E-Paper
Advertisement

U.S. Iran War: ట్రంప్ ప్లాన్ ‘బిస్కెట్’.. ఇరాన్ ఉచ్చులో అమెరికా!

U.S. Iran War: ట్రంప్ ప్లాన్ ‘బిస్కెట్’.. ఇరాన్ ఉచ్చులో అమెరికా!

U.S. Iran War: రైట్.. ఎవరో ఒకరిపై యుద్ధం చేయాలి.. వారం రోజుల్లోనే ప్యాకప్ చేసేయాలి, ఒక విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలి. ఇదీ అమెరికా ఉద్దేశం. కాదు.. ఇది ట్రంప్ తహతహ. అవును ఏదో జరగరానిది జరిగిపోతోంది.. ఇరాన్ తమను శాసిస్తుందని ఊహించేసుకుని ఇజ్రాయెల్ కు సపోర్ట్ గా అమెరికా యుద్ధ రంగంలోకి దిగింది. ఇన్ డైరెక్ట్ సపోర్ట్ ఇవ్వడం వేరు. డైరెక్ట్ గా యుద్ధంలోకే దిగడం ట్రంప్ కు యుద్ధ కాంక్ష ఎలా ఉందో చెబుతోంది. అంతా బాగానే ఉన్నా.. అమెరికా ఓవర్ యాక్షన్.. ఆ దేశానికే ఇప్పుడు సమస్యగా మారుతోంది. క్షిపణి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయ్.

చిన్న డ్రోన్లు, పెద్ద నష్టం

యుద్ధం మొదలైన నాటి నుంచి మార్చ్ 4 వరకు ఇరాన్ లోని 2 వేల టార్గెట్స్ పై అమెరికా దాడులు చేసింది. 17 ఇరానియన్ షిప్స్ ను ధ్వంసం చేసింది. ఒక సబ్ మెరైన్ ను బ్రేక్ చేసింది. ఇరాన్ దగ్గర వేలాదిగా సూసైడల్ డ్రోన్లు ఉన్నాయి. అవి చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసినవి. ఇక్కడ అమెరికా పరిస్థితి ఎలా ఉందంటే.. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం మాదిరిగా అవుతోంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర షాహెద్ డ్రోన్లు వేలాదిగా ఉన్నాయి. వీటిని నిలువరించేందుకు అమెరికా ఖరీదైన ఇంటర్ సెప్టార్లను వాడుతోంది. ఆయుధ నిల్వలన్నీ వేగంగా కరిగిపోతున్నాయ్ కూడా.

10 రోజుల్లో అమెరికా నిల్వలు ఖాళీ?

ఇరాన్‌పై సాగిస్తున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో అమెరికా తన అత్యాధునిక క్షిపణులను అంటే SM-3, SM-6, పేట్రియాట్ ఇంటర్సెప్టార్లను భారీగా వాడుతోంది. ఇదే వేగంతో దాడులు కొనసాగితే, మరో 10 రోజుల్లో అమెరికా నిల్వలు అట్టడుగు స్థాయికి పడిపోతాయని పెంటగాన్ ట్రంప్ ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. ప్రస్తుత యుద్ధంలో క్షిపణుల వినియోగం ఎక్కువగా ఉండటం, వాటి తయారీకి సమయం పట్టడం వల్ల రీప్లేస్‌మెంట్ కష్టమవుతోంది. ముఖ్యంగా ఇరాన్ ప్రయోగిస్తున్న వందలాది డ్రోన్లను అడ్డుకోవడానికి అమెరికా ఖరీదైన ఇంటర్సెప్టర్లను వాడాల్సి వస్తోంది. ఈ నిల్వలు అయిపోతే గనక గల్ఫ్ దేశాల్లోని కీలకమైన అమెరికన్ సైనిక స్థావరాలు, రాడార్ సెంటర్లకు అలాగే ఇజ్రాయెల్‌కు రక్షణ కల్పించడం అసాధ్యమని పెంటగాన్ వార్నింగ్ కూడా ఇచ్చింది.

