

- Advertisement -

కేంద్రం రియాక్షన్..
బీబీసీ డాక్యుమెంటరీపై కేంద్ర విదేశాంగశాఖ తీవ్రంగా స్పందించింది. పక్షపాతం, నిష్పాక్షికత లేకపోవడం, వలసవాద మనస్తత్వం లాంటి అంశాలు డాక్యుమెంటరీలో స్పష్టంగా కనిపించాయని విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు. ఈ డాక్యుమెంటరీ ఉద్దేశ్యం, దాని వెనుక ఉన్న ఎజెండా ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు.

రిషి సునాక్ స్పందన ఇదే..
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ బ్రిటన్ పార్లమెంట్‌లో మోదీని సమర్థిస్తూ మాట్లాడారు. BBC సిరీస్‌లో భారత ప్రధాని పాత్రను అలా చూపించడాన్ని ఏకీభవించడం లేదన్నారు. పాకిస్థాన్ సంతతికి చెందిన ఎంపీ ఇమ్రాన్ హుస్సేన్ పార్లమెంట్‌లో ఈ డాక్యుమెంటరీ అంశాన్ని లేవనెత్తారు. ఈ సమయంలో సునాక్ మోదీపై తన వైఖరిని స్పష్టం చేశారు. భారత్ విషయంలో బ్రిటన్ ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. అయితే హింస ఎక్కడ జరిగినా తాము సహించనన్నారు.

బ్రిటన్ పౌరులు అభ్యంతరం..
బీబీసీ డాక్యుమెంటరీపై భారత మూలాలున్న పౌరులతోపాటు బ్రిటన్ పౌరులు విమర్శలు గుప్పించారు. బీబీసీ భారతీయులకు చాలా బాధ కలిగించిందని లార్డ్ రామి రేంజర్ అనే బ్రిటన్ పౌరుడు అన్నారు. బీబీసీ పక్షపాత రిపోర్టింగ్ కు పాల్పడిందని ఆరోపించారు. 1943 బెంగాల్ కరువుపై సిరీస్‌ను రూపొందించాలని అనేక మంది భారతీయ సంతతి వ్యక్తులు BBCకి సూచించారు. అప్పుడు బ్రిటీష్ పాలనలో ఉన్న బెంగాల్ లో పోషకాహార లోపం, ఇతర రోగాల వల్ల 30 లక్షల మంది మరణించారని గుర్తు చేశారు. BBC సిరీస్‌కు ” యూకే : చర్చిల్ ప్రశ్న” అని పేరు పెట్టాలని ఒక ట్విటర్ యూజర్ సూచించారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఇప్పుడు భారతదేశం ఉందని స్పష్టం చేశారు. బ్రిటన్ లోని సమస్యలపై దృష్టి పెట్టాలని కొంతమంది BBCకి సలహా ఇచ్చారు. మొత్తంమీద మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ పెనుదుమారాన్నే రేపింది. మరి బీబీసీ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News