E-Paper
Advertisement

China HQ-9B Failure: చైనాను నమ్ముకుంటే ఇదే గతి! ఇరాన్ పరిస్థితి చూసి ప్రపంచ దేశాలు షాక్

China HQ-9B Failure: చైనాను నమ్ముకుంటే ఇదే గతి! ఇరాన్ పరిస్థితి చూసి ప్రపంచ దేశాలు షాక్
Advertisement

China HQ-9B Failure: అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వేళ ఇరాన్‌ కొంప ముంచింది చైనా. ఇటీవల చైనా నుంచి తెచ్చుకున్న లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ.. HQ-9B ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విఫలమైంది. అది ఫెయిలవడంతో.. ఇజ్రాయెల్ మిసైళ్లని, డ్రోన్లని.. ఇరాన్ ఆపలేకపోయింది. ఫలితంగా.. ఆ దేశంలో భారీ ఆస్తి నష్టం, ప్రాణం నష్టం జరిగిందనే రిపోర్టులు వస్తున్నాయ్. టెహ్రాన్ సహా అనేక నగరాల్లో అమెరికా, ఇజ్రాయెల్ విధ్వంసం సృష్టించాయ్. ఈ దాడుల తర్వాత.. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థ గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. ఈ దాడిని ఇరాన్ ఎందుకు అడ్డుకోలేకపోయిందనే చర్చ మొదలైంది. ఇరాన్ తన రక్షణ వ్యవస్థని బలోపేతం చేసుకునేందుకు.. చైనా నుంచి HQ-9B వైమానిక రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసింది. కానీ, ఈ యుద్ధంలో అది ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. దాంతో.. చైనా ఆయుధాల విశ్వసనీయతపై ప్రశ్నలు వస్తున్నాయ్.

ఇరాన్–చైనా ఆయుధ ఒప్పందంపై చర్చలు

ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా ఉంది. కానీ.. ఇరాన్‌కు మద్దతుగా మిత్ర దేశం చైనా లేదు. అయినప్పటికీ.. డ్రాగన్‌కు చెందిన ఆయుధాలు అగ్నిపరీక్షని ఎదుర్కొంటున్నాయ్. బీజింగ్ అత్యంత ప్రచారం చేసిన సైనిక ఎగుమతుల్లో ఒకటైన HQ-9B ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.. ఏడాదిలోపు రెండు వరుస యుద్ధాల్లో విఫలమవడంతో.. ప్రపంచవ్యాప్తంగా దాని మీదే డిబేట్ మొదలైంది. గతేడాది జూన్‌లో.. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ తర్వాత.. ఇరాన్ తన ఎయిర్ డిఫెన్స్‌ని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది. చైనాతో చమురు-ఆయుధాల ఒప్పందంలో భాగంగా.. HQ-B9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని కొనుగోలు చేసింది.

ఇరాన్ కీలక ప్రదేశాల్లో HQ-9B వైఫల్యం

Advertisement

2025 యుద్ధంలో ఇజ్రాయెల్ క్షిపణులపై రష్యన్ S-300PMU-2 పేలవమైన పనితీరు తర్వాత ఇరాన్‌కు ఇదొక పెద్ద అప్‌గ్రేడ్. అయితే.. కొద్ది నెలల్లోనే అది ఎంత శక్తిమంతమైన ఆయుధమనేది బయటపడింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోలేక విఫలమైంది. టెహ్రాన్‌లోని కీలక ప్రదేశాలతో పాటు నాటాంజ్, ఫోర్డోలోని కీలకమైన అణు మౌలిక సదుపాయాలు, IRGC క్షిపణి, UAV స్థావరాలు, ఇస్ఫహాన్ సమీపంలోని వైమానిక స్థావరాల లాంటి కీలక ప్రదేశాలలో ఈ చైనా మేడ్ HQ-B9 డిఫెన్స్ సిస్టమ్‌ని మోహరించారు. కానీ.. ఇది ఇన్‌కమింగ్ మిసైళ్లని ఆపలేకపోయింది. టెహ్రాన్ సహా.. ఇరాన్‌లోని 31 ప్రావిన్సులలో 20కి పైగా ప్రాంతాలను తాకిన తాజా దాడులు.. భారీ నష్టాన్ని కలిగించాయ్. మౌలిక సదుపాయాలు ధ్వంసం అయ్యాయ్. 550 మందికి పైగా పౌరులు మరణించారని నివేదికలు చెబుతున్నాయ్.