ట్రంప్ అంచనాలు విఫలం

రైట్ చూశారుగా ట్రంప్ డాంబికాలు. తమ దగ్గర అన్ లిమిటెడ్ వెపన్స్ ఉన్నాయని ఇరాన్ దగ్గరే అయిపోయాయంటున్నారు. ఓవైపు ఇజ్రాయెల్ కు సైనిక సహాయం, ఇంకోవైపు గతంలో ఉక్రెయిన్ కు సైనిక సహాయం చేస్తూ వచ్చింది అమెరికా. దీంతో చాలా వరకు ఆయుధ నిల్వలను ఇస్తూ వెళ్లడంతో అమెరికా దగ్గర నాన్ స్టాప్ గా యుద్ధం చేసేంత పరిస్థితి లేదు. అసలు ట్రంప్ ఉద్దేశం ఏంటంటే.. ఇరాన్ తొందరగా చేతులెత్తేస్తుంది.. లొంగిపోతుంది.. యుద్ధం వారం రోజుల్లో అయిపోతుందని ఊహించుకుని ఉండవచ్చు. కానీ అలా జరగడం లేదు. సిచ్యువేషన్ గ్రహించిన ట్రంప్ మరో మాట అన్నారు. ఈ యుద్ధం నాలుగైదు వారాల దాకా కొనసాగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అంటే ఇరాన్ ఇప్పుడప్పుడే ఓటమిని అంగీకరించే పరిస్థితి లేదన్న విషయం ట్రంప్ కు చాలా లేట్ గా అర్థమైంది. ఇరాన్ అలసిపోయింది. కానీ అవుట్ మాత్రం కాలేదు.

అమెరికా తీరుపై అంతర్జాతీయ ఫైర్

తమ దగ్గర ఆయుధాల పరిస్థితి నెమ్మదిగా అర్థం చేసుకుంటున్న ట్రంప్ మరో మాట కూడా అన్నారు. ఇరాన్ తలొగ్గి చర్చలకు వస్తే బెటర్ అన్నారు. తలొగ్గకపోవడం వల్లే తాము యుద్ధంలోకి దిగామన్న పరిస్థితిని ట్రంప్ మర్చిపోయారా అన్న ప్రశ్నలు వస్తున్నాయ్. అసలు ఇరాన్ ను చెప్పినట్లు నడుచుకునేలా చేసుకుంటామనుకున్న ట్రంప్ ఆశలు వర్కవుట్ అవడం లేదు. పైగా ఇరాన్ కు సపోర్ట్ గా అటు రష్యా, ఇటు చైనా రోజూ స్టేట్ మెంట్లు రిలీజ్ చేస్తున్నాయి. అమెరికా తీరుపై ఫైర్ అవుతున్నాయి కూడా. యుద్ధం నెక్ట్స్ లెవెల్ లో ఏమైనా జరగొచ్చు. సో ట్రంప్ అనుకున్నది అంత ఈజీగా జరగకపోవచ్చు అన్నది యుద్ధం తీరు చూస్తే అర్థమవుతున్న విషయం.

ట్రంప్ కి సవాలు

ట్రంప్‌కు సుదీర్ఘ పోరాటం చేసే ఆప్షన్లు కనిపించడం లేదు. ఇప్పటికే అమెరికన్ మార్కెట్లు చాలా సమతమతమవుతున్నాయి. భయపెడితే భయపెట్టించడం ట్రంప్ నైజం. అదే సమయంలో తిరగబడితే.. మాత్రం దారికొస్తారనడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. హౌతీలు అమెరికా నౌకలపై దాడులను ఆపడానికి అంగీకరించే ఒప్పందానికి ట్రంప్ గతంలో అంగీకరించారు. హౌతీల దాడి సామర్థ్యాలను పూర్తిగా దిగజార్చడానికి కొన్ని నెలల టైం పడుతుందని అర్థమవడంతో ట్రంప్ వెనక్కు తగ్గారు. అదీ లెక్క. ఇప్పుడు కూడా ఇరాన్ పై యుద్ధంలో అదీ సీన్ కనిపిస్తోంది. అమెరికాకు ప్రాణనష్టం, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక నష్టాలు, మిత్రదేశాలైన గల్ఫ్ దేశాలను రక్షించడంలో వైఫల్యం ఇవన్నీ మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు చాలా వరకు దెబ్బతిన్నాయ్ కూడా.

అమెరికాకు ఖర్చుతో కూడిన సవాల్

ఇరాన్ ను అమెరికా చాలా తక్కువ అంచనా వేసింది. ఒకటి రెండు రోజుల్లోనే తోక ముడుస్తుందనుకుంది. కానీ అలా జరగట్లేదు. ట్రంప్ కూడా నాలుగైదు వారాలు యుద్ధం జరుగుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ట్రంప్ ఊహించినదానికంటే ఎక్కువ రోజులే వార్ సీన్లు కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌లోని లక్ష్యాలతో పాటు బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇరాక్‌లలోని అమెరికా సైనిక స్థావరాలు, ఆస్తులపై ఇరాన్ ఎటాక్స్ పెంచింది. దీంతో పెంటగాన్ లో టెన్షన్ మొదలైంది. తగ్గిపోతున్న ఆయుధ నిల్వలను మళ్లీ రిటైన్ చేయాలంటే ఎక్కువ ఖర్చు కూడా రెడీగా ఉంది. ఇదే అమెరికాకు పెద్ద సవాల్.

