E-Paper
Advertisement

Iran Strong Warning: అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఇరాన్.. పశ్చాత్తాపం తప్పదని వ్యాఖ్య

Iran Strong Warning: అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఇరాన్.. పశ్చాత్తాపం తప్పదని వ్యాఖ్య
Advertisement

Iran Strong Warning: అమెరికాపై మరోసారి ఇరాన్ విరుచుకుపడింది. అంతేకాదు ఈసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. త్వరలో అమెరికా పశ్చాత్తాపం పడుందుని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చి వ్యాఖ్యానించారు. చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పదని వ్యాఖ్యానించారు. ఇరాన్ ఆగ్రహం వెనుక అసలేం జరిగింది?

అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఇరాన్

Advertisement

విశాఖలో ఫిబ్రవరి 18 నుంచి 25 బంగాళాఖాతంలోమిలన్ ఇంటర్నేషనల్-2026 ఫ్లీట్ రివ్యూ జరిగింది. ఇండియన్ నేవీ ఆహ్వానం మేరకు ఇరాన్ నుంచి ఫ్రిగేట్-క్లాస్ యుద్ధ నౌక వచ్చింది. విశాఖలో కార్యక్రమం తర్వాత తిరిగి వెళ్తుండగా శ్రీలంక దక్షిణంగా హిందూ మహా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో అమెరికా దాడి చేసింది.

ఈ ప్రమాదం సమయంలో 130 మందికి 87 మంది మరణించారు. మరో 30 మందిని శ్రీలంక నేవీ రక్షించించింది. మిగిలినవారి కోసం గాలింపు చేపట్టారు. దీనిపై అమెరికా బహిరంగ ప్రకటన చేసింది. ఇరాన్ యుద్ధ నౌకను పేల్చేశామని, అందులోని వారంతా చనిపోయారని వ్యాఖ్యానించింది. దీనిపై ఇరాన్ నోరు విప్పింది.

Advertisement

అంతర్జాతీయ జలాల్లో యుద్దనౌక్ పేల్చివేతపై ఇరాన్ ఆగ్రహం

ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చి ఈ దాడి తీవ్రంగా ఖండించారు. సముద్రంలో జరిగిన దారుణమైన ఘటనగా అభివర్ణించారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండో ప్రపంచ యుద్ధం అంటే 1945 తర్వాత మొదటిసారి అమెరికా ఇలాంటి ఘటనకు పాల్పడిందని వ్యాఖ్యానించారు.

ఇరాన్‌లో కొత్త సుప్రీం ఎవరొచ్చినా చట్టబద్ధమైన లక్ష్యంగా పరిగణించబడతారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ వ్యాఖ్యల తర్వాత తొలిసారి ఇరాన్ నుంచి ఆ తరహా హెచ్చరిక వచ్చింది. అమెరికా-ఇజ్రాయెల్ నేతల వ్యాఖ్యలు.. దానిపై ఇరాన్ సీరియస్‌గా స్పందించడంతో యుద్ధం ఇప్పట్లో ఆగడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ALSO READ: హార్ముజ్ జలసంధి రవాణాపై ఇరాన్ సంచలన ప్రకటన.. భారత్, చైనాకు గుడ్ న్యూస్

 

Related News

చర్చిలో తీవ్ర విషాదం.. ప్రార్థన చేస్తుండగా పాస్టర్‌పై పడ్డ భారీ శిలువ.. వీడియో వైరల్!

నోరు విప్పిన జేడీ వాన్స్.. భారత్ విషయంలో నోరు జారాను, అది సరైనది కాదని క్లారిటీ

మంటల్లో ఫ్రాన్స్‌.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

Big Stories

Advertisement
×