చైనీస్ టెక్నాలజీ ఆశలన్నీ విఫలం

చైనాకు చెందిన ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్.. ఈ HQ-9Bని డెవలప్ చేసింది. దీనిని చైనా స్వదేశీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌గా అభివృద్ధి చేసింది. ఇది.. రష్యాకు చెందిన ఎస్-300PMU, అమెరికాకు చెందిన పేట్రియాట్ పీఏసీ-2 నుంచి స్ఫూర్తి పొంది తయారుచేశారు. దీని రేంజ్.. 260 కిలోమీటర్లు. 50 కిలోమీటర్ల ఎత్తువరకు ఉన్న టార్గెట్లని ఛేదించగలదు. యాక్టివ్ రాడార్ హోమింగ్, ఇన్‌ఫ్రారెడ్ సీకర్లతో.. ఒకేసారి 100 మిసైళ్లని ట్రాక్ చేస్తుంది. ఒకేసారి ఆరు నుంచి 8 మిసైళ్లని గాల్లోనే పేల్చేసే కెపాసిటీ ఉందని చైనా ప్రచారం చేసింది. దీనిని మొదటిసారి 2006లో పరీక్షించారు. 10 సంవత్సరాలుగా వాడుకలో ఉంది. అధిక ఎత్తులో ఉన్న మిసైళ్లని కూల్చేసే సత్తా ఉందని బాగా ప్రచారం చేశారు. టిబెట్, దక్షిణ చైనా సముద్రాన్ని రక్షించేందుకు.. చైనా వీటినే ఉపయోగిస్తోంది. ఇది అద్భుతంగా పనిచేస్తుందని, ఇజ్రాయెల్ మిస్సైళ్లని ఎదుర్కొంటుందని.. ఇరాన్ ఆశించింది. కానీ.. అమెరికా, ఇజ్రాయెల్ దగ్గరున్న అడ్వాన్స్‌డ్ ఫైటర్ జెట్లని ఇది ఏమాత్రం ఆపలేకపోయింది. పైగా.. చైనా ఇరాన్‌కి సప్లై చేసిన మూడు HQ-9B ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని.. యుద్ధం మొదలైన కొన్ని గంటల్లోనే.. అమెరికా ధ్వంసం చేసిందనే రిపోర్టులు వస్తున్నాయి. పాకిస్థాన్, వెనిజుయెలా తర్వాత చైనా ఆయుధాలు.. ఇరాన్‌లోని విఫలమయ్యాయ్. దీని టెక్నాలజీ సరిగా లేదని, లోపాలున్నాయేమోనని.. నిపుణులు ప్రశ్నిస్తున్నారు. చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గనక ఫెయిల్ అయి ఉండకపోతే.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఈరోజు బతికి ఉండేవారనే వాదనలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయ్.

బాహుబలుల్లా కనిపించిన చైనా HQ-9B

Advertisement

అంతర్జాతీయ రక్షణ రంగంలో చైనా తన ఉనికి చాటుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా, యుద్ధాలు వచ్చినప్పుడు మాత్రం ఆ దేశ ఆయుధాలు హ్యాండ్ ఇస్తూనే ఉన్నాయ్. చూడటానికి బాహుబలుల్లా కనిపిస్తాయ్.. కానీ.. యుద్ధరంగంలో మాత్రం అస్సలు సత్తా చాటలేకపోతున్నాయ్. ప్రస్తుతం.. ఇరాన్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితికి.. చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమే కారణం. చైనా HQ-9B సిస్టమ్‌ని నమ్ముకొని.. ఇరాన్ నిండా మునిగింది. ఇజ్రాయెల్ దాడుల నుంచి తమ గగనతలాన్ని కాపాడుకునేందుకు.. ఇరాన్, చైనాకు చెందిన అత్యున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని నమ్ముకుంది. ఇది.. రష్యాకు చెందిన S-300 సిస్టమ్‌కు ఏమాత్రం తీసిపోదని చైనా డబ్బా కొట్టుకుంది. కానీ, సీన్ కట్ చేస్తే.. ఇజ్రాయెల్ క్షిపణులు దూసుకొస్తున్నా ఈ సిస్టమ్ కనీసం అలర్ట్ కూడా చేయలేకపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ వాడుతున్న అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్స్, హై-స్పీడ్ మిసైళ్లని గుర్తించడంలో HQ-9B పూర్తిగా విఫలమైంది. రక్షణ కవచం ఉన్నా లేనట్లే కావడంతో.. ఇరాన్‌లోని కీలక ప్రదేశాలపై.. ఇజ్రాయెల్ ఈజీగా దాడులు చేయగలిగింది.