అమెరికా ‘ఎపిక్ ఫ్యూరీ’ ఆపరేషన్

అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం ఇరాన్‌పై కొనసాగుతున్న ఆపరేషన్‌లో వాయు, సముద్రం, భూమి, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ లో 20 కంటే ఎక్కువ ఆయుధ వ్యవస్థలను ప్రయోగించింది. అమెరికా B-1 బాంబర్లు, B-2 స్టెల్త్ బాంబర్లు, F-35 లైటెనింగ్ II స్టెల్త్ ఫైటర్లు, F-22 రాప్టర్ జెట్లు, F-15లు అలాగే EA-18G గ్రోలర్లను రంగంలోకి దింపింది. వీటికి తోడు LUCAS వన్ వే డ్రోన్‌లు, MQ-9 రీపర్ డ్రోన్‌లు, M-142 హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్, టోమ్ హాక్ క్రూయిజ్ క్షిపణులతో సహా లాంగ్ రేంజ్ సిస్టమ్స్ ను వాడుతోంది. వీటికి తోడు పేట్రియాట్, THAAD ఎయిర్ డిఫెన్ సిస్టమ్, ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానాలు వంటి గగనతల రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తోంది. ఇక ఇరాన్‌పై దాడి ప్రారంభమైనప్పుడు రెండు అమెరికన్ ఎయిర్ క్యారియర్లు, USS అబ్రహం లింకన్, USS జెరాల్డ్ R ఫోర్డ్ కూడా మిడిల్ ఈస్ట్ లో యుద్ధ రంగంలో పని చేస్తున్నాయి. వీటిని ఆపరేట్ చేయాలంటే మాటలు కాదు. అన్నిటినీ ప్రయోగిస్తున్న అమెరికాకు అసలు కథ మరికొద్ది రోజుల్లో మొదలు కాబోతోంది. కీలకమైన ఆయుధాలు తగ్గుతుండడం, ప్రాంతీయ మిత్రదేశాల నుంచి సపోర్ట్ లేకపోవడం వల్ల అమెరికాపై దాడి జరిగితే ఇరాన్ ప్రతీకార చర్యను ఆపే ప్రయత్నాలకు బ్రేకులు పడుతాయని పెంటగాన్ వార్నింగ్ ఇచ్చింది.

ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌కు సపోర్ట్

ఇజ్రాయెల్, ఉక్రెయిన్ వంటి మిత్రదేశాలకు అమెరికా చాలా వరకు ఆయుధ సహాయం చేస్తూ వస్తోంది. దీంతో కూడా అమెరికా ఆయుధ నిల్వలు తగ్గాయన్న రిపోర్టులు ఉన్నాయి. గతేడాది జూన్ 13 నుండి 24 వరకు ఇరాన్ ఇజ్రాయెల్‌ మధ్య 12 రోజుల యుద్ధం జరిగింది. నాడు కూడా ఇజ్రాయెల్ కు అమెరికా సపోర్ట్ గా రంగంలోకి దిగి ఇరానియన్ అణు కేంద్రాలపై బాంబు దాడులు చేసింది. ఆ టైంలో అమెరికా తన రెండు అధునాతన THAAD క్షిపణి రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్‌ లో మోహరించింది. THAAD అన్నది అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థ. ఇది రాడార్ ఇంటర్‌సెప్టర్ క్షిపణులను ఉపయోగించి 150-200 కిలోమీటర్ల దూరంలో ఉన్న షార్ట్, మిడ్ రేంజ్ మిసైల్స్ ను కూల్చేస్తుంది. గతేడాది ఇరానియన్ క్షిపణులను అడ్డుకోవడానికి ఈ మిసైల్స్ ను 150 కంటే ఎక్కువ ప్రయోగించాల్సి వచ్చింది. సో అమెరికన్ మీడియా రిపోర్టుల ప్రకారం గతేడాది యుద్ధ సమయంలో అమెరికా వద్ద పెద్ద సంఖ్యలో నౌకల ద్వారా ప్రయోగించే ఇంటర్‌సెప్టర్లు కూడా అయిపోయాయి.

యుద్ధంలో నిల్వలు తగ్గుతున్న అమెరికా

నిజానికి ఇంటర్‌సెప్టర్లు, మందుగుండు సామగ్రిని సేకరించడం, జాయింట్ చేయడం, టెస్టింగ్ కు నెలల కొద్దీ టైం పడుతుంది. తర్వాత సముద్రం, వాయుమార్గాల ద్వారా రవాణా చేయడానికి, వాటిని సెట్ చేయడానికి, అమలు చేయడానికి ఇంకా అదనంగా చాలా సమయమే పడుతుంది. అధునాతన ఇంటర్‌సెప్టర్‌ల లిమిటెడ్ స్టాక్స్ చాలా తక్కువ ఉంటుంది. చిన్న క్షిపణిని కూల్చేయడానికి కూడా పెద్ద ఇంటర్ సెప్షన్ ను వాడాల్సి వస్తుంది. అటు స్టాండర్డ్ మిస్సైల్-3 అంటే SM-3 నిల్వలు ఇప్పటికే తగ్గిపోతున్నాయి. ఉత్పత్తి తగ్గడం, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులపై దాడులు, ఇరాన్‌తో మునుపటి ఘర్షణలతో ఇవి కూడా తగ్గిపోయాయ్. SM-3 అన్నది యుద్ధనౌకల నుంచి ప్రయోగించే యాంటీ బాలిస్టిక్ మిసైల్ ఇంటర్‌సెప్టర్. అమెరికా ఆయుధ నిల్వలు తగ్గడం ఒకటైతే.. ప్రస్తుత యుద్ధంలో కువైట్‌లో మూడు యుఎస్ జెట్‌లు కూలిపోయాయి. ఇలాంటి నష్టాలు కూడా మరెన్నో చూడాల్సి వస్తుంది.

24 గంటల్లో 779 మిలియన్ డాలర్ల ఖర్చు

అమెరికా ట్రిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్‌ తో యుద్ధానికి సంబంధించి ఆర్థిక వ్యయాన్ని భరించగలిగినప్పటికీ, పేట్రియాట్, SM-6 వంటి ఇంటర్‌సెప్టర్ మిసైల్స్ ను వెను వెంటనే తయారు చేయడం పెద్ద సవాల్. ఇరాన్‌లో తన ఆపరేషన్ ప్రారంభించిన మొదటి 24 గంటల్లో అమెరికా దాదాపు 779 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది, అంతేకాకుండా యుద్ధనౌకలను తరలించడం, డజనుకు పైగా షిప్స్ ను మోహరించడం, ముందస్తు కార్యకలాపాల కోసం మరో 630 మిలియన్లు ఖర్చు అయింది. ఇక USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వంటి ఎయిర్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌ను మెయింటేన్ చేయాలంటే రోజుకు సుమారు 6.5 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని సెంటర్ ఫర్ ఎ న్యూ అమెరికన్ సెక్యూరిటీ అంచనా వేసింది.

మిసైల్ అడ్డుకునే వ్యవస్థలపై ఒత్తిడి

2023 అక్టోబర్ 7న జరిగిన హమాస్‌ దాడి తర్వాత నుంచి ఇజ్రాయెల్‌కు అమెరికా 21.7 బిలియన్‌ డాలర్ల విలువైన సైనిక సాయాన్ని అందించింది. ఇది కాకుండా.. యెమెన్‌, ఇరాన్‌, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా సాగిస్తోన్న ఆపరేషన్ల కోసం భారీగా ఖర్చు చేస్తోంది. అమెరికాకు ఇప్పటివరకు అయిన ఖర్చు 31.35 బిలియన్‌ డాలర్ల నుంచి 33.77 బిలియన్‌ డాలర్లకు పైమాటే అంటున్నారు. ఇరాన్‌ ఘర్షణలు మరింతకాలం కొనసాగితే.. ఈ ఆర్థిక భారం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఖర్చు పరంగా చూస్తే అమెరికాకు పెద్ద విషయం కాకపోవచ్చు. ఎందుకంటే అమెరికా రక్షణ బడ్జెట్‌ ప్రస్తుతం ట్రిలియన్‌ డాలర్ల పైనే ఉంది. ఇప్పుడు దాన్ని 1.5 ట్రిలియన్‌ డాలర్ల వరకూ పెంచే ఛాన్స్ ఉంది. అసలు సమస్య ఏంటంటే ఈ యుద్ధంలో అమెరికా కీలక ఆయుధాలను కోల్పోవడమే. ఉద్రిక్తతలు కంటిన్యూగా కొనసాగితే మిసైల్స్ ను అడ్డుకునే వ్యవస్థలు పనిచేయడం కష్టం.

Also Read:యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో మేమే తేలుస్తాం.. ఇరాన్ వార్నింగ్ వెనుకున్న బలమేంటి?

Story by: Anup, Big Tv

Related News

Trading Scam: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో రూ. 25 కోట్ల భారీ స్కామ్.. షాక్‌లో బాధితులు..?

Ameenpur Lake: డేంజర్ బెల్స్.. మాయమైపోతున్న అమీన్‌పూ‌ర్ పెద్ద చెరువు..?

కిలాడీ జంట లగ్జరీ లైఫ్ బిల్డప్.. తెరవెనుక కోట్లలో చీటింగ్.. నందూస్ వరల్డ్ జంట అసలు రంగు బట్టబయలు..?

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

Big Stories

×