చిన్న దేశాల నమ్మకం మణుకుతోంది

చైనా ఆయుధాల వైఫల్యం ఇప్పుడేం కొత్తు కాదు. గతంలో.. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ.. పాకిస్థాన్‌కి గట్టి షాక్ తగిలింది. చైనా నుంచి కొనుగోలు చేసిన ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ మొరాయించడంతో.. పాక్‌కు గట్టిగా పగిలింది. అప్పుడు కూడా చైనా అభాసుపాలైంది. పాకిస్థాన్, ఇరాన్ మాత్రమే కాదు.. చైనా నుంచి ఆయుధాలు కొన్న మయన్మార్, నైజీరియా లాంటి దేశాలు కూడా ఇప్పుడు తలలు పట్టుకుంటున్నాయి. ఇరాన్‌లో సీన్లు చూశాక.. చైనా మేడ్ ఆయుధాలపై ప్రపంచంలోని చిన్న దేశాలకు నమ్మకం సన్నగిల్లిపోయింది. ఇందుకు అనేక కారణాలున్నాయ్. అందులో.. మొట్టమొదటిది కాపీ క్యాట్ టెక్నాలజీ. చైనా సొంతంగా పరిశోధనలు చేయడం కంటే.. రష్యా, అమెరికా టెక్నాలజీని కాపీ కొట్టేందుకే ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే.. కాపీ కొట్టిన ఆయుధం.. అసలు దానికి సాటి రాదనే విషయం ప్రూవ్ అవుతూనే ఉంటుంది. ఇక.. చైనా తన ఆయుధాల గురించి చేసే ప్రచారానికి, వాటి పర్ఫార్మెన్స్‌కి అస్సలు పొంతన ఉండదు. కాగితాల మీద అద్భుతంగా కనిపించే ఈ ఆయుధాలు.. వార్ గ్రౌండ్‌లో మాత్రం సౌండ్ చేయకుండానే సైలెంట్ అయిపోతున్నాయ్.

చైనా ఆయుధాల నాణ్యతపై అంతర్జాతీయ చర్చ

చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని.. ఆపరేషన్ సిందూర్ సమయంలో.. భారత్ నాశనం చేసింది. చైనాకు చెందిన HQ-9B రక్షణ వ్యవస్థను భారతసేన సమర్థవంతంగా ఎదుర్కొంది. పాకిస్థాన్ తన ఎయిర్‌బేస్‌లు, కీలక నగరాలను కాపాడుకునేందుకు HQ-9B లను మోహరించింది. కానీ.. ఇజ్రాయెల్ హరోప్ డ్రోన్లు సహా, భారత్ చేసిన దాడులు HQ-9B యూనిట్లను తీవ్రంగా దెబ్బతీశాయి. ఆయుధాల తయారీలో.. చైనా ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంది. కేవలం తక్కువ ధరకే వస్తున్నాయి కదా అని కొనుగోలు చేస్తే.. చివరికి ఇరాన్ లాగే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. డ్రాగన్ వెపన్స్‌ని నమ్ముకోవడం అంటే.. యుద్ధంలో చేతులెత్తేయడమే. చైనా ఆయుధాల నాణ్యత, ఇరాన్ పరిస్థితిపై.. అంతర్జాతీయ రక్షణ రంగంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. చైనా వస్తువులకే కాదు ఆయుధాలకు కూడా నో గ్యారంటీ అనే మాట రక్షణ రంగంలోని నిజమైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.

Also Read: ట్రంప్ ప్లాన్ ‘బిస్కెట్’.. ఇరాన్ ఉచ్చులో అమెరికా!

